
మరో మెగా హీరోతో రెజీనా
మంచి యాక్టింగ్ టాలెంట్తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా...
మంచి యాక్టింగ్ టాలెంట్తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.., స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ సాధించలేకపోతుంది. అయితే మెగా హీరోలు మాత్రం ఈ అమ్మడికి బాగానే ఛాన్సులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి రెడీ అవుతోంది.
పిల్లానువ్వులేనీ జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో సాయిధరమ్ తేజ్తో కలిసి నటించింది రెజీనా. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో మెగా హీరోల దృష్టిలో పడింది. అదే సమయంలో మరో మెగా హీరో శిరీష్ సరసన కొత్తజంట సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతోంది.
ముకుంద, కంచె, లోఫర్ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్కు ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఈ పాత్రకు హేబా పటేల్ను తీసుకోవాలని భావించినా, వరుణ్ సరసన సూట్ అవ్వదన్న ఆలోచనతో రెజీనాను ఫైనల్ చేశారు. మరి వరుణ్ అయినా రెజీనాకు స్టార్ ఇమేజ్ తీసుకువస్తాడేమో చూడాలి.