మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి.
→ లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.
→ శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఇందులో ఉంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. టర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.
→ బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్.
→ శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.
→ శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.
→ ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.
→ స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.
→ ప్రభాస్‌తో సినిమా చేయాలని నాక్కుడా ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment