
టాలీవుడ్‌కు ఒక ఫార్ములా ఉంది. పైగా అది ఎప్పుడు సక్సెస్ అయ్యే ఫార్ములా. అదే ప్రేమకథ. ఇప్పటివరకు టాలీవుడ్‌లో లెక్కలేనన్ని ప్రేమకథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వస్తాయి. తాజాగా మరొక ప్రేమ కథ మనముందుకు రాబోతోంది. ‘ఈ మాయ పేరేమిటో’ అంటూ కొత్త హీరో, హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను నాగచైతన్య రిలీజ్ చేశారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తుండటం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ 36 సెకన్ల టీజర్.. పూర్తిగా నేపథ్య సంగీతంతోనే నడిచింది. ‘ఇంతలా ప్రేమిస్తే.. నా దగ్గర తిరిగివ్వడానికేం లేదు’ అనే ఒక్క డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. రాహుల్ విజయ్, కావ్యా థాపర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దివ్యా విజయ్ నిర్మించగా, రమేష్ కొప్పుల దర్శకత్వం వహించారు.
Yuva Samrat @chay_akkineni launched the teaser of @ActorRahulVijay & @KavyaThapar’s #EeMayaPeremito
— BARaju (@baraju_SuperHit) June 12, 2018
A Mani Sharma Musicalhttps://t.co/6NcWrePC9p pic.twitter.com/Afc6IYTleL
Comments
Please login to add a commentAdd a comment