సిగ్గు లేకుండా నన్ను కమిట్‌మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్ | Kavya Thapar Comments On Her Experience | Sakshi
Sakshi News home page

Kavya Thapar: రెట్టించి అడిగాడు.. తిట్టేసి బయటకొచ్చేశా

Published Fri, Nov 15 2024 11:50 AM | Last Updated on Mon, Nov 18 2024 9:51 AM

Kavya Thapar Comments On Her Experience

రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ కావ్య థాపర్. కాకపోతే ఈమె చేసిన మూవీస్ అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఇదలా ఉంచితే ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. సిగ్గులేకుండా ఓ వ్యక్తి తనని కమిట్‌మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇది కెరీర్ ప్రారంభంలో జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)

'ఓ యాడ్‌లో ఆఫర్ ఉందనగానే ఆడిషన్స్ కోసం ఓ ఆఫీస్‌కి వెళ్లాను. అయితే నాలుగు యాడ్స్‌లో ఇస్తాం కానీ నువ్వు సెలెక్ట్ కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు. అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. కానీ పదేపదే అదే విషయం గురించి అడిగేసరికి వెంటనే అక్కడి నుంచి వచ్చేశా. నన్ను నటిగా చూడాలనేది నాన్న కల. అందుకే డిగ్రీ పూర్తవగానే యాక్టింగ్ వైపు వచ్చేశా. అలా కొన్ని యాడ్స్ చేశా. అలా 'ఈ మాయ పేరిమిటో' సినిమాలో అవకాశం వచ్చింది' అని కావ్య థాపర్ చెప్పుకొచ్చింది.

పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'ఏక్ మినీ కథ', డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యాయి. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement