50 రోజుల తరువాత సెట్లో మెగా హీరో
దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన మెగా హీరో వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. మిస్టర్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైన వరుణ్, కాలికి తీవ్ర గాయం కావటంతో షూటింగ్లకు దూరమయ్యాడు. దీంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్తో పాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభించిన ఫిదా సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు 50 రోజుల విరామం తరువాత సోమవారం వరుణ్ తిరిగి షూటింగ్లో పాల్గొన్నాడు.
కాలి గాయం నుంచి కాస్త ఉపశమనం కలగటంతో మిస్టర్ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఫిదా సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి మిస్టర్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వరుణ్. ఇప్పటికే సినిమా ఆలస్యం కావటంతో మిస్టర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఫిదాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మిస్టర్ను నల్లమలపు బుజ్జి నిర్మిస్టుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులు వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమా తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.
Back on my feet and onto the sets after 50 long days!!..Excited to shoot!!..soo damn happy!!
— Varun Tej (@IAmVarunTej) November 21, 2016
#shootresumes#mister#hyderabad pic.twitter.com/YbQcpJcqDO