వరుణ్ తేజ్
‘‘నా పనిని ఎంజాయ్ చేయడం కోసం నేను సినిమా రంగంలోకి వచ్చాను. మనం చేసే పని ఏదైనా అందులో సంతృప్తి దక్కాలి. ‘గాండీవధారి అర్జున’ చిత్రం చేయడం నా బాధ్యత అనిపించింది. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. నాకు సంతృప్తినిచ్చింది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు.
► ప్రవీణ్ సత్తారుగారి సినిమాలను ప్రారంభం నుంచి చూస్తున్నాను. వైవిధ్యమైన చిత్రాలు చేయటానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ప్రవీణ్ తీసిన ‘చందమామ కథలు’ సినిమాలోని భావోద్వేగాలు, ‘పీఎస్‌వీ గరుడవేగ’ చిత్రంలోని యాక్షన్ నాకు ఇష్టం. ‘గని’ సినిమా సమయంలో నేను ‘గాండీవధారి అర్జున’ కథ విన్నాను. సాధారణంగా స్టైలిష్ యాక్షన్ మూవీ అంటే యాక్షన్, స్టైలిష్ అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. కథ తక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్‌గారు కథ చెప్పినప్పుడు అందులోని ΄పాయింట్, భావోద్వేగాలు నచ్చాయి.
► ఈ చిత్రంలో హీరో పేరు అర్జున్. ఓ నటుడికి సామాజిక బాధ్యతాయుతమైన పాత్రల్లో నటించే అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. అందుకే మంచి కథతో ΄ాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉండే ఈ సినిమా చేయటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఎక్కువగా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.. అవి చేస్తున్నప్పుడు నాకు గాయాలయ్యాయి.
► ‘గాండీవధారి..’ లో బాడీగార్డ్ రోల్ చేశాను. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏదో సందేశం ఇచ్చి మీరు మారాలని చెప్పటం లేదు. ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్యని యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా చూసి కొందరైనా మారితే మంచిదే. కథ డిమాండ్ మేరకే లండన్‌లో షూట్ చేశాం. అక్కడి వాతావరణం షూటింగ్‌కి సహకరించక΄ోవడం వల్ల బడ్జెట్ ముందుగా అనుకున్నదానికంటే పెరిగింది. అయినా బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌గారు, బాపినీడు ఖర్చుకు వెనకాడలేదు.
► సాక్షీ వైద్యకి చాలా ప్రతిభ ఉంది. తొలి రోజు షూటింగ్‌లోనే సినిమాలోని మూడు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పటం ఆశ్చర్యంగా అనిపించింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, అంతకు మించి నేపథ్య సంగీతం అందించారు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలు చేస్తున్నాను.
► మీ (వరుణ్–లావణ్యా త్రిపాఠి) ప్రేమ ఎప్పుడు మొదలైంది? పెళ్లెప్పుడు? అని వరుణ్ తేజ్‌ని అడగ్గా.. ‘‘తొలిసారి తనని కలిసినప్పుడే (‘మిస్టర్’ సినిమా అప్పుడు) అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే అవకాశం ఉంది’’ అన్నారు వరుణ్.
Comments
Please login to add a commentAdd a comment