ఈ శుక్రవారం రిలీజైన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంపై వివాదం నెలకొంది. సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా, కూతురు దివ్యా విజయ్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ మతానికి సంబంధించిన మంత్రాన్ని పాటలో, బ్యాగౌండ్ర్‌లో వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదానికి కారణమైన వ్యాఖ్యలను మ్యూట్‌లో ఉంచి సినిమా ప్రదర్శించినా.. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన నంబర్‌ను సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని చిత్ర నిర్మాత దివ్యా విజయ్ వాపోయారు. వివాదాస్పద కంటెంట్ తొలగించినా ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనలను ఎందుకు నిలిపివేస్తున్నారంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment