పోలీసులే నిందితులైతే... | Rahul Vijay birthday surprise: First look poster of new movie | Sakshi
Sakshi News home page

పోలీసులే నిందితులైతే...

Published Thu, Jun 8 2023 6:17 AM | Last Updated on Thu, Jun 8 2023 6:17 AM

Rahul Vijay birthday surprise: First look poster of new movie - Sakshi

సాధారణంగా హత్యలకు కారణమైన దోషులకు శిక్ష పడేలా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అయితే ఓ హత్య కేసులో పోలీసులే నిందుతులు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసు కుంటాయి? అన్న కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. తేజా మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్‌ విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ఇది.

అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, విద్య నిర్మిస్తున్నారు. బుధవారం (జూన్‌ 7) రాహుల్‌ విజయ్‌ బర్త్‌ డే ఈ సందర్భంగా ఈ సినిమాలో ఎస్‌. రవి పాత్రను రాహుల్‌ విజయ్‌ చేస్తున్నట్లుగా వెల్లడించి, పోస్టర్‌ రిలీజ్‌  చేశారు. శివానీ రాజశేఖర్, పవన్‌ తేజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మిధున్‌ ముకుందన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement