తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌కి బర్గరా! | Niharika Suryakantham Movie Teaser Released | Sakshi
Sakshi News home page

బబ్లీగా ‘సూర్యకాంతం’ టీజర్‌

Published Fri, Jan 25 2019 5:49 PM | Last Updated on Fri, Jan 25 2019 5:58 PM

Niharika Suryakantham Movie Teaser Released - Sakshi

మెగా డాటర్‌ నిహారికా కొణిదెల, ఫైట్‌ మాస్టర్‌ విజయ్ తనయుడు రాహుల్‌ విజయ్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సూర్యకాంతం’. సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్‌ ప్రణీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా మెగా హీరో,  నిహారిక సోదరుడు వరుణ్‌ తేజ్‌ సూర్యకాంతం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

పేరు తెలుసుకుని ఏం చేస్తాం..
నిహారిక ఎంట్రీతో మొదలైన టీజర్‌లో... ‘ నీ గురించి చెప్పు.. అయినా పేరు కన్నా ఎక్కువ తెలుసుకుని ఏం చేస్తా.... తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌కి బర్గర్‌కి తినిపిస్తా అన్నాడట’ అంటూ నిహారిక బబ్లీగా చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో .. ‘ పెళ్లి ఒప్పుకోకపోతే చెయ్యి కోసుకుంటా’ అంటూ సుహాసిని బెదిరించడం.. ఆ వెంటనే నిహారిక ఐదంకెలు లెక్కబెట్టి కోసుకో అని చెప్పిన డైలాగ్స్‌తో క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అయ్యిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్‌పై ఓ లుక్కేయండి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement