Naga Chaitanya’s 'Custody' teaser will be out on this date - Sakshi
Sakshi News home page

Naga Chaitanya : నాగచైతన్య 'కస్టడీ' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌.. 

Mar 14 2023 11:18 AM | Updated on Mar 14 2023 11:34 AM

Naga Chaitanya Custody Teaser Will Be Out On This Date - Sakshi

యంగ్‌ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అతనికి జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బంగార్రాజు తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రమిది.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రంపై మరింత క్యూరియాసిటీని పెంచుతూ మరో క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈనెల  సాయంత్రం 4.51 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఈ మేరకు ఓ వీడియోను వదిలారు. కాగా  సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రాధికా శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్‌ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement