Pre-release ceremony
-
అందరూ నా కస్టడీ లోకి రావాలి
‘‘కస్టడీ’ సినిమా తొలి 20 నిమిషాలు డైరెక్టర్ వెంకట్గారిలా కూల్‌గా వెళుతుంది. 40వ నిమిషం నుంచి ఫాస్ట్‌గా వెళుతుంది.. థియేటర్లో బ్లాస్టే. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నాయి. నిజంగా ఒక కొత్త చైతూని (నాగచైతన్య) చూడబోతున్నారు.. అలా నా పాత్రని తీర్చిదిద్దారు వెంకట్‌గారు. ఈ నెల 12న మీరందరూ (ప్రేక్షకులు, అభిమానులు) నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘కస్టడీ’ కథని వెంకట్‌గారు నాకు చెప్పినప్పుడు తొలిసారి నేను పైకిలేచి వెంటనే ఆయన్ని హత్తుకున్నా.. నాకు అంత ఎగై్జట్‌మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు కూడా అదే ఎగై్జట్‌మెంట్ వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా. అజిత్, సూర్య, కార్తీ, శింబుగార్లతో వెంకట్‌గారు సినిమాలు తీసి తమిళ్లో ఎన్నో పెద్ద హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన ఆయనకు స్వాగతం. నా కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ‘కస్టడీ’ అని చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్, పవన్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతన్యగారి స్టైల్, యాక్షన్, నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్... ఇలా అన్నీ ఉన్నాయి. ఈ మూవీలో మీకు ఓ పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ‘కస్టడీ’ రెండో పార్ట్ కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘అందరూ థియేటర్స్‌కి వచ్చి ‘కస్టడీ’ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు నటి ప్రియమణి. ఈ వేడుకలో కృతీశెట్టి, నటుడు ప్రేమ్‌జీ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన నాకెప్పటికీ హీరోలా కనిపిస్తారు
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. ‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్‌కు ప్లస్ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘‘ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , నవీన్, ఎడిటర్ జస్విన్ ప్రభు పాల్గొన్నారు. -
హిట్ అయితే నేను కూడా లక్కీయే
మొగలి రేకులు ఫేమ్ వీర్‌సాగర్ (ఆర్కే నాయుడు), దృశ్యా రఘునాథ్ జంటగా పద్మశ్రీ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘షాదీ ముబారక్’. నేడు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ రోజు సాగర్ నా దగ్గరకు వచ్చి ఈ ట్రైలర్ చూపించినప్పుడు బాగుందని చెప్పా. అక్కడ నుంచి కష్టాలు మొదలయ్యాయి. సినిమా చూసినప్పుడు కొన్ని కరెక్ష¯Œ ్స చెప్పడమే కాకుండా ఫైనాన్షియల్‌గా కూడా కాస్త సపోర్ట్ చేసి, సినిమాను పూర్తి చేశాను. సాధారణంగా స్క్రిప్ట్ దగ్గర నుంచి ట్రావెల్ అయినప్పుడే మా బ్యానర్ పేరు ఇస్తారు. కానీ సినిమా బాగుందని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ. పద్మశ్రీ ఇంట్రెస్టింగ్గా సినిమాను తీశారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు నవ్వుతూ వెళతారనే గ్యారంటీ ఇస్తా’’ అన్నారు. ‘‘దిల్’ రాజు ఎంతో సపోర్ట్ చేశారు’ అన్నారు పద్మశ్రీ. ‘‘దిల్’రాజుగారి సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు’’ అన్నారు కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి. అందుకే సినిమాల్లోకి వచ్చాను: వీర్ సాగర్ మాట్లాడుతూ – ‘‘సీరియల్స్‌లో నేను పెద్ద పాత్రలు పోషించాను. ఎన్ని సీరియల్స్ చేసినా అంత కన్నా పెద్ద పాత్రలు అయితే రావు. అందుకే సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో కొత్తగా అనిపించింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక ఎన్నారై యువకుడు పెళ్లిచూపుల కోసం ఇండియా వస్తాడు. అక్కడ ఓ మ్యారేజ్ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని కలుస్తాడు. వారి ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘షాదీ ముబారక్’ సినిమా కథ’’ అన్నారు. -
మనతో పాటు ఇంటికి వచ్చే చిత్రం జాను
‘‘96’ సినిమాను రీమేక్ చేయొద్దు అని’ రాజుగారికి నా అభిప్రాయం చెప్పాను. శర్వానంద్, సమంత చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నా’’ అని నాని అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది తెలుగు రీమేక్. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జాను’ పాత్రలో సమంతను తప్ప ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. శర్వా కూడా ‘96’ చూసి సూపర్ అన్నాడు. ఒరిజినల్ ‘96’ చేసిన ప్రేమ్‌కుమార్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. షూటింగ్ సమయంలో శర్వా ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ తర్వాత మరో ఇబ్బంది. ఒక్కో అడ్డంకి దాటుకొని సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎన్నో జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకెళ్తారు’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్‌ని నిరుత్సాపరచకూడదని ప్రతి సినిమాకు భయపడుతుంటా. ప్రతిరోజు మొదటి సినిమా షూటింగ్‌లానే భావిస్తాను. ప్రతిరోజూ షూటింగ్లో మ్యాజిక్ జరుగుతుండేది. ప్రేమ్‌కుమార్ మ్యాజిక్‌ని రిపీట్ చేశారు. ఫ్యాన్స్ అందరూ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అన్నారు సమంత. ‘‘నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత వంటి హీరోయిన్స్‌తో నటించేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. లేకపోతే సన్నివేశాలను తినేస్తారు. ప్రతీ సినిమా వంద శాతం చెక్ చేసుకుంటుంది సమంత. అందుకే సూపర్‌స్టార్ అయింది. ఆరు నుండి తొంభై ఏళ్ల వరకూ అందరికీ ‘జాను’ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన టీమ్ అందరికీ థ్యాంక్స్. నానితో నా స్నేహం సారథి స్టూడియోస్‌లో ప్రారంభం అయింది. నేను, నరేశ్, నాని చాలా ట్రిప్స్‌కి వెళ్లే వాళ్లం’’ అన్నారు శర్వానంద్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శర్వా నా తొలి ఫ్రెండ్. శర్వానంద్, సమంత ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మర్స్. పోటీ పడి నటించారు. శర్వానంద్ చేసే ప్రతి సినిమాలో తనకు మంచి పేరు వస్తుంది. స్యామ్ ఎంచుకుంటున్న సినిమాలు చూసి గర్వపడుతున్నాను. రాజుగారికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలి. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. కొన్ని సినిమాలను ఇంటికి తీసుకెళ్తాం. ‘జాను’ మీతో పాటు ఇంటికి తీసుకువెళ్లే సినిమా’’ అన్నారు నాని. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులు సాయి కిరణ్, గౌరి మాట్లాడారు. -
థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు
‘‘చాలామంది హీరోలు మూడురాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు. కానీ, అది కొంతమందికే వస్తుంది. అలా ప్రేక్షకుల అభిమానంతో ఇంతదూరం రాగలిగాను. నాకు థియేటరే గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అని హీరో విశాల్ అన్నారు. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయికగా నటించారు. నిర్మాత శ్రీనివాస్ ఆడెపు ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘యాక్షన్’ 27వ చిత్రం. నా 26 చిత్రాల్లో నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఈ ‘యాక్షన్’లో అన్ని తగిలాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 150 కోట్ల బడ్జెట్ సినిమాలా అనిపిస్తుంది. కానీ, మా బడ్జెట్ 60కోట్లు. నిర్మాతలు బాగుండాలని సినిమాలు తీస్తారు సుందర్‌గారు. నేను నేల టిక్కెట్ కొని సినిమాలు చూస్తాను. అప్పుడే ప్రేక్షకులు ఏ సీన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారో గమనిస్తాను. ఈ సినిమాలో నా మిత్రుడు హీరో రానా ఒక ర్యాప్ పాడారు. త్వరలోనే మీరు వింటారు. శ్రీను మంచి విజన్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్’’ అన్నారు. ‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించలేదు. డైరెక్టర్ అవుదామని 6–7 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌లోకి వచ్చి ‘ఇస్మార్ట్‌శంకర్, గద్దలకొండ గణేశ్, రాజుగారి గది 3’ చిత్రాలను పంపిణీ చేశా. ఇప్పుడు ‘యాక్షన్’ సినిమాతో నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉం ది. ప్రిన్స్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు శ్రీనివాస్ ఆడెపు. ‘‘యాక్షన్’ చిత్రం నాకు డ్రీమ్ ప్రాజెక్ట్’’ అన్నారు తమన్నా. నటులు ఆదిత్, ప్రిన్స్, నటీమణులు ఐశ్వర్యా లేక్ష్మి, ఆకాంక్ష, సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మాట్లాడారు. -
వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి
‘‘డార్లింగ్ ఫ్యాన్స్... మీకు ప్రభాస్ (రోప్ సహాయంతో గాల్లోంచి కిందకు, వేదికపైకి ప్రభాస్ దిగారు) ఎంట్రీ ఓకేనా? ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఎక్కువ... చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్నేళ్లు ఇంత కష్టపడి సినిమా చేసి ఈ వేదికపై ఇంతమంది ఉన్నామంటే... కారణం మేము కాదు. ఈ చిత్రానికి పనిచేసిన ఎన్నో వేల మంది. వాళ్లందరి భుజాలపై మేం నిలబడి ఉన్నాం’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ‘బాహుబలి: ద కంక్లూజన్’. అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘బాహుబలి: ద బిగినింగ్’కి కొనసాగింపుగా తీసిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఎవరెవరు ఏమన్నారంటే... తప్పని తేలింది... తల తెగింది!: ప్రభాస్ ‘‘రెండున్నరేళ్లు ఓ సినిమా, రెండేళ్లు ఓ సినిమా కోసం ఎదురు చూసిన డార్లింగ్స్ (ఫ్యాన్స్) అందరికీ థ్యాంక్స్. మీ కోసమైనా ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ట్రై చేస్తా. మా ‘బాహుబలి’ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, నిర్మాతలు... అందరికీ థ్యాంక్స్. హిందీలో సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి నిర్మాతలు కరణ్ జోహార్, అనిల్ తడాని చాలా హెల్ప్ చేశారు. హిందీ ప్రేక్షకులు చాలామందికి మా ముఖాలు తెలీదు. కరణ్ జోహార్ సమర్పణ అనే పేరు వల్ల ఉత్తరాదిలో పెద్ద హిట్టయింది’’ అంటూ ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’, ‘వాడిది తప్పు అని తేలింది... తల తెగింది’ అనే డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు. రాజమౌళితో సినిమా జోక్ కాదు: నిర్మాత ప్రసాద్ దేవినేని శోభు, నేనూ ‘బాహుబలి’కి నిర్మాతలమైనా... నాలుగేళ్ల శోభు హార్డ్‌వర్క్, ప్యాషన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రాజమౌళితో సినిమా తీయడం జోక్ కాదు. అంత ఈజీ అసలు కాదు. హి ఈజ్ టోటల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్. నిర్మాత కూడా అతనితో సమానంగా హార్డ్‌వర్క్ చేయాలి. శోభు అంత హార్డ్ వర్క్ చేశాడు. ‘బాహుబలి’ ఓ విచిత్రమైన సినిమా!: రాజమౌళి ఎన్నో వేలమంది కష్టం ‘బాహుబలి’ సినిమా. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణంరాజుగారి దీవెనలు మాకెప్పుడూ ఉంటాయి. మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఆయన ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. మా గురువుగారు రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. ‘బాహుబలి’ ఎంత విచిత్రమైన సినిమా అంటే... ఫైట్స్‌కి ఫైట్ మాస్టర్ ఉండడు. డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. డ్యాన్సులకు ఫైట్ మాస్టర్ కావాలి. సీన్స్‌కి ఫైట్ మాస్టర్ కావాలి. ప్రతి సీన్లోనూ ఏదొకటి కదులుతుంది. అన్నిటికీ రిగ్గింగ్ కావల్సిందే. కింగ్ సాల్మన్ మాస్టర్ ఈ ఐదేళ్లూ మాతోనే ఉండి పనిచేశారు. ప్రపంచంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రిగ్గర్. మా ఆవిడ (రమా రాజమౌళి) కాస్ట్యూమ్స్ గురించి చెప్పడం లేదు. ఆవిడ గురించి ఏవీ (ఆడియో విజువల్) ప్లే చేశాం. మరీ ఎక్కువ పొగిడేస్తే మాట వినదు. స్టైల్‌గా ఈ మాట అనేసినా మళ్లీ భయం వేస్తోంది. నేనూ మనిషినే కాబట్టి హిట్స్ వచ్చినప్పుడు పొగరు, గర్వం పెరుగుతాయి. అలాంటప్పుడు ఓ మొట్టికాయ వేసి నన్ను నేలకు దించుతూ, ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తున్న నా భార్యకి థ్యాంక్స్. మరో స్టైలిష్ట్ ప్రశాంతికీ థ్యాంక్స్. మా అబ్బాయి కార్తికేయ నిర్మాత కావాలనుకుంటు న్నాడు. వాడికి దర్శకత్వమంటే ఆసక్తి లేకపోయినా ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంచి నిర్మాత అవుతాడు. ఎందుకంటే... వాడికి ప్రతి రూపాయి లెక్కే. కార్తికేయ ఇచ్చిన ఐడియాతో ‘బాహుబలి–2’ ట్రైలర్ కట్ చేశాం. మకుట టీమ్ నా హోమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో వంటిది. పీట్ అండ్ టీమ్‌కి థాంక్యూ. డీఓపీ సెంథిల్ కుమార్, ఎడిటర్ తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మా కల్యాణ్ (కోడూరి) అన్న, ‘బాహుబలి’ చిత్ర బృందం అందరికీ థ్యాంక్స్. ఆయన, నేనూ కొట్టుకున్నంత : రాజమౌళి మా సినిమా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్, నేనూ కొట్టుకున్నంత ఎవరూ కొట్టుకోరు. మేమిద్దరం స్పెండ్ చేసినంత టైమ్ ఎవరూ స్పెండ్ చేయరు. విజువల్ ఎఫెక్ట్స్‌పై నాకు చాలా గ్రిప్ ఉందని ప్రశంసిస్తుంటారు. వీఎఫ్ఎక్స్కి సంబంధించినంత వరకూ కమల్ కణ్ణన్‌గారు నా టీచర్. ఓ రోజు వీఎఫ్ఎక్స్ వర్క్‌ని బాగుందని చెప్పిన నేను ఆ తర్వాత రెండు రోజులకు అందులో చిన్న సమస్య ఉంది. మళ్లీ వర్క్ చేయొచ్చా? అనడుగుతా. తిట్టుకుంటూనే పని చేసిన కమల్ కణ్ణన్‌కి థాంక్స్. ఇది ‘బాహుబలి’ నామ సంవత్సరం: కె. రాఘవేంద్రరావు ఏప్రిల్ 28న ఉగాది అని విన్నాను. ఈ ఏడాదిని బాహుబలి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. అందరూ గొప్పగా యాక్ట్ చేశారు. తీశారు. గ్రాఫిక్స్, ఫిక్సెల్స్ నాకు తెలీవు. సినిమా గురించి చెప్పమంటే ఏమని చెప్పను? నిర్మాతలు శోభు, ప్రసాద్‌ల ధైర్యమని చెప్పనా? ప్రభాస్–రానాల యుద్ధమని చెప్పనా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పనా? నన్ను సెట్‌కు రమ్మని రాజమౌళి చాలా సార్లు పిలిచినా... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సి వస్తుందేమోనని వెళ్ళలేదు. బహుశా ‘బాహుబలి 3’ తీస్తే వెళ్లాలని ఉంది. నేను తీసినవాటిలో ‘అడవి రాముడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాలు ఉన్నాయి. ‘అడవిరాముడు’లో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని’ పాట ఉంది. ఇప్పుడైతే ఈ సాంగ్‌ను ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు. తరతరాలకు తరగని బాహుబలులవుతారు’ అని రాయించేవాణ్ణి. ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు ‘బొబ్బిలి బాహుబలి’ అని పేరు పెట్టేవాణ్ణి. కొందరు అవార్డుల గురించి మాట్లాడతారు. నాకైతే ఇప్పుడు ‘బాహుబలి’ అని బిరుదు ఇస్తే తీసుకోవాలని ఉంది. ఇస్తే హ్యాపీగా ఫీలవుతాను. జేమ్స్ కామెరూన్ సరసన చేరే సత్తా రాజమౌళికి ఉంది: కరణ్ జోహార్ ఇండియన్ మూవీని మరోమెట్టు ఎక్కించే వేదికపై ఉన్నానన్న భావన కలుగు తోంది. ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ గర్వకారణం. రాజమౌళికి ఇండియన్ ఫీల్మ్ మేకర్‌గానే కాదు, గ్లోబర్ ఫిల్మ్ మేకర్‌గా పేరు సంపాదించగల టాలెంట్ ఉంది. నిజానికి ఇది ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ కాదు. ఎందరో ఫిల్మ్ మేకర్స్‌కు బిగినింగ్‌గా చెప్పవచ్చు. జేమ్స్ కామెరూన్ వంటి ప్రపంచ స్థాయి డైరెక్టర్ల సరసన చేరగల సత్తా రాజమౌళికి ఉంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ల ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కా యాక్టింగ్ రియల్లీ అమేజింగ్. ఏప్రిల్ 28 కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ మిగతా హీరోల్లా కాదు: కీరవాణి రాజమౌళి ఇలా హిట్ సినిమాలు తీస్తూ ఎంతో పైకి రావాలి. ఇంతటి గొప్ప సినిమాలో పాటలు పాడటమే కాదు.. రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్‌కు గర్వంలేదు. తనకు దైవ బలం, మంచి మనసు ఉన్నాయి. మిగతా హీరోల్లా ఉండటం ప్రభాస్‌కు చేత కాదు. ప్రతి క్షణం గుర్తుండిపోతుంది: రానా ‘కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే.. ‘బాహుబలి’ చిత్రం కలకాలం నిలబడే శాశ్వత శిల్పం’ అని రెండేళ్ల క్రితం చెప్పాను. నా మాటను నిజం చేసిన ప్రేక్షకులకు, ‘బాహుబలి’ అభిమానులకూ ధన్యవాదాలు. ఇప్పుడు మాహిష్మతికి తిరిగి వెళ్లలేనా? తిరిగి చూడలేనా? అన్న చిన్న బాధ ఉంది. అప్పుడప్పుడు కన్నీరు కూడా వచ్చింది. మాహిష్మతి రాజ్యంలో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో గుర్తుండిపోతుంది. ప్రభాస్ మంచి కోస్టార్. ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణగారైతే బయట వల్లిగారు. రాజమౌళిగారికి థ్యాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరితో తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు: నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి’ ఓ నేషనల్ బ్రాండ్‌గా నిలిచినందుకు హ్యాపీగా ఉంది. రెండో పార్ట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుండటం ఆనందంగా ఉంది. వేలమంది టెక్నిషియన్లు ఐదేళ్లు పని చేయకపోతే ఈ అద్భుత ఘనత మాకు దక్కేది కాదు. టాలెంట్, హార్డ్ వర్కింగ్ల కాంబినేషన్ రాజమౌళి. ఈ సినిమా కోసం పని చేసిన ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు. కెరీర్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా కోసం ఎవ్వరూ నాలుగేళ్లు ఇవ్వరు. ప్రభాస్ ఇచ్చాడు. ఈ వేడుకలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క తదితరులు పాల్గొన్నారు. ముంబయ్ మీడియా అరిచినప్పుడు గర్వపడ్డా – రాజమౌళి నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ, కమర్షియల్ హీరోయిజమ్‌ను ఎలివేట్ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హీరోయిజమ్ ఎలా ఉండాలని ఎప్పటికప్పుడు ఆలోచించు కుంటూ, తర్వాత స్థాయికి తీసుకు వెళ్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఎలివేషన్ ఇచ్చాను. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ఏం ఇచ్చానని నన్ను నేను ప్రశ్నించుకు న్నప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గురించి, నా గురించి అందరికీ తెలుసు. మొన్న ట్రైలర్ లాంచ్‌కి ముంబయ్ వెళ్లాం. ఓన్లీ మీడియాను మాత్రమే ఆహ్వానించాం. అక్కడికి వెళ్లగానే... ఇప్పుడు మీరు (ప్రేక్షకులు) ఎలా అరుస్తున్నారో? అలా అరిచారు. ఎవరు అరుస్తున్నారని చూస్తే... ముంబయ్‌లో మీడియా జనాలు. ప్రభాస్ ఎంట్రీకి విపరీతంగా అరిచారు. అప్పుడు దర్శకుడిగా గర్వపడ్డా. కంట తడిపెట్టిన రాజమౌళి! వేదికపైన చిత్రబృందం ఒక్కొక్కరి ఆడియో విజువల్ ప్రదర్శించిన సమయంలో వారి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన పాటను వినిపించారు. రాజమౌళి కోసం రాసిన పాటను కీరవాణి పాడగా.. వేదికపైనే ఉన్న రాజమౌళి కంట తడిపెట్టారు. ఆ పాట ఏంటంటే... ఎవ్వడంటా... ఎవ్వడంటా...? బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.. ఎవ్వరూ కనంది. ఎక్కడా వినంది. శివుని ఆన అయ్యిందేమో.... హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. పెంచింది రాజ నందిని.. కొండంత ప్రేమతో... ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరుయువై యశస్సుతో.. ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన.. శివుణ్ణి కోరు ప్రార్థన.