Fida
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్‌కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
సిరాజ్ పెర్ఫార్మెన్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. కార్ ఇచ్చేయండి సార్..
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 (Asia Cup) ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ భారత్ వశమైంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్ బ్యాంటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 6 వికెట్లు సాధించాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సిరాజ్ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్ సిరాజ్‌కు ఎస్యూవీ గిఫ్ట్ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
సోలోగా సాయిపల్లవి?
‘భానుమతి.. ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల... బొక్కలిరగ్గొడతా నకరాలా’ అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారీ చెన్నె బ్యూటీ. కథానాయికగానే ఓ రేంజ్లో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఏ రేంజ్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకనే విషయానికి వస్తే... సాయిపల్లవి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తొలి చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’తో ఘనవిజయం అందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. వేణు ఊడుగుల చెప్పిన స్టొరీ లైన్ ఈ బ్యూటీకి బాగా నచ్చిందని భోగట్టా. అయితే స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం శర్వానంద్ సరసన సాయి పల్లవి ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన ‘కణం’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ‘మారి 2’, ‘ఎన్జీకె’, ఇంకా పేరు ఖరారు చేయని ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
నటుడితో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి!
అదృష్టం అంటే ఆమెదేనని చెప్పొచ్చు. ఆమె మరెవరో కాదు నటి సాయిపల్లవి. ప్రేమమ్ చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ చిత్రంలో మలర్ టీచర్‌గా నటించి విశేషం గుర్తింపును పొందింది. అక్కడే అలా అంటే ఆ తరువాత టాలీవుడ్‌కు ఫిదా చిత్రంతో రంగప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక తమిళ సినీ రంగానికి కరు చిత్రం ద్వారా అడుగుపెట్టింది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ఈ చిత్రం విడుదల కాకముందే ధనుష్‌తో మారి-2 చిత్రంలో రొమాన్స్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో కరు చిత్రం తెచ్చిపెట్టే పేరు కోసం ఎదురు చూస్తున్న సాయిపల్లవిని చాలామంది మలయాళీ అమ్మాయి అంటున్నారట. అంతేకాదు ఈ అమ్మడు ఒక కోలీవుడ్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని చెవులు కొరుక్కుంటున్నారట. అయితే ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా తనను మలయాళీ అమ్మాయి అని అనకండని, తాను కోయంబత్తూర్‌లో పుట్టిన పక్కా తమిళ అమ్మాయినని అంటోంది. మొత్తం మీద తన ప్రేమ, ప్రియుడు అన్న విషయాలను ఖండించలేదంటే ఈమెకో లవర్ ఉన్నాడన్న విషయం కొట్టిపారేయలేం అంటున్నాయి కోడంబాకం వర్గాలు. ఇక అతగాడెవరన్నది తెలియాల్సి ఉందని పేర్కొంటున్నాయి. -
మీనాకుమారికి హుసేన్ ఫిదా!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్‌కి అలనాటి బాలీవుడ్ అందాల తార మీనాకుమారిని కలుసుకున్నపుడు మాట పెగల్లేదట. ఆమె అందాన్ని చూడగానే హుసేన్ నిశ్చలంగా మారిపోయాడని ఆయన శిష్యురాలు, చిత్రకారిణి ఇలా పాల్ తన తాజా పుస్తకంలో వెల్లడించారు. 1967లో పాల్‌కు జన్మించిన బిడ్డను చూడటానికి ఆసుపత్రికి వెళ్లినపుడు హుసేన్.. మీనాకుమారిని కలిశారు. ఆమె కూడా ఆ సమయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘తన అందమైన రూపం, ప్రత్యేకమైన గొంతుతో ప్రేక్షకులను కట్టిపడేసిన మీనాకుమారి, హుసేన్‌ను కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపింది. ఆమెను చూడగానే హుసేన్ నోటి నుంచి మాటలు రాలేదు’ అని ‘హుసేన్: పొర్ట్రయిట్ ఆఫ్ ఆర్టిస్ట్’ పుస్తకంలో పాల్ పేర్కొన్నారు. అలా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ తరువాత అడిగితే..‘ నేనేం చేయను? పెదవులు కదల్చే లోగా ఆమె నావైపు చూసిన తీరుతో మాట ఆగిపోయింది’ అని హుసేన్ బదులిచ్చినట్లు తెలిపారు. -
ఫిదా’కి అక్కినేని అవార్డు
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రానికి ఈ ఏడాది ‘అక్కినేని–వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు’ అందించనున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు, అవార్డు కమిటీ చైర్మన్ డా. వంశీ రామరాజు మాట్లాడుతూ– ‘‘వంశీ ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది విశేషంగా ప్రేక్షకాదరణ పొంది, విజయవంతంగా ఆడుతున్న ‘ఫిదా’ సినిమాను అవార్డుకు ఎంపిక చేశాం. అలాగే ఉత్తమ దర్శకునిగా ‘ఫిదా’ చిత్రానికి శేఖర్ కమ్ములను, అత్యంత ప్రజాదరణ పొందిన ‘వచ్చిండే’ (ఫిదా) పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేశాం. తెలంగాణ టూరిజం సహకారంతో ఈ నెల 19న త్యాగరాయ గానసభలో జరిగే అక్కినేని 94వ జయంతి సభలో ఈ అవార్డులను బహూకరించి, ‘ఫిదా’ యూనిట్‌ని సత్కరిస్తాం’’ అన్నారు. -
బాహుబలి తర్వాత ఫిదాకే అలా జరిగింది
– ‘దిల్’ రాజు ‘‘పంపిణీదారుడిగా ఇరవై ఏళ్లు, నిర్మాతగా పధ్నాలుగేళ్ల నా ప్రయాణంలో ఏడో వారంలోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ కావడమనేది ఈ మధ్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత మా సినిమా విషయంలోనే అలా జరిగింది’’ అన్నారు ‘దిల్’ రాజు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారానికి (ఈ నెల 8) సినిమా విడుదలై 50 రోజులు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో 50 రోజుల సంబరాలను నిర్వహించారు.‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శేఖర్ కమ్ముల హాలిడేకి, నెక్ట్స్ సినిమా కోసం వరుణ్‌తేజ్ లండన్‌కి వెళ్తున్నారు. అందుకనే, ముందుగా ఈ రోజే 50 రోజుల వేడుక నిర్వహిస్తున్నాం. చిన్న సినిమాగా విడుదలైన ‘ఫిదా’కు ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల సిన్మాలు మూడు వారాలు ఆడుతున్నాయి. ఈలోపు డబ్బులు వచ్చేస్తుండడంతో థియేటర్లలోంచి తీసేస్తుంటారు. ఈ విషయంలో ‘ఫిదా’ మినహాయింపు సంపాదించుకుంది. ఈ విజయానికి అందరి కృషే కారణం. ఇంతమంచి సినిమాను మాతో చేసినందుకు శేఖర్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘గట్టిగా అనుకుంటే జరుగుతుందని చాలామంది అటుంటారు. ‘ఫిదా’ గురించి మేము అలానే అనుకుని ఉంటాం. ‘హ్యాపీడేస్’ తర్వాత ఆ స్థాయి స్పందన రావడం సంతోషం. ఈ మేజిక్‌ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తాం. నాకు మద్దతిచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా భానుమతి అనే పిలుస్తున్నారు. ఇంత ప్రేమను పంచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సాయిపల్లవి. చిత్రనిర్మాతల్లో ఒకరైన శిరీష్, నటి గీతా భాస్కర్, నేపథ్య సంగీతం అందించిన జీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అభిమానులు మెచ్చే సినిమాలే చేస్తా : హీరో
► తిరుపతిలో ‘ఫిదా’ యూనిట్ సందడి తిరుపతి: ఫిదా విజయోత్సవ యాత్రలో భాగంగా గురువారం ఆ చిత్రం యూనిట్ తిరుపతిలో అభిమానుల మధ్య సందడి చేసింది. సంధ్య థియేటర్‌కు చేరుకున్న చిత్ర యూనిట్‌కు సినిమాహాలు యాజమానులు, వరుణ్‌తేజ్ అభిమానులు పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. థియేటర్లో ఫిదా సినిమాను చిత్రం యూనిట్ కొంతసేపు అభిమానులతో కలిసి వీక్షించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థియేటర్లోని వేదికపై చిత్రం హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు అభిమానులకు అభివాదం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. హీరో, హీరోయిన్ వరుణ్‌తేజ్, సాయిపల్లవి చిత్రంలోని డైలాగ్స్ చెప్పి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అభిమానులు కేరింతలతో థియేటర్ హోరెత్తించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఫిదా చిత్రం పట్ల అభిమానులు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అభిమానుల సందడి చేస్తుంటే ఈ చిత్రం విజయం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. అభిమానుల కోసం ఇంకా మంచి మంచి చిత్రాల్లో నటిస్తానని తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు ఖుషి, అల్లుఅర్జున్‌కు బన్నీ సినిమా ఇమేజ్ను తీసుకొచ్చాయని, ఫిదా సినిమాతో వరుణ్‌తేజ్‌కు కూడా గుర్తింపు లభించిందన్నారు. సినిమా విడుదలై రెండు వారాలు కావస్తున్నా ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభించడం ఆనందదాయకంగా ఉందన్నారు. రాయలసీమ ప్రేక్షకులు తమ సినిమాను మరింత ఆదరించి విజయాన్ని చేకూర్చారని తెలిపారు. టీటీడీ రిటైర్డ్ డెప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ మాట్లాడుతూ మంచి సినిమాలను సీమ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తెలి పారు. సినీ నిర్మాత ఎన్వీ.ప్రసాద్, నటుడు రాజేష్, చిత్రంలోని నటీనటులు పాల్గొన్నారు. -
బంగారం చిన్నోడు.. ఫిదా చిన్నది...
ఏం పిల్లరా... యెల్లట్లేదు మైండ్లోంచి. భలే నటించిందిరా! అంటున్నారు ‘ఫిదా’లో సాయి పల్లవిని చూసినోళ్లు. తెలుగు ప్రేక్షకులను అంతగా ఫిదా చేసిన ఈ అమ్మాయి వచ్చే నెల్లో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే... స్ట్రయిట్ తెలుగు సినిమాతో కాదు. మలయాళ అనువాదంతో మనల్ని పలకరించనున్నారు. ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘కలి’ను ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డీవీ కృష్ణస్వామి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల రెండో వారంలో టైటిల్ ప్రకటించి, సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: భాషా శ్రీ, సాహిత్యం: సురేంద్ర కృష్ణ, సంగీతం: గోపీసుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిణ్ శ్రీనివాస్, సహ–నిర్మాత: వి. చంద్రశేఖర్. -
శేఖర్ కమ్ములతో సరదాగా కాసేపు
-
ఫిదా సక్సెస్‌మీట్‌లో నటుడి భావోద్వేగం
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన మూవీ ‘ఫిదా’. ఈ నెల 21న విడుదలైన మూవీ సక్సెస్ మీట్‌ను గురువారం నిర్వహించారు. ఈ మూవీ భానుమతి పాత్రతో ఆకట్టుకున్న సాయి పల్లవి తర్వాత అందరి చర్చించుకుంటున్నది ఆమె తండ్రి పాత్రలో మెప్పింపిన సీనియర్ నటుడు సాయి చంద్ గురించే. ఈవెంట్లో సాయి చంద్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూనే భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో తమ ఫ్యామిలీది తొలితరమని, ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగానే తన తండ్రి కొన్ని మూవీల్లో నటించారని గుర్తుచేసుకున్నారు. తాను 'మా భూమి'తో వెండితెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించినా గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత నటించినప్పటికీ ఫిదాలో సాయి పల్లవి తండ్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తనకు ఫోన్ చేసి మీరు బాగా నటించారని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిదాలో మిమ్మల్ని చూస్తున్నంతసేపు మా నాన్నే గుర్తొచ్చారని ఫోన్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది చెప్పారన్నారు. అయితే నిజ జీవితంలో తనకు అసలు పెళ్లికాలేదని, పిల్లలే లేరని చెప్పిన సాయి చంద్.. తన పాత్రకు గుర్తింపునిస్తూ తండ్రిగా తనను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని ప్రొడక్షన్లలో పనిచేయలేదన్న బాధ ఈ మూవీలో నటించడంతో తీరిందన్నారు. సంబంధిత కథనం ‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’ -
సమాధానం చెప్పాలనుకున్నా... ‘ఫిదా’తో చెప్పా!
శేఖర్ కమ్ముల ‘‘శేఖర్ కమ్ముల సినిమా చాలా నేచురల్‌గా, పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది. అతని సినిమాల్లో ఆ బ్రాండ్ ఉంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్ తేజ , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫిదా’ ఈ నెల 21న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం ‘ఫిదా’ సంబరాలు’ నిర్వహించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్నందుకు ఈర్ష్యతో రాజుగారికి కంగ్రాట్స్ చెబుతున్నా (నవ్వుతూ). అనిత (‘దిల్’ రాజు సతీమణి)గారి ఆశీర్వాదాలు ఉండటం వల్లే వరుస హిట్స్ వస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే తక్కువ మందిలో రాజు ఒకడు. వరుణ్ గత సినిమా ప్రివ్యూ చూసి ‘సారీ’ చెప్పా. ‘ఫిదా’ చూడగానే కంగ్రాట్స్ చెప్పా. వరుణ్ ఈ సినిమాలో చాలా నేచురల్‌గా చేశాడు. సాయి పల్లవి చాలా మంచి డ్యాన్సర్. బాగా నటించారు’’ అన్నారు. నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావు తర్వాత నన్ను ఆదరించిన వ్యక్తి అరవింద్‌గారు. అగ్ర నిర్మాతలంటే రామానాయుడు, విజయ బాపినీడు, అల్లు అరవింద్‌గారు. ‘దిల్’ రాజు తక్కువ వయసులో ఆ స్థాయికి చేరుకోవడం గ్రేట్. ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్‌ని అల్లు అర్జున్‌తో మీరు (అరవింద్, రాజు) తీయాలి. హృషికేష్ ముఖర్జీ, గుల్జార్ వంటి దర్శకులు ఇండియాలో రారా అనుకున్నా.. శేఖర్ కమ్ముల వచ్చారు. ‘పెళ్లిసందడి’ రాఘవేంద్రరావుగారు, ‘ఫిదా’ శేఖర్ కమ్ములనే తీయాలి. వేరే ఎవరు తీసినా ఫ్లాపే’’ అన్నారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘‘ఫిదా’ను ఆదరించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకే ఈ సంబరాలు. ఇవి ఇంకా కొనసాగుతాయి. నా సినిమాల్లో నేను ఇన్వాల్వ్ అవుతుంటా. ‘ఫిదా’ అనుకున్నప్పుడు ఇది పక్కా శేఖర్ కమ్ముల ఫిల్మ్. మనం ఇన్వాల్వ్ అయితే ఈ సినిమా కిచిడీ అయిపోతుందని ఆయనకే అప్పజెప్పా. ‘ఫిదా’కి ‘దిల్’ రాజు జస్ట్ ప్రొడ్యూసర్. ఒక సినిమాకి రైట్ వేవ్‌లెన్త్ ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. మా సమష్టి కృషికి వచ్చిన మంచి రిజల్ట్ ఇది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు’తో ‘ఫిదా’ని పోలుస్తున్నారు. ఇందులోని పాత్రలు హార్ట్‌కి టచ్ అయ్యాయి’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రాజుగారికి సినిమా అంటే ప్యాషన్.. ప్రేమ. డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఇస్తారు. మా అబ్బాయికి హిట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ‘మిస్సమ్మ’లో మహానటి సావిత్రి ఎంత బాగా చేసిందో భానుమతి పాత్రలో సాయిపల్లవి అంత గొప్పగా చేసింది. నాకు తెలిసి సావిత్రిగారి నిజమైన వారసురాలు సాయిపల్లవి. వరుణ్ చాలా నేచురల్‌గా చేశాడు. కొన్ని సినిమాలకెళితే గయ్యాళి పెళ్లాంతో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది వెళ్లిపోదామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలకెళితే అందమైన గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ‘ఫిదా’ సినిమాకెళితే ఒక మంచి గర్ల్‌ఫ్రెండ్‌తో టూర్ వెళ్లినట్టు ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు యూనిట్ బాడీ అయితే ఆత్మ తెలంగాణ. గుండె సాయిపల్లవి. నార్మల్ హిట్‌తో నేను హ్యాపీ అయ్యేవాణ్ణి కాదు. చాలా రోజులుగా డైరెక్టర్స్ లిస్ట్‌లో నా పేరు లేదు. అందుకే నా సినిమాతో సమాధానం చెప్పాలనుకున్నా. అది ‘ఫిదా’తో సాధ్యమైంది’’ అన్నారు శేఖర్ కమ్ముల. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నా సినిమాకి సక్సెస్ మీట్ చేసుకోలేదు. చాలా సినిమాలు హిట్, ఫ్లాప్ అవుతుంటాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకుంటారు. అటువంటి చిత్రమే మా ‘ఫిదా’. భానుమతి పాత్ర లేకుండా ఫిదా సినిమా ఉండదు’’ అన్నారు. నటులు సాయిచంద్, ‘సత్యం’ రాజేష్, అరుణ్, శరణ్య, హీరోయిన్ సాయి పల్లవి, సంగీత దర్శకుడు శక్తీ కాంత్, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, వనమాలి, చైతన్య పింగళి, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధిత వార్త : ‘దిల్ రాజును చూస్తే ఈర్ష్యగా ఉంది’ -
నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు!
వచ్చింది... మెల్లగా తెలుగు తెరపైకొచ్చింది... ముఖంపై ముత్యమంత మొటిమలతో వచ్చింది...కుర్రాళ్లను గమ్మున కూర్చోనీయడం లేదు.. నిల్చోనీయడం లేదు...ముద్ద నోటికి పోకుండా మస్తుగా డిస్ట్రబ్ చేసింది... అందానికి కొత్త నిర్వచనం ఇచ్చింది...తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన తమిళ సాయిపల్లవితో ఇంటర్వ్యూ... ♦ ‘గట్టిగా అనుకో.. జరుగుద్ది’ అని ‘ఫిదా’లో ఓ డైలాగ్ ఉంది. రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా అలా అనుకున్నారా? మనమా? ఎంబీబీఎస్ అనుకున్నా. చదువుతానా? లేదా? అనే భయం ఉండేది. కానీ, అయ్యింది కదా! మనం మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. దేవుడిపై మనకు సహనం, నమ్మకం ఉండాలంతే. ‘ఢీ’ షో అప్పుడు ఇద్దరు ముగ్గురు తెలుగు దర్శకులు అడిగారు. అప్పుడు ‘యస్’ చెబితే... ఇప్పుడు ఇంత పేరొస్తుందా? లేదా? తెలీదు. ♦ ఓ చేతిలో ఎంబీబీఎస్ డిగ్రీ... మరో చేతిలో హీరోయిన్గా మంచి పేరు... నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఎంబీబీఎస్‌కి, చదువుకి వయసుతో సంబంధం లేదు. కానీ, నటనకు వయసుతో సంబంధం ఉంది. ప్రేక్షకులు నన్ను ఆదరించినంత వరకూ నటిస్తా. తర్వాత చదువు కంటిన్యూ చేస్తా. యాక్చువల్లీ... కార్డియాలజీ చేయాలని నా కోరిక. టైమ్ చూసుకుని చేస్తా. ♦ ఎంబీబీఎస్ చదివేశారు. మరి, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? చేయాలి. కానీ, మెడిసిన్ అంత ఈజీ కాదు. మళ్లీ మళ్లీ చదువుతూనే ఉండాలి. మనిషితో ఆటలు ఆడకూడదు. నాకు డిగ్రీ ఉందని ఏదేదో చేయకూడదు. డాక్టర్ అవ్వాలనుకుంటే మళ్లీ ఓ ఏడాది నటనను పక్కన పెట్టి... పుస్తకాలన్నీ తిరగేస్తా. వేరొకరి ప్రాణంతో ఆటలు ఆడకూడదు కదా. ♦ రియల్ లైఫ్‌లో సాయిపల్లవి ఎలా ఉంటారు? ఇప్పుడు ఎలా ఉన్నానో.. అలాగే ఉంటాను. మేకప్, గట్రా ఏం ఉండవు. నేను మేకప్ వేసుకుంటే వేరే అమ్మాయిలా ఉంటాను. ఐయామ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్... నా దర్శకులందరూ మేకప్ లేకుండా నటించమన్నారు. దీనివల్ల అమ్మాయిలకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. మా చెల్లి నాకంటే ఐదేళ్లు చిన్నది. కాలేజ్‌కి వెళ్తుంది. తనే కాదు... అమ్మాయిలందరికీ ఓ కాంప్లెక్స్ ఉంటుంది. అబ్బాయిలు ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్?’ అని చెప్పాలంటే... చక్కగా మేకప్ వేసుకుని, ఐలైనర్స్ పెట్టుకోవాలనుకుంటారు. ‘ప్రేమమ్’ (మలయాళ సినిమా) వచ్చిన తర్వాత పింపుల్స్ (మొటిమలు) ఉన్న అమ్మాయి కూడా చాలా అందంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుందన్నారు. అందరూ అందంగా ఉంటారు. చూసే కళ్లని బట్టి ఉంటుంది. ♦ మీలోనూ ‘ప్రేమమ్’ తర్వాతే ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందా? యస్. నేనూ మామూలు అమ్మాయినే కదా! అందరిలానే ఆలోచించా. నేను చూసిన సినిమాలన్నిటిలో హీరోయిన్స్ అందరూ చాలా బాగున్నారు. ముఖంపై ఓ మచ్చ లేదు. దేవతల్లా కనిపించారు. నేను బాగున్నానా? లేదా? అని ఇన్‌సెక్యురిటీ ఉండేది. బట్, క్యారెక్టరే ఇంపార్టెంట్ కదా. రియల్ లైఫ్‌లో అందరూ ప్రెట్టీ. ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ ప్రెట్టీ. అందరూ ఈ మాటే చెప్పాలి. మేకప్ వేసుకున్న హీరోయిన్లూ ‘నేను మేకప్ లేకుండానే బాగున్నా’ అని ఫీలవుతారు. ‘ఫిదా’లో మేకప్ లేకుండా ఆ అమ్మాయి బాగుంది.. నేనూ మేకప్ లేకుండా బాగుంటానని ఏ అమ్మాయి అయినా అనుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ♦ ‘ఫిదా’లో ఓ సీన్లో మోడ్రన్ డ్రస్సులో కనిపించారు. రియల్ లైఫ్‌లో? అందులో నేనంత కంఫర్టబుల్‌గా లేను. కానీ, శేఖర్ కమ్ములగారి కోసం చేశా. మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు, సల్వార్స్లోనూ ఓ అమ్మాయిను ఎలా చూపించాలో అలానే చూపించాలి. గ్లామరస్‌గా చూపిస్తే వేరేలా ఆలోచిస్తారు. నాకది వద్దు. ప్రతి రోజూ అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా వేసుకెళ్లే డ్రస్సులనే వేసుకుంటా. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకో కూడదు. దాన్ని బ్యాడ్‌గా చూడకూడదు. అందరికీ మనమదే నేర్పించాలి. ♦ తెలుగు ‘ప్రేమమ్’ ప్రచార చిత్రాలు చూసి టీచర్ పాత్రకు మీ అంత సూట్ కాలేదని శ్రుతీహాసన్‌ను కొందరు కామెంట్ చేశారు... శ్రుతి ఓ క్యారెక్టర్ చేశారు. ఆమె ఎలా నటించిందో చూడక ముందు, జస్ట్ ట్రైలర్స్ చూసి కామెంట్స్ చేయడం తప్పు. సోషల్ మీడియాలో కామెంట్స్‌ను అందరూ చూస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. జస్ట్ థింక్... కామెంట్ చేసిన అబ్బాయిని ఓ వంద మంది కామెంట్ చేస్తే ఎంత బాధపడతాడు. మంచి విషయం చెప్పాలనుకుంటే... అందరికీ చెప్పండి. మీకు నచ్చలేదని కామెంట్ చేయడం, అందరికీ చెప్పడం ఎందుకు? ఆమెపై వచ్చిన కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డా. ‘ఫిదా’కు విడుదలకు ముందు ట్రైలర్ చూసి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు సోషల్ మీడియాలో ‘తెలుగులో ఎంతోమంది అమ్మాయిలుంటే... ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు? మన పక్కింటి అమ్మాయిలానే ఉంది కదా!’ అన్నారు. సినిమా చూసి, నా నటనకు ‘ఫిదా’ అయ్యామన్నారు. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది. ♦ భానుమతిగారూ... మీ నటనకు ఇంత పేరొస్తుందని ఊహించారా? (నవ్వుతూ). ‘ఫిదా’ విడుదల తర్వాత సాయి పల్లవీ అని కాకుండా నన్ను భానుమతీ అంటుంటే హ్యాపీగా ఉంది. నా బెస్ట్ ఇస్తే, హార్డ్‌వర్క్ చేస్తే మంచి పేరొస్తుందనుకున్నా. కానీ, ఇంత పేరొస్తుందని ఊహించలేదు. ఈ సక్సెస్ నాకింకా సింక్ కాలేదు. ♦ సాయిపల్లవి వల్లే సినిమా హిట్టయ్యిందని కొందరంటున్నారు... వరుణ్‌ది, నాది, రాజు (‘దిల్’ రాజు)గారిది, శేఖర్ కమ్ముల గారిది, ఇంకో రెండుమూడు ముఖాలే ప్రేక్షకులు చూస్తారు. కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు, కాస్ట్యూమర్స్, మిగతా టీమంతా కష్టపడ్డారు. అలాగే, నాకు కాఫీ ఇచ్చిన అబ్బాయి కూడా ఇంపార్టెంటే. నేను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేశాడు. నేను వాళ్లందరికీ క్రెడిట్ ఇస్తా. ♦ తెలంగాణ భాష–యాసలపై అంత స్పష్టత ఎలా వచ్చింది? ‘భానుమతి స్లాంగ్ ఇలానే ఉండాలి’ అని శేఖర్ కమ్ముల చెప్పినప్పుడు.. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతుందా? అనే డౌటొచ్చింది. కానీ, కన్విన్స్ చేశారు. ఏదైనా డైలాగును స్పష్టంగా పలకకపోయినా.. లిప్ సింక్ లేకున్నా ముఖంలో తెలుస్తుంది. నాకది ఇష్టం లేదు. అందుకే, ప్రతిరోజూ నా డైలాగులను వంద సార్లు చదువుకునేదాన్ని. ఓ ఏడాది పాటు నేను భానుమతిగా మారా. పాత్రలో జీవించా. ఇప్పుడు నటిస్తున్న ‘ఎం.సి.ఎ.’ షూటింగ్ మొదట్లో తెలంగాణ యాస వచ్చేది. ‘ఇప్పుడు మామూలు మనిషినయ్యా (నవ్వులు). ♦ ‘ఫిదా’లో పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌గా నటించారు. ఆయన సినిమాలు ఏవైనా చూశారా? ‘గబ్బర్‌సింగ్’ చూశా. అయితే... థియేటర్లో ‘ఫిదా’ చూస్తున్నప్పుడు ఓ డౌట్ వచ్చింది. నా నటనకు చప్పట్లు కొడుతున్నారా? లేదంటే నేను చెప్పిన పవన్‌గారి డైలాగులకు చప్పట్లు కొడుతున్నారా? అని!! ఒక్కో డైలాగ్ చెబుతుంటే థియేటర్ మొత్తం చప్పట్లు, ఈలలు. నెక్ట్స్ ఇంపార్టెంట్ డైలాగ్ ఉంది. అది వినిపిస్తుందో? లేదోనని భయపడ్డా. కాసేపటికి నాకే చప్పట్లు కొడుతున్నారనుకున్నా. ఆడియో వేడుకలోనూ అంతే. ‘నేను పీకే సార్ ఫ్యాన్’ అని శేఖర్ కమ్ములగారు చెప్పగానే... ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆపడం లేదు. అప్పుడు ‘నేను డైలాగ్స్ కరెక్టుగా చెప్పానా? పీకే సార్ యాటిట్యూడ్ సరిగ్గా వచ్చిందా? లేదా’ అని ఆలోచించా. ♦ ఏ సీన్‌కి ఎక్కువ కష్టపడ్డారు? ఎక్కువ టేకులు తీసుకున్నారు? నేను ఉదయం నాలుగున్నరకు నిద్రలేస్తా. రాత్రి పదిన్నర తర్వాత ఆటోమేటిక్‌గా నిద్రొస్తుంది. ఇందులో ఓ సీన్‌ను రాత్రి పదిన్నర తర్వాత ప్లాన్ చేశారు. మామూలుగా రెండుమూడు పేజీల డైలాగులు చెప్పేసే నేను, ఆ రోజు రెండు లైన్ల డైలాగ్‌కి మూడు టేకులు తీసుకున్నా. నా వల్ల ప్రతి ఒక్కరూ రెండు మూడు టేకులు చేస్తున్నారు. అప్పుడు ఏడుపొచ్చేసింది. ♦ మరి, నిజంగా కన్నీళ్లు పెట్టుకోవలసిన సీన్స్ ఎలా చేశారు? నాకొక చెల్లి ఉంది. తనకు పెళ్లై వెళ్తే ఎలా ఉంటుందనేది ఊహించుకుని చేశా. ఇప్పుడు తనకు నిజంగా పెళ్లయితే ఏడుపు వస్తుందా? లేదా? అనేది నాకు తెలీదు. ఎందుకంటే... ఆ ఏడుపు ఆల్రెడీ వచ్చేసింది. ♦ సెట్స్‌లో వరుణ్ ఎలా ఉండేవారు.. తన హైట్‌తో ఇబ్బందిపడ్డారా? సైలెంట్. వెరీ ప్రొఫెషనల్. ఎంత ఎక్స్ప్రెషన్ కావాలంటే... అంతే ఇస్తాడు. ఎంత సెటిల్డ్‌గా, న్యాచురల్‌గా చెయ్యొచ్చో అంత సహజంగా చేస్తాడు. నా హైట్ 5.4. వరుణ్ 6.4. మేమిద్దరం ఒక్క ఫ్రేమ్‌లో వస్తామా? లేదా? అని డౌట్ పడ్డా. క్లోజ్‌గా ఉన్నప్పుడు హీల్స్ వేసుకున్నా. మిగతా సీన్లలో హైట్ డిఫరెన్స్ ఉంటే బాగుంటుందని శేఖర్‌గారు నేచురల్‌గా షూట్ చేశారు. ఇందులో వరుణ్ ప్రపోజ్ చేస్తే చెప్పు చూపించారు. రియల్ లైఫ్‌లో.. ఒక్కరికి కూడా చూపించలేదు. చెబితే నమ్ముతారో? లేదో? రియల్ లైఫ్‌లో ఎవరూ సీరియస్‌గా నాకు ప్రపోజ్ చేయలేదు. ‘ప్రేమమ్’ తర్వాత అందులో నటించిన హీరోయిన్లందరూ తెలుగుకు వచ్చారు. మీరు లేటయ్యారు... అక్కడ వచ్చిన ప్రశంసలు చాలు. రీమేక్ చేస్తే... మళ్లీ సేమ్ రెస్పాన్స్, ఫీల్ వస్తుందా? అనేది నాకు తెలీదు. మీరు తెలుగు ‘ప్రేమమ్’ చేస్తారా? అని ఎవరూ నన్ను అడగలేదు. ఇప్పుడు ‘ఫిదా’ను కూడా వేరొక భాషలో రీమేక్ చేస్తానంటే నేను చేయను. మీరు రీమేక్‌లకు వ్యతిరేకమా? కాదు. ఆల్రెడీ మంచి పేరొచ్చింది. మళ్లీ రీమేక్ చేసి, పేరును పోగొట్టుకోవడం ఎందుకనే భయం. సినిమాల్లో లాంగ్ కెరీర్ ఉండడానికి నేను సూపర్ హీరోను కాదు కదా! ఉన్నన్ని రోజులు మంచి సినిమాలు చేయాలి. మంచి పేరు తెచ్చుకుని వెళ్లిపోవాలి. ‘ప్రేమమ్’ కంటే ముందే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి ఓ పాత్రకు శేఖర్‌గారు మిమ్మల్ని అడిగారట? నేనప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తున్నా. ఇండియాలో ఉంటే ఇటువంటి ఆఫర్స్ వల్ల నేనెక్కడ డిస్ట్రబ్ అవుతానోనని జార్జియా పంపించారు. ఎందుకంటే సినిమా కెరీర్ చిన్నది. ముఖ్యంగా అమ్మాయిలకు. అందువల్ల, నేను కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎంబీబీస్ ఫైనల్ ఇయర్లో ఆల్ఫోన్స్ (దర్శకుడు) మలయాళ ‘ప్రేమమ్’ చేయమని అడిగారు. అదీ నా సెలవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అందుకే చేశా. ఫైనల్లీ... ‘ఫిదా’కు మీకొచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏది? తెలంగాణ భాషను రౌడీయిజమ్‌కు ఎక్కువగా వాడడం వల్ల ఒక ప్రొజెక్టర్ (థియేటర్లో సినిమా వేసేవ్యక్తి) తన పిల్లలు తెలంగాణ మాట్లాడితే తిట్టేవారట. ‘ఫిదా’ చూసిన తర్వాత వాళ్లమ్మాయితో తెలంగాణలో మాట్లాడమన్నారట. మా అసిస్టెంట్ డైరెక్టర్ సూరి ఈ సంగతి చెప్పారు. ఆ ప్రొజెక్టర్ సెలబ్రిటీ కాకున్నా... నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీలవుతున్నా. -
లక్ అంటే సాయిపల్లవిదే!
తమిళసినిమా: నటి సాయిపల్లవి.. ఈ పేరు ఇటీవల టాలీవుడ్లో బాగా వినిపిస్తోంది. అంతకు ముందే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మారుమోగింది. 2015 తెరపైకి వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది.అందులో మలర్‌గా టీచర్ పాత్రలో సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.అంతే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నుంచి గౌతమ్‌మీనన్ వరకూ పలువురు తమ చిత్రాల్లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. అయితే అలాంటి పెద్దపెద్ద అవకాశాలను కూడా నిరాకరించిన ఈ కేరళకుట్టి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తూ చివరికి టాలీవుడ్ చిత్రం ఫిదాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో పలు అవకాశాలను వదులుకున్న సాయిపల్లవి విజయ్ దర్శకత్వంలో నటించడానికి సమ్మతించింది. ఆయన దర్శకత్వంలో నటిస్తున్న కరు అనే చిత్రం నిర్మాణంలో ఉంది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతోనూ, తెలుగులో ఫిదా చిత్రంతోనూ విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్రవేసుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో కరు చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తోంది.ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతల కన్ను సాయిపల్లవిపై పడిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
జోడీ సెట్?
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి... ఇలా సూపర్ హిట్స్‌తో దూసుకెళుతోన్న శర్వానంద్, మలయాళ ‘ప్రేమమ్’తో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి జంటగా నటించనున్నారా? అంటే ఫిల్మ్‌నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘ఫిదా’లో భానుమతిగా సాయి పల్లవి నటన, ఆమె అందానికి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ అటు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్లో సాయి పల్లవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమ్.సి.ఎ. (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తోన్న ఈ మలయాళ బ్యూటీ శర్వానంద్ హీరోగా రూపొందనున్న సినిమాకి ఓకే చెప్పారట. ఇంకొన్ని అవకాశాలున్నప్పటికీ ఆచి తూచి అడుగులేయాలని సాయి పల్లవి అనుకుంటున్నారట. -
మస్తుందిరా బై... 'ఫిదా' అయితరు
కొత్త సినిమా గురూ ఫిదా అరే... ఏముందిరా బై సిన్మా! మొన్న శుక్రవారం పొద్దుగల జూసినా. ఇంకా దిమాక్ లోంచి యెల్లట్లే! ఆడ సగం ఈడ సగం ఇంగ్లీస్ మాటల్తో ‘హ్యాపీడేస్’ తీసిండ్రు సూడు... ఈ సిన్మాకు పోయెముందు ఆ డైరెక్టర్ పేరు నాక్కూడా జల్దీ యాదికి రాలె. ఆయన సిన్మా తీసి మూడేండ్లు గయిందట. గా శేఖర్ కమ్ములనే అమెరికాల, ఆంధ్రాల, తెలంగాణల తెలుగు సిన్మా పిచ్చోళ్లను ఈ సిన్మాతో ‘ఫిదా’ చేసిండు! గట్లయితే గీ సిన్మాలో గంతఘనం ఏముంది? ముచ్చట జెప్తా వినుకోండి! కథ: వరుణ్ (వరుణ్ తేజ్) అమెరికాలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రా పోరడు. అతడికి అమ్మనాయన లేరు. ఓ అన్న, తమ్ముడు. అన్న పెండ్లి కోసమని తెలంగాణల నిజామాబాద్‌లోని బాన్సువాడకు వస్తడు. ఈడ ఓ పోరిని జూసి పిల్లగాడి మనసు ఫిదా అయితది! ప్రేమల పడతడు. గా పోరి ఎవరో కాదు మళ్ళా... అన్నగాడి మరదలు (అన్న పెండ్లి చేసుకున్న పోరి చెల్లెలు) అన్నట్టు! పేరు... భానుమతి (సాయి పల్లవి). అగ్రికల్చర్ డిగ్రీ జేస్తుంటది. నాయన అంటే ఆమెకు ప్రాణం. క్యారెక్టర్ సంగతికొస్తే, సింగిల్ పీస్ హైబ్రీడ్ పిల్ల, దుండుకు ఎక్కువ అన్నట్టు. గీ పిల్ల కూడా పోరడి మనసు జూసి ‘ఫిదా’ అయితది. ఇంకేముంది? ఖేల్ ఖతం దుకాణ్ బంద్! అన్న పెండ్లి తర్వాత వరుణ్, భానుమతిల పెండ్లే అనుకుంటున్నప్పుడు నడిమిట్ల ఓ తకరారు వచ్చి పడతది. గదేంటంటే... కన్నబిడ్డ లెక్క తండ్రి బాగోగులు జూడనీకి అక్కరకొచ్చెలా పుట్టిన పల్లెల ఉండాలని భానుమతి కోరిక. అమ్మ కోరిక ప్రకారం అమెరికాల న్యూరోసర్జన్ జేసి, అక్కడే పెద్ద డాక్టర్ అవ్వాలనుకుంటడు వరుణ్. దాంతో సంధి కుదరలె. అలగ్ సలగ్ అన్నట్టు ఎవరి తోవల వాళ్లు పోతరు. కానీ, ఇద్దరి మనసుల ఒకరిపై ఇంకరికి మస్తు ప్రేమ ఉంటది. ఈడ తెలంగాణల భానుమతి.. ఆడ ఆమెరికాల వరుణ్.. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. మనసుల మాత్రం లొల్లి లొల్లి. దిమాక్ లోంచి భానుమతి ప్రేమను యెల్లగొట్టడానికి వరుణ్ కిందా మీదా పడుతుంటడు. పోరడ్ని మస్తు తిప్పలపాలు జేయడానికి అన్నట్టు... భానుమతి అమెరికాల దిగుతది. గప్పుడేమైంది? సంధి ఎట్లా కుదిరింది? అన్నది సిన్మాకథ విశ్లేషణ: సిన్మా జూసినోళ్లలో మస్తుమంది ‘హమ్ ఫిదా హోగయే’ అంటూ ఫేసుబుక్కు, ట్విట్టర్లలో మస్తు కామెంట్లు పెడుతుండ్రు. గంతలా ఏముందా? అని యాదికి తెచ్చుకుంటే... సిన్మా మొదలైన సంధి, ముగింపుకొచ్చె వరకు తెలంగాణ ఊళ్లలో తోవలపొంటి, చలకలపొంటి (వీధుల్లో, పొలాల్లో) పోయిన (తిరిగిన) ఫీల్ ఉంది. సటుక్కున దిమాక్‌లోకి దూరిపోయే అందమున్న పోరి సాయిపల్లవి ఉన్నది. పక్కింటి కుర్రాడిలా సహజంగా నటించిన వరుణ్‌తేజ్ ఉన్నడు. లవ్, ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే, ఈ తెలంగాణ యాస–భాష! నిజం... తెలంగాణ నుడికారానికీ, పల్లె సంస్కృతికి పట్టుపంచె కట్టిందీ ‘ఫిదా’. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ, కమర్షియల్ లెక్కలకు దూరంగా సాగిన కథనంలో, సిన్మాలో ఓ కొత్తదనం ఉంది. ‘ఎంత ముద్దుగున్నావ్ పంచెల. మంచి గాలి కూడా తగుల్తది’– గంటి మాటలు మస్తున్నాయ్. దాంతో ‘ఫిదా’లో కొత్తగాలి వీచింది. చూస్తున్నంత సేపు ఇది మన కథే, మన బాధే అన్నట్టుండే ఫీల్ కలిగించడంలో శేఖర్ కమ్ముల చాలావరకు సక్సెస్ అయ్యారు. ‘హేయ్ పిల్లగాడా, వచ్చిండే’ పాటలు, వాటిలో వరుణ్–పల్లవి మధ్య కెమిస్ట్రీ, శేఖర్ కమ్ముల చిత్రీకరించిన విధానం బాగున్నాయి. ఈ రెండిటితో పాటు ‘ఊసుపోదు..’ పాట కూడా కొన్నాళ్లు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంది. జీవన్ బాబు నేపథ్య సంగీతం సీన్లలో ఫీల్‌ను మరింత ఎలివేట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా ‘మాభూమి’ ఫేమ్ సాయిచంద్, అత్తగా గీతా భాస్కర్ (‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ తల్లి), అక్కగా శరణ్య, హీరో అన్నయ్యగా రాజా, స్నేహితుడిగా ‘సత్యం’ రాజేశ్ బాగా నటించారు. ఈ సిన్మాకు నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ మస్తుగనే పైసల్ ఖర్చు చేశారు. సగటు శేఖర్ కమ్ముల సినిమాలా ‘ఫిదా’ కూడా కాస్త నెమ్మదిగా నడుస్తుంది. కానీ, వరుణ్‌తేజ్–సాయిపల్లవిల నటన, శేఖర్ కమ్ముల దర్శకత్వం, పాటల ముందు అదేమంత పెద్ద కంప్లయింట్ కింద అనిపించదు. – సత్య పులగం -
ప్రేమకు ఫిదా : వరుణ్ తేజ్
-
నాకు మొహమాటం ఎక్కువ.. అందుకే!
‘‘శేఖర్గారి సినిమాల్లో బలమైన, భారీ కథలేవీ ఉండవు. కానీ, హ్యూమన్ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపిస్తారు. మన ఇంట్లోనో, పక్కింట్లోనో జరిగినట్టుండే సీన్లతో కథ అల్లుతారు. ‘ఫిదా’ కూడాఅలానే ఉంటుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారు’’ అన్నారు వరుణ్ తేజ్. ఆయన హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫిదా’ రేపు రిలీజవుతోంది. వరుణ్ చెప్పిన విశేషాలు... ♦ ‘ఫిదా’లో ప్రేమకథతో పాటు తండ్రీకూతుళ్లు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలను శేఖర్‌గారు అందంగా, సున్నితంగా చూపించారు. నేను మెడిసిన్ చదివే ఎన్నారైగా నటించా. బాబాయ్ (పవన్‌కల్యాణ్) ఫ్యాన్‌గా సాయి పల్లవి నటించింది. కొన్ని సీన్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా బాబాయ్ డైలాగులు చెప్తూ, మేనరిజమ్‌ను కాపీ చేసింది. ఆడియోలో బాబాయ్ పేరు ఎవరు ఎత్తినా అరుపులే. అప్పుడామె ‘ఆపడం లేదేంటి?’ అనడిగింది. ‘అదంతే! బాబాయ్ ఫాలోయింగ్ నీకు తెలీదు. మాకిది అలవాటే. ఇంకొంచెం సేపు అరుస్తారు. వెయిట్ చెయ్’ అన్నా. ♦ ముందునుంచీ నేను హీరోయిజమ్ వెనుక వెళ్లడం లేదు. ‘కంచె’లోనూ పర్టిక్యులర్‌గా హీరోయిజమ్ అంటూ ఎక్కడా ఉండదు. ఈ సిన్మాలో కథ ప్రకారం శేఖర్‌గారు ముందు రెండు ఫైట్స్ అనుకున్నారు. మళ్లీ ఎక్కువ అవుతుందేమోనని ఓ ఫైట్ తీసేశారు. నేనేం అనలేదు. కథ బాగుంటే హ్యాపీ. మెగా ఫ్యాన్స్ హీరోయిజమ్ ఆశిస్తారు కదా? అని వరుణ్‌ను అడగ్గా.. ‘‘వాళ్లూ సినిమా బాగుంటే హ్యాపీ. ఇవన్నీ చూడరు. నాకు ఫ్యాన్స్ గురించి కొంచెం తెలుసు. ఫస్ట్ లుక్, ట్రైలర్ నుంచి సిన్మా ఏంటనేది క్లియర్‌గా చెబుతున్నాం. ప్రిపేర్ అవుతారు’’ అన్నారు. ♦ నా సిన్మాల్లో ‘కంచె’ మిగతావాటి కంటే బాగా ఆడింది. అది విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాగా అన్పించింది. నిజాయితీగా చెప్పాలంటే... అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా కాదు. ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంది. అందరికీ సినిమా నచ్చితే పెద్ద సక్సెస్ వస్తుంది. ఈ సిన్మా అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో రాజుగారు ఆడియోలో ‘ఫిదా’తో వరుణ్‌కి కమర్షియల్ సక్సెస్ వస్తుందన్నారు. ♦ శేఖర్‌గారికి ఓ సొంత మార్క్ ఉంది. ఆయన సిన్మాలను ఇష్టపడే వాళ్లు చాలామంది ఉన్నారు. టీజర్, ట్రైలర్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి ‘ఎక్కడో దాక్కున్న మీ ఫ్యాన్స్ సడన్‌గా బయటకొచ్చారు’ అన్నా. ‘నాకింత మంది ఉన్నారనుకోలేదు’ అన్నారాయన. ♦ నాన్న (నాగబాబు) సినిమా చూశారు. ఆయనకు ప్రేమకథలు పెద్దగా ఎక్కవు. కమర్షియల్, యాక్షన్ మీటర్లో వెళతారు. కానీ, ‘ఫిదా’ బాగా నచ్చింది. ♦ చరణ్ అన్న, బన్నీ అన్న, తేజ్... ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. వాళ్లు ఎలాంటి సినిమాలు చేస్తున్నారని ఆలోచించను. నటుడిగా నా సెన్సిబిలిటీస్ డిఫరెంట్. నాకు వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. ఇప్పటివరకు అలాంటి సినిమా చేయలేదు. భవిష్యత్తులో మంచి యాక్షన్ సబ్జెక్ట్ వస్తే, అన్నీ కుదిరితే సినిమా చేస్తా. ప్రయోగాలు చేయాలని ఇవన్నీ చేయడం లేదు. మంచి కథలు చేస్తున్నానుకుంటున్నా! ♦ మిస్టర్’తో నేను నిరాశ పడ్డా. పెదనాన్నగారి అభిమానులంతా కూడా బాధపడ్డారు. ‘ఎలా ఒప్పుకున్నారీ సినిమా?’ అన్నారు. ‘మిస్టర్’కి తప్పటడుగులు పడ్డాయి. కారణాలు ఏంటని టీమంతా ఎనలైజ్ చేసుకున్నాం. అయితే... మరీ అంత బ్లండర్ అవుతుందనుకోలేదు. ♦ మళ్లీ నిర్మాతగా నాన్న బిజీ అయితే చూడాలనే కోరిక లేదు. కానీ, ఆయనకు ఏది సంతోషాన్నిస్తే... దానికి నేను సపోర్ట్ చేస్తా. మరి, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో సినిమా ఎప్పుడు? అంటే.. ‘‘చేస్తా. నాకు మొహమాటం ఎక్కువ. ఎవర్నీ అడగలేను. చరణ్ అన్నే ‘కొణిదెలలో ఎప్పుడు చేస్తావ్?’ అనడిగాడు. మంచి కథ కోసం చూస్తున్నాం’’ అన్నారు. ♦ డ్రగ్స్ ఇష్యూలో కొందరు చిత్రపరిశ్రమను నిందించడం నేనూ టీవీల్లో చూశా. ఇటువైపు (చిత్రపరిశ్రమ) వాదనలు కూడా నేను చూశా. రెండిటిలోనూ కొన్ని కొన్ని పాయింట్స్ కరెక్ట్ అన్పించాయి. వేరే వార్తలో తొమ్మిదో తరగతి అమ్మాయి (పూర్ణిమ సాయి) మిస్ అయ్యిందని చూశా. దట్ వాజ్ వెరీ హర్ట్ బ్రేకింగ్. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. చిత్రపరిశ్రమ ఒక్కటే కాదు... ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇలాంటివి జరక్కుండా చూడాలి. ఇండస్ట్రీ విషయానికి వస్తే... విచారణ కోసం కొందర్ని పిలిచారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ!! సినిమావాళ్లను అందరూ చూస్తారు కాబట్టి మేం జాగ్రత్తగా ఉండాలి. ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అందరూ మంచి పనులు చేస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మంచి–చెడు, నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ హైలైట్ అవుతుంది. -
ప్రతి సినిమాకీ ఐదారు కిలోలు తగ్గుతా!
‘‘శేఖర్ కమ్ముల సినిమా కావాలనే ‘దిల్’ రాజుగారు గానీ, ఎవరైనా నా దగ్గరకొస్తారు. ఎందుకంటే... నేను వేరేలా చేయలేను. ఇందులో ఏమైనా ట్వీక్ (సర్దుబాట్లు) చేస్తే మొదటికే దెబ్బ పడుతుంది. అది ఆయనకు (‘దిల్’ రాజు) తెలుసు. ఎవరో కాదు, నేనే ఒకసారి రాసిన సీన్‌ను లేపితే మళ్లీ రాయలేను. ఇదేదో గొప్పగా చెప్పడం లేదు. నేనంతే! నీ స్టైల్లో సినిమా తీయమని ‘దిల్’ రాజు చెప్పారు’’ అన్నారు శేఖర్ కమ్ముల. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సిన్మా గురించి శేఖర్ కమ్ముల చెప్పిన సంగతులు... ♦ కథ బాగా వచ్చేవరకూ నేను వెయిట్ చేస్తా. ‘ఫిదా’ విషయంలోనూ నా పంథా మారలేదు. అందువల్ల ‘అనామిక’ తర్వాత మరో సిన్మాతో రావడానికి మూడేళ్లు టైమ్ పట్టింది. అయితే... మధ్యలో స్టార్స్‌ను (మహేశ్‌బాబు, రామ్‌చరణ్) కలిశా. ఓ ప్రేమకథ ఉంది. చేద్దామా? వద్దా? అనే డిస్కషన్స్‌లోనే ఆగింది. కానీ, పూర్తి కథను మాత్రం ఎవరికీ చెప్పలేదు. ♦ నేను అమెరికాలో ఉండొచ్చాను కాబట్టి ఎప్పట్నుంచో ఆ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేయాలనుకున్నా. కథ రాస్తున్న టైమ్‌లో అమ్మాయి నేపథ్యం తెలంగాణ ఏరియాకి చెందిన పల్లెటూరు అయితే బాగుంటుందనుకున్నా. సాధారణంగా పల్లెటూరు అంటే మనకు కోనసీమే చూపిస్తారు. తెలంగాణలో భాన్సువాడను చూపించడం మంచి నిర్ణయం. ‘ఆనంద్’ కథేంటి? అనడిగితే నేను చెప్పలేను. అలాగే, ఈ కథ కూడా! ఫీల్ ఉన్న చిత్రమిది. సినిమా చూస్తే తెలంగాణ ఇంత పచ్చగా, అందంగా ఉంటుందా? అనిపిస్తుంది. అమెరికాలోనూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వంటి టూరిజమ్ స్పాట్స్ కాకుండా అక్కడ ఎన్నారైల లైఫ్ స్టైల్, రియల్ లొకేషన్స్ చూపించా. ♦ సిన్మాలో వరుణ్‌ది ఓ యాటిట్యూడ్ అయితే సాయి పల్లవిది ఇంకో యాటిట్యూడ్. పల్లవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా నటించగలదనే ఫీల్ ఇచ్చింది. ఆమెకు ధీటుగా వరుణ్ నటించాడు. నేను చేసిన హీరోల్లో అతనిది చాలా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. కళ్లు చూస్తే చిరంజీవి, పవన్కల్యాణ్గార్ల చమక్లు కనిపిస్తాయి. ♦ ప్రతి ఒక్కరు ఈ సినిమాను రెండు మూడుసార్లు చూస్తారు. దుమ్ము దులుపుతుందంతే. దుమ్ము దులపడమంటే... బ్లాక్‌బస్టర్ అని కాదు, ఇట్స్ రీ–ఫ్రెషింగ్ ఫిల్మ్. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీలకు బాగా నచ్చుతుంది. అమ్మాయిలు గర్వపడే చిత్రమిది. నేను ఎంచుకున్న నేపథ్యం, కథకు న్యాయం చేయడం నా స్టైల్. ‘ఫిదా’ నా స్టైల్లో అందంగా, కవితాత్మకంగా... వర్షం పడుతున్నట్టు ఉంటుంది. ♦ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా... ప్రేక్షకుల అభిరుచులు మారాయా? వేరే ట్రెండ్ వచ్చిందా? అనే భయాలు నాలోనూ ఉన్నాయి. అయితే, ఇలాంటి సిన్మా ప్రేక్షకులు చూసుండరు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ మూడు కంటే గొప్ప కథలు రాయలేరు. ఆ తర్వాత తవ్వుకుంటుంటాం. ప్రేమకథలైతే మరీ ఎక్కువ రాయలేం. ఫీలయ్యి రాయాలి కాబట్టి! ఒక్కసారే మేజిక్ జరుగుతుంది. ఈ సిన్మాకు అది జరిగింది. నా ఆశ ఏంటంటే... స్టార్స్ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. వాళ్లకూ మాస్ కమర్షియల్ సినిమాలు చేసి బోర్ కొడుతుంది. ♦ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఏం ఆలోచించుకోలేదన్నారు. మీ ఫ్యాన్స్ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు? అని శేఖర్ కమ్ములను ప్రశ్నించగా... ‘‘నా వల్ల కాదు. ఇలాంటి సినిమా స్పీడుగా చేయలేం. ఎక్కువ టైమ్ తినేస్తుంది. నా లైఫ్‌లో అదో పార్ట్. ప్రతి సినిమాకు నేను ఓ ఐదారు కేజీల బరువు తగ్గుతా. కళ్లు పీక్కుపోతాయి. ఇంట్లో వాళ్లంతా కంగారు పడతారు. నాతో పాటు మా టీమంతా అంతే కష్టపడతారు. నేను త్వరగా సినిమా చేస్తే మరో ‘అనామిక’ అవుతుందేమో. నా నుంచి ఏదైతే కోరుకుంటారో... అది నా దురదృష్టం. లైబ్రరీలో ఉండే సినిమాలు తీయాలనుకుంటున్నా. నేను మామూలుగా సినిమాలు తీస్తే ఆడవు’’ అన్నారు. -
‘దిల్’ రాజు రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడు!
‘‘ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు ‘దిల్’ రాజు. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన ముచ్చట్లు... ⇒ ఓ పెళ్లిలో కలసిన వరుణ్ (హీరో), భానుమతి (హీరోయిన్) తమ కలలను ఎలా నెరవేర్చుకున్నారనేది చిత్రకథ. తెలంగాణ భాన్సువాడ అమ్మాయి, అమెరికాలో సెటిలైన ఆంధ్రా అబ్బాయి నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే ప్రాంతాలతో ముడిపడిన ప్రేమకథ కాదిది. వేర్వేరు మనస్తత్వాలున్న వీళ్ల మధ్య జరిగే కథ. హీరో సాఫ్ట్ అయితే... హీరోయిన్ రెబల్. ⇒ పవన్‌కల్యాణ్‌కు ‘తొలిప్రేమ’ 4వ సిన్మా. అప్పుడాయనకు ఎలాంటి ఇమేజ్ లేదు. ‘ఆర్య’ టైమ్‌లో బన్నీకి ఎలాంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు వరుణ్ సేమ్ పొజిషన్లో ఉన్నాడు. ఓ నలుగురిని కొట్టాలని, హీరోయిజమ్ చూపించాలని అనుకోవడం లేదు. ‘సీతమ్మ వాటిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం మహేశ్‌బాబు, ‘బృందావనం’ కోసం ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కోసం ప్రభాస్... ఇలా స్టార్స్ తమ ఇమేజ్ పక్కనపెట్టినప్పుడు మంచి సినిమాలొస్తాయి. వరుణ్‌కి ఈ సిన్మా మంచి కమర్షియల్ హిట్ ఇస్తుంది. ⇒ సాయిపల్లవి సెలక్షన్ శేఖర్ కమ్ములదే. మేం సంప్రదించే టైమ్‌కి ఆమె మెడిసిన్ చదువుతోంది. అది పూర్తయ్యే వరకు సినిమాలు చేయనని చెప్పింది. మాకు స్క్రిప్ట్ డెవలప్మెంట్కు ఆర్నెల్లు టైమ్ పట్టింది. అప్పటివరకు ఆమె కోసం వెయిట్ చేశాం. సాయి పల్లవి బాగా నటించడంతో పాటు తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ⇒ శేఖర్ కమ్ముల కథను గొప్పగా రాయడు. సీన్‌ను గొప్పగా తీస్తాడు. ఎప్పట్నుంచో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా. కానీ, మాకు సెట్ అవుతుందా? లేదా? అనుకునేవాణ్ణి. ‘హ్యాపీడేస్’ రిలీజ్ టైమ్‌లో మా ఆలోచనలు కలిశాయి. ‘లీడర్’ టైమ్‌లో ఈ కథ చెప్పారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఆయన స్టైల్లోనే సినిమా తీయమన్నా. నాగబాబుగారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చిరంజీవిగారికి సినిమాను చూపించాలనుకుంటున్నారు. ⇒ రవితేజతో తీస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రీకరణ 30 శాతం పూర్తయింది. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేస్తాం. నాని ‘ఎంసీఏ’ను డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్‌గారితో కలసి నిర్మించనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుంది. రామ్‌చరణ్‌తో సినిమా డిస్కషన్స్‌లో ఉంది. ⇒ ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’ వసూళ్ల వివాదం గురించి ‘దిల్’ రాజును ప్రశ్నించగా... ‘‘బన్నీ (అల్లు అర్జున్) కెరీర్లోనే బెస్ట్ మూవీ ‘సరైనోడు’ రెవెన్యూను ‘డీజే’ క్రాస్ చేసిందంటే ఆ సినిమా హిట్టా? ఫెయిలా? అనేది ఆలోచించుకోవాలి. సినిమాల విషయంలో నేను నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆలోచిస్తా. నా డిస్ట్రిబ్యూటర్స్ లాభనష్టాల గురించి కూడా ఆలోచిస్తా. ‘డీజే’ విషయంలో నిర్మాతగా హ్యాపీ. నేను సక్సెస్ అయ్యాను కాబట్టే సక్సెస్ మీట్ రోజున హ్యాట్రిక్ మూవీ అని ప్రకటించా. నేనో స్టేట్మెంట్ ఇస్తే వేల్యూ ఉంటుంది. వసూళ్లను ఎక్కువ చేసి చూపించే అలవాటు నా జీవితంలో లేదు. భవిష్యత్తులోనూ చేయను. ‘దిల్’ రాజు ఎప్పుడూ రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడు’’ అన్నారు. ⇒ ‘డీజే’ విడుదల తర్వాత నేను అమెరికా వెళ్లడంతో ఇక్కడ (డ్రగ్స్ వ్యవహారం) ఏం జరిగిందో నాకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంతో పోలిస్తే ‘జీఎస్టీ’ వల్ల నిర్మాతలపై పది శాతం భారం పెరిగింది. షేర్ వసూళ్లపై జీఎస్టీ ప్రభావం ఎక్కువ పడుతోంది. దీనిపై తెలుగు ప్రభుత్వాల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. -
అమ్మాయికి తిక్క.. నో లెక్క...
వరుణ్... అమెరికాలో ఉండే తెలుగబ్బాయి. అన్నయ్య పెళ్లి కోసమని ఇండియా వచ్చినప్పుడు వదిన చెల్లెలు భానుమతిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి పవన్‌కల్యాణ్‌కి పిచ్చ ఫ్యాన్. ‘గబ్బర్‌సింగ్’లో పవన్ టైపులో తిక్కుంటుంది కానీ, నో లెక్క. అందువల్ల ప్రేమకథలో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అప్పుడు ఏమైంది? భానుమతి తిక్కకు లెక్క ఎలా కుదిరింది? వరుణ్, భానుమతిలు ఎలా ఒక్కటయ్యారు? అనేది ఈ నెల 21న థియేటర్లలో చూడమంటున్నారు శేఖర్ కమ్ముల. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ‘ఫిదా’. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే, సినిమా కూడా యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ‘యు’ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ నెల 21న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి. -
చిరంజీవి ఉన్నారు కాబట్టే అంతమంది హీరోలు..
– ‘ఫిదా’ ఆడియో ఫంక్షన్లో ‘దిల్’ రాజు ‘‘నేను ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ‘స్టేట్ రౌడీ’ షూటింగ్లో ఫస్ట్ టైమ్ చిరంజీవిగారిని చూశా. ‘అల్లుడా మజాకా’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన చేతుల మీదగా షీల్డ్ తీసుకున్నా. ఆయనతో ఎన్నో మూమెంట్స్ నాకు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఫిదా’. శక్తికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే... తర్వాత పవన్ కల్యాణ్‌గారు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. చిరంజీవిగారిని తల్చుకోకుండా వరుణ్ ఫంక్షన్‌గానీ, ఏ ఫంక్షన్‌గానీ జరగదు. ఎందుకంటే ‘హీ ఈజ్ మెగాస్టార్’. ‘ఖైదీ నంబర్ 150’, ‘డీజే’కి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో కొంతమంది వాంటెడ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. చిరంజీవిగారి రేంజ్ ఎప్పుడూ తగ్గదు. ‘ఖైదీ’కి, ‘డీజే’కి పోలికే లేదు. ‘ఆనంద్’ మంచి కాఫీ లాంటి సినిమా అయితే ‘ఫిదా’ ‘ఖుషి’ లాంటి సినిమా. ‘ఆనంద్, హ్యాపీడేస్’ తర్వాత ‘ఫిదా’ అలా ఉండబోతోంది. ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఈ ఆరు నెలల్లో మా బ్యానర్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాం. ‘ఫిదా’ కూడా సూపర్‌హిట్ కాబోతోంది’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘వరుణ్, సాయిపల్లవి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. వారిని చూస్తే ‘ఖుషి, తొలిప్రేమ’ సినిమాలు గుర్తుకొస్తాయి. వరుణ్ నటనలో చిరంజీవి, పవన్, నాగబాబు షేడ్స్ కనిపిస్తుంటాయి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్యం థియేటర్లో ‘ఆనంద్, హ్యాపీడేస్’ సినిమాలు చూశా. ‘దిల్’ రాజుగారితో పనిచేయడం హ్యాపీ. అలాంటి.. ఇలాంటి సినిమాలు చేయండి అని పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంటుంది. నేను అదే ధోరణిలో ట్రై చేస్తుంటాను. రెండు మూడు చోట్ల తప్పటడుగులు వేశా. ఐ ప్రామిస్.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా. నాకు ఇటువంటి అభిమానులను ఇచ్చిన పెదనాన్న, బాబాయ్‌కి థ్యాంక్స్. ఈ నెల 21న విడుదలవుతోన్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు. కాగా ఇదే వేదికపై ‘శతమానం భవతి, నేను లోకల్’ వంద రోజుల షీల్డ్‌లను చిత్రబృందానికి అందించారు. సాయిపల్లవి, సంగీత దర్శకుడు శక్తికాంత్, నటుడు సాయిచంద్, హీరోలు నాని, నవీన్ చంద్ర, దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, సతీశ్ వేగేశ్న, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, పాటల రచయితలు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, వనమాలి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా అబ్బాయి... ఇక్కడ అమ్మాయి
బయట చిన్నగా చినుకులు కురుస్తున్నప్పుడు... ప్రేయసి పక్కనే కూర్చుని తీయని పలుకులు వింటూ... తెరపై మాంచి కాఫీ లాంటి ప్రేమకథా చిత్రం చూస్తుంటే... ఎలా ఉంటుందో? ఒక్కసారి ఊహించుకోండి! భలే ఉంటుంది కదూ! బహుశా... హీరోలు, దర్శక–నిర్మాతలకు ఈ కిటుకు బాగా తెలుసేమో! రొమాంటిక్ సిన్మాలను రెయినీ సీజన్లోనే ఎక్కువ రిలీజ్ చేస్తుంటారు. వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సిన్మా ‘ఫిదా’ కూడా రెయినీ సీజన్లో రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ను జూలై 21న విడుదల చేస్తారని సమాచారం. మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఓ పాట మినహా పూర్తయింది. ‘ఆనంద్, గోదావరి’ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. అమెరికా ఎన్నారై, తెలంగాణ అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథే ఈ చిత్రకథ. ఓ పాట మినహా ‘ఫిదా’ చిత్రీకరణ పూర్తయిందట! జూలై 21న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
వరుణ్ తేజ్ సినిమాలో మరో హీరో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. శేఖర్ మార్క్ క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఫిదాలో వరుణ్ తేజ్‌తో పాటు మరో యంగ్ హీరో నటించనున్నాడు. శేఖర్ కమ్ముల గత చిత్రం అనామికలో లీడ్ రోల్లో నటించిన యంగ్ హీరో హర్షవర్ధన్ రానే ఫిదాలో కీలకమైన అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హర్ష, శేఖర్ కమ్ముల మీద ఉన్న గౌరవంతో వెంటనే తన బాలీవుడ్ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మరీ శేఖర్ కమ్ములకు టైం ఇచ్చాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హర్షవర్ణ్ రానే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
షూటింగ్లో ఫిదా!
ఎన్నారైల కథలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ, అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శేఖర్ కమ్ముల మాత్రం తెలుగు తెరపై తెలుగు సంప్రదాయాలను ఆవిష్కరించడానికి విలువిచ్చారు. ఇప్పుడు వరుణ్‌తేజ్ హీరోగా తీస్తున్న ‘ఫిదా’లోనూ ఆయన మార్క్ ప్రేమకథను చూపించబోతున్నారట! ‘ప్రేమ – ద్వేషం – ప్రేమకథ’ ఈ సిన్మాకు ఉపశీర్షిక. చిన్న ఛేంజ్ ఏంటంటే... కథకు ఎన్నారై టచ్ ఇచ్చారు. ‘ఫిదా’లో హీరో అమెరికన్ ఎన్నారై. తెలంగాణ అమ్మాయిను చూసి ఫిదా అవుతాడు. ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ప్రస్తుతం అయితే అమెరికాలో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ స్పాట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ సాయి పల్లవిల నవ్వులు చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అప్పట్లో అమెరికాలో శేఖర్ కమ్ముల చేసిన చిలిపి పనులను వరుణ్‌తేజ్‌కి చెబుతున్నారో లేదా సినిమాలో ఆ సీన్లను రాశారో! ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు. -
లోకల్ అబ్బాయి సరసన?
మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ అందుకుందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. మలయాళ ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’లో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి ఛాన్స్ దక్కించుకున్నారని సమాచారం. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఇటీవల ‘నేను లోకల్’ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ లోకల్ కుర్రాడి సరసనే సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో నానీకి అక్కగా అందాల భామ భూమిక నటించనున్నారనే వార్త వచ్చింది. త్వరలో ఈ చిత్రం గురించి నిర్మాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
వన్.. టు.. త్రీ.. రెడీ!
ప్రస్తుతం వరుణ్‌తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు. సుమారు ఏడెనిమిది నెలలు ఈ రెండు చిత్రాలతో వరుణ్ బిజీ. మధ్యలో కాలికి గాయం కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, ఇటీవలే చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. త్వరలో ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో బిజీ అవుతారు. ‘జ్ఙాపకం’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించిన వెంకీ అట్లూరి దర్శకుడిగా మారుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో వరుణ్‌తేజ్‌కి జోడీగా మెహరీన్ కౌర్ నటించనున్నారు. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం. మొత్తం మీద ఈ ఏడాది వరుణ్‌తేజ్ మూడు సినిమాలు విడుదల చేసేలా కనపడుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. -
50 రోజుల తరువాత సెట్లో మెగా హీరో
దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన మెగా హీరో వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. మిస్టర్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైన వరుణ్, కాలికి తీవ్ర గాయం కావటంతో షూటింగ్‌లకు దూరమయ్యాడు. దీంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్‌తో పాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభించిన ఫిదా సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు 50 రోజుల విరామం తరువాత సోమవారం వరుణ్ తిరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. కాలి గాయం నుంచి కాస్త ఉపశమనం కలగటంతో మిస్టర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఫిదా సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి మిస్టర్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వరుణ్. ఇప్పటికే సినిమా ఆలస్యం కావటంతో మిస్టర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఫిదాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మిస్టర్‌ను నల్లమలపు బుజ్జి నిర్మిస్టుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులు వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమా తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. Back on my feet and onto the sets after 50 long days!!..Excited to shoot!!..soo damn happy!! #shootresumes#mister#hyderabad pic.twitter.com/YbQcpJcqDO — Varun Tej (@IAmVarunTej) November 21, 2016 -
నేను పెళ్లే చేసుకోను!
పెళ్లి చేసుకోను అనే తారల పట్టికలో మరో నటి చేరారు. ఒక పక్క పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి పెను సంచలనానికి కేంద్రబిందువు అయ్యారన్నది గమనార్హం. తాజాగా వర్ధమాన నటి సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కారు. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిశారన్నది గమనార్హం. వైద్య విద్యనభ్యసించిన ఈ బ్యూటీలో మంచి డాన్సర్ ఉన్నారు. కొన్ని చానళ్లలో డాన్స పోటీల్లోనూ పాల్గొన్నారన్నది గమనార్హం. ప్రేమమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమంతటా ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఇంతకు ముందు కోలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అయితే త్వరలోనే కోలీవుడ్ ఆఫర్ ఆమె కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్లు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల ద్వారా ఇంట్రాక్ట్ అవడం అన్న ఒరవడి కొనసాగుతోంది. సమీపకాలంలో నటి సాయిపల్లవి తన అభిమానులతో అలాంటి చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడు ఎలా బదులిచ్చారో చూద్దాం. ప్ర: తమిళంలో మీకు నచ్చిన చిత్రం? జ: సూర్య నటించిన కాక్క కాక్క ప్ర: నచ్చిన పాట? జ: రెమో నీ కాదలన్ పాట అంటే చాలా ఇష్టం ప్ర: మీకు చికెన్ బిరియానీ ఇష్టమా?మటన్ బిరియానీ ఇష్టమా? జ: నేను శాఖాహారిని. ప్ర: ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా? జ: నేను అసలు పెళ్లే చేసుకోను. ప్ర: కారణం? జ: జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. -
వరుణ్ తేజ్ మరో సినిమా ఓకె చేశాడు..?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ఇప్పుడు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టిన వరుణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం కామెడీ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో పాటు కాఫీలాంటి సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకేసారి కానిచ్చేస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
శేఖర్‌కమ్ముల ‘ఫిదా’
-
విభిన్న ప్రేమకథా చిత్రం
ఇప్పుడొస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిదా’. సుష్మా దర్శన్ క్రియేషన్స్ పతాకంపై అభినయ్ దర్శన్, మధుమిత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో బుధవారం ముహూర్తపు సన్నివేశానికి పద్మిని కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ క్లాప్ ఇచ్చారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రం చేస్తున్నాం. దర్శకుడి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్.