
‘భానుమతి.. ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల... బొక్కలిరగ్గొడతా నకరాలా’ అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారీ చెన్నె బ్యూటీ. కథానాయికగానే ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఏ రేంజ్‌లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకనే విషయానికి వస్తే... సాయిపల్లవి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.
తొలి చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’తో ఘనవిజయం అందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. వేణు ఊడుగుల చెప్పిన స్టొరీ లైన్ ఈ బ్యూటీకి బాగా నచ్చిందని భోగట్టా. అయితే స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం శర్వానంద్ సరసన సాయి పల్లవి ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన ‘కణం’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ‘మారి 2’, ‘ఎన్‌జీకె’, ఇంకా పేరు ఖరారు చేయని ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment