అందరూ నా కస్టడీ లోకి రావాలి | NagaChaitanya Speech At Custody Pre Release Event | Sakshi
Sakshi News home page

అందరూ నా కస్టడీ లోకి రావాలి

Published Mon, May 8 2023 1:04 AM | Last Updated on Mon, May 8 2023 1:04 AM

NagaChaitanya Speech At Custody Pre Release Event - Sakshi

శ్రీనివాసా చిట్టూరి, ప్రియమణి, కృతీశెట్టి, నాగచైతన్య, వెంకట్‌ ప్రభు, పవన్‌ కుమార్‌

‘‘కస్టడీ’ సినిమా తొలి 20 నిమిషాలు డైరెక్టర్‌ వెంకట్‌గారిలా కూల్‌గా వెళుతుంది. 40వ నిమిషం నుంచి ఫాస్ట్‌గా వెళుతుంది.. థియేటర్లో బ్లాస్టే. అద్భుతమైన యాక్షన్స్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. నిజంగా ఒక కొత్త చైతూని (నాగచైతన్య) చూడబోతున్నారు.. అలా నా పాత్రని తీర్చిదిద్దారు వెంకట్‌గారు. ఈ నెల 12న మీరందరూ (ప్రేక్షకులు, అభిమానులు) నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నాగచైతన్య అన్నారు.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘కస్టడీ’ కథని వెంకట్‌గారు నాకు చెప్పినప్పుడు తొలిసారి నేను పైకిలేచి వెంటనే ఆయన్ని హత్తుకున్నా.. నాకు అంత ఎగై్జట్‌మెంట్‌ ఇచ్చింది ఈ కథ.

ఎడిటింగ్‌ రూంలో చూసినప్పుడు కూడా అదే ఎగై్జట్‌మెంట్‌ వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా. అజిత్, సూర్య, కార్తీ, శింబుగార్లతో వెంకట్‌గారు సినిమాలు తీసి తమిళ్‌లో ఎన్నో పెద్ద హిట్స్‌ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన ఆయనకు స్వాగతం. నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌ మూవీ ‘కస్టడీ’ అని చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్, పవన్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు.

వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతన్యగారి స్టైల్, యాక్షన్, నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్‌... ఇలా అన్నీ ఉన్నాయి. ఈ మూవీలో మీకు ఓ పెద్ద సర్‌ప్రైజ్‌ ఉంటుంది. ‘కస్టడీ’ రెండో పార్ట్‌ కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘అందరూ థియేటర్స్‌కి వచ్చి ‘కస్టడీ’ చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు నటి ప్రియమణి. ఈ వేడుకలో కృతీశెట్టి, నటుడు ప్రేమ్‌జీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement