టైటిల్ : ఈ మాయ పేరేమిటో
జానర్ : లవ్ ఎంటర్‌టైనర్
తారాగణం : రాహుల్ విజయ్, కావ్యా థాపర్, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, ఈశ్వరీరావు తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : రాము కొప్పుల
నిర్మాత : దివ్యా విజయ్
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ ఎన్నేళ్ల నుంచో సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. అగ్రహీరోలందరితో పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, నాగ చైతన్య, సుకుమార్ లాంటి సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా పిలిచి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. (సాక్షి రివ్యూస్) అంతేకాకుండా ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా విజయ్ కూతురు దివ్యా విజయ్. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 21) ఈ ‘మాయ పేరేమిటో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మొదటి సినిమా అటు హీరోగా రాహుల్ విజయ్‌ను, ఇటు నిర్మాతగా దివ్యా విజయ్‌ను నిలబెట్టిందా? వీరి ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? సినిమా కథేంటో ఓసారి చూద్దాం..
కథ :
బాబురావు (రాజేంద్రప్రసాద్) కొడుకు పేరు శ్రీరామ చంద్రమూర్తి (రాహుల్ విజయ్). అందరూ ముద్దుగా చందు అని పిలుస్తారు. చందు అల్లరి చిల్లరగా తిరుగుతూ పనీపాటా లేకుండా ఉంటాడు. తన కొడుకు ఎలా ఉన్నా సరే తనకిష్టమనీ చెబుతుంటాడు బాబురావు. మురళీ శర్మ కూతురు శీతల్ జైన్ (కావ్యా థాపర్). చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచుకున్న మురళీ శర్మ.. తన కూతురికి మంచి అబ్బాయి(ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, సైంటిస్ట్, సీఎ)తో పెళ్లి చేయాలనుకుంటాడు. శీతల్‌కు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండాలి మారకూడదని అనుకుంటుంది. చందు మంచితనం తెలుసుకుని, చందు జీవితంలో ఎదగాలనుకోవడం లేదు.. బతకాలనుకుంటున్నాడని అతడిని లవ్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మురళీ శర్మ... చందుని పిలిచి మాట్లాడతాడు. (సాక్షి రివ్యూస్) ప్రేమించుకోవడానికి ఏం లేకపోయినా సరిపోతుందని.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం అలా కుదరదని.. తన కూతురిని బాగా చూసుకుంటాడని నమ్మకం కలిగేస్తేనే ఒప్పుకుంటానని మురళీ శర్మ చెబుతాడు. మురళీ శర్మ చెప్పినట్టు మారిపోయే క్రమంలో.. చందు ప్రవర్తనలో వచ్చిన మార్పు కారణంగా శీతల్ చందుల మధ్య దూరం పెరిగిపోతుంది. తను చెప్పినట్టు మారినా మురళీ శర్మ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు? చివరకు మురళీ శర్మ ఏం చేశాడు? ప్రేమించుకున్న చందు, శీతల్ ఒక్కటయ్యారా? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు :
హీరోగా రాహుల్ విజయ్ బాగానే నటించాడు. తన వయసుకు తగ్గట్గు ఎంచుకున్న కథకు న్యాయం చేశాడు. రాహుల్ లవర్ బాయ్‌లా కనిపిస్తూ.. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ కావ్యా థాపర్ లుక్స్ పరంగానే కాకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. (సాక్షి రివ్యూస్) కథలో కీలకపాత్రధారులైన రాజేంద్రప్రసాద్, ఈశ్వరీరావు, మురళీ శర్మ తమ నటనతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, హీరో స్నేహితులు తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ :
హీరోగా మొదటి సినిమా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాహుల్ విజయ్ తన మొదటి సినిమాగా ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా... సింపుల్ కథలో రిస్క్ లేకుండా కానిచ్చేశాడు. ఒక అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి జీవితం కోసం పరితపించే తండ్రి.. తన కూతురి కోసం మంచి అబ్బాయి వెతకాలనుకోవడం.. కానీ ఆ కూతురేమో పనీపాటా లేని గాలికి తిరిగేవాడ్ని ప్రేమించడం.. ఆ తండ్రి మారాలంటూ కండిషన్లు పెట్టడం... హీరో బాధ్యత తెలుసుకుని మెలగడం.. చివరకు కథ సుఖాంతం కావడం ఇలాంటివి తెలుగు తెరపై చూసిన ఫార్ములానే. ఏ సినిమాలోనైనా.. హీరోయిన్ అతి మంచితనం చూసి హీరో వెంటపడుతుంటాడు.. కానీ ఈ సినిమాలో మాత్రం రివర్స్. (సాక్షి రివ్యూస్) హీరో మంచితనం, ప్రవర్తన చూసి ప్రేమలో పడుతుంది హీరోయిన్. ప్రేమలో పడటానికి క్రియేట్ చేసిన సన్నివేశాలు, కారణాలు కూడా అంత బలమైనవేమీ కాదు. కొత్త కథాకథనాలు లేకపోయినా.. ఓ రెండు గంటలు బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంలో రాము కొప్పుల సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. తన సంగీతం, నేపథ్య సంగీతంతో మణిశర్మ మళ్లీ నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు శ్యామ్ కే నాయుడు కెమెరా పనితనం కలిసొస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా ఫర్వాలేదనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
సంగీతం
హీరో, హీరోయిన్లు
మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం
- బండ కళ్యాణ్, ఇంటర్‌నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment