బొమ్మాళి డేట్‌ ఫిక్స్‌ | Kota Bommali PS Movie Official Teaser | Sakshi
Sakshi News home page

బొమ్మాళి డేట్‌ ఫిక్స్‌

Published Thu, Nov 2 2023 4:40 AM | Last Updated on Thu, Nov 2 2023 4:40 AM

Kota Bommali PS Movie Official Teaser - Sakshi

శ్రీకాంత్‌ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్‌ కానుంది.

‘‘ఓ పోలీస్‌ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ పవర్‌ గేమ్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్‌ సాధించింది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: రంజిన్‌ రాజ్, మిధున్‌ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్‌ చౌదరి, ఎగ్జిక్యూటివ్‌ ్రపొడ్యూసర్‌: అజయ్‌ గద్దె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement