శ్రీహర్ష, దక్ష, వేణుగోపాల్, బాబీ, తేజస్
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, హేమ ఇంగ్లే, ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రల్లో శ్రీహర్ష కానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. రియాజ్ మరో నిర్మాత. ఈ సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – ‘‘రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ రిలాక్స్‌గా అనిపిస్తోంది. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిసెంబర్ 7 మంచి డేట్ అని సలహా ఇచ్చారు. అలాగే రిలీజ్ చేస్తున్నాం. ఈలోపు ఏమైనా మార్పులు ఉంటే సరిదిద్దుకుంటాం.
7వ తేదీన తెలంగాణ లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఏపీ, ఓవర్‌సీస్‌కు మంచి డేట్ అనుకున్నాం. ఫ్రెష్ ఫీల్‌తో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలుగురు ఫ్రెండ్స్ సరదాగా థియేటర్స్‌కు వెళ్ళి చూసే సినిమా. సెట్లో అందరం ఫ్రెండ్స్‌లా ఎంజాయ్ చేశాం. రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్విస్తుంది. జీవితమంటే జ్ఙాపకాలు. వాటిని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ‘‘వేణుగోపాల్‌గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు. కొత్త కొత్త ఐడియాలతో వస్తుంటారు’’ అన్నారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బాబీ. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment