రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయవుతున్నారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. అభిమన్యు మాట్లాడుతూ– ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందేలా తెరకెక్కించబోతున్నాం’’ అన్నారు.
‘‘డియర్ మేఘ’ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్‌లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మేఘా ఆకాష్. ‘‘కూల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. 25 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట. ‘వెన్నెల’ కిషోర్, అర్జున్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర.
చదవండి: అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్‌ని దూరం చేసిందా!
Comments
Please login to add a commentAdd a comment