
మార్చి 30న 'మిస్టర్' ఆడియో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్నరొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. కొద్దిరోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాకు డైరెక్టర్. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా పూర్తి ఆడియోను మార్చి 30న, మెగా ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టర్, వరుణ్ తేజ్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టడంతో పాటు శ్రీనువైట్ల కెరీర్ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.