టాలీవుడ్ మిస్టరీ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Horror Thriller Web Series Streaming On This Date | Sakshi
Sakshi News home page

Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published Fri, Nov 1 2024 1:18 PM | Last Updated on Fri, Nov 1 2024 1:30 PM

Tollywood Horror Thriller Web Series Streaming On This Date

ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్‌ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్‌ త్వరలోనే ఓటీటీకి రానుంది.

(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.  నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement