![Gandeevadhari Arjuna Teaser Telugu VarunTej - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/Gandeevadhari-Arjuna-teaser.jpg.webp?itok=efWjDyyS)
Gandeevadhari Arjuna Teaser: మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారి సరికొత్తగా కనిపించాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా 'గాండీవధారి అర్జున'తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాడు. టీజర్‌ని సోమవారం రిలీజ్ చేయగా, అది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్)
కథ అదేనా?
టీజర్ విషయానికొస్తే స్టోరీ విషయమై కాస్త క్లూ ఇచ్చారు. అర్జున్(వరుణ్ తేజ్) ఓ గూఢచారి. దేశం కోసం ప్రాణాలు రిస్క్‌లో పెట్టేందుకైనా అస్సలు వెనుకాడడు. ఈ క్రమంలోనే అతడికి ఓ మిషన్ అప్పగిస్తారు. అయితే మొండిగా వ్యవహరించే అర్జున్‌తో పనిచేయడానికి సహచర ఏజెంట్స్ భయపడుతుంటారు. వీళ్లలో ప్రియురాలు(సాక్షి వైద్య) కూడా ఉంటుంది. ఇంతకీ అర్జున్ టార్గెట్ ఎవరు? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్పై సినిమాల హవా
'గాండీవధారి అర్జున' టీజర్ చూస్తే గ్రాండ్ విజువల్స్‌తో చాలా రిచ్‌గా ఉంది. వరుణ్ తేజ్ ఇలాంటి సినిమాలో ఇంతకు ముందెన్నడూ చేయలేదు. దీంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన అఖిల్ 'ఏజెంట్', నిఖిల్ 'స్పై'.. ఈ తరహా చిత్రాలే. అవి ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆగస్టు 25న రాబోతున్న 'గాండీవధారి అర్జున' ఏం చేస్తుందో చూడాలి.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!)
Comments
Please login to add a commentAdd a comment