
ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రాము కొప్పుల దర్శకత్వంలో విజయ్ దివ్య నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య తాపర్ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడాన్ని నేనేప్పుడూ ఆనందంగా ఫీల్ అవుతాను. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌తో పాటు న్యూ టాలెంట్‌ను కూడా ప్రూవ్ చేసుకోవాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘హీరో కావాలంటే 24క్రాఫ్ట్స్ వారిని శాటిస్‌ఫై చేయాలి. అలా చేయాలంటే ముందు దర్శకుణ్ణి శాటిస్ ఫై చేయాలి. అందుకు సిద్ధమైతేనే హీరోగా రా. లేకపోతే వద్దని నా కొడుకు రాహుల్‌కి చెప్పాను.
తర్వాత చాలా బాగా ప్రాక్టీస్ చేసి హీరో అయ్యాడు’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘టీజర్ లాంచ్ చేసిన నాగచైతన్యకు థ్యాంక్స్. మా గురువు సుకుమార్, ఫైట్ మాస్టర్ విజయ్‌లు నాపై ఉంచిన నమ్మకమే నన్ను ఇంతవరకు తీసుకు వచ్చింది. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు రాము. ‘‘బిజీగా ఉండి కూడా మా సినిమా టీజర్‌ను లాంచ్ చేయడానికి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. రాహుల్ బాగా చేశాడు’’ అన్నారు దివ్య. ‘‘టీజర్‌ను విడుదల చేసిన అన్నయ్య నాగచైతన్యకు థ్యాంక్స్. టీజర్ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రాహుల్.
Comments
Please login to add a commentAdd a comment