అమ్మాయికి తిక్క.. నో లెక్క... | fidha movie will be released on this month 21 | Sakshi
Sakshi News home page

అమ్మాయికి తిక్క.. నో లెక్క...

Published Sat, Jul 15 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

అమ్మాయికి తిక్క.. నో లెక్క...

అమ్మాయికి తిక్క.. నో లెక్క...

వరుణ్‌... అమెరికాలో ఉండే తెలుగబ్బాయి. అన్నయ్య పెళ్లి కోసమని ఇండియా వచ్చినప్పుడు వదిన చెల్లెలు భానుమతిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి పవన్‌కల్యాణ్‌కి పిచ్చ ఫ్యాన్‌. ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ టైపులో తిక్కుంటుంది కానీ, నో లెక్క. అందువల్ల ప్రేమకథలో ప్రాబ్లమ్స్‌ మొదలవుతాయి. అప్పుడు ఏమైంది? భానుమతి తిక్కకు లెక్క ఎలా కుదిరింది? వరుణ్, భానుమతిలు ఎలా ఒక్కటయ్యారు? అనేది ఈ నెల 21న థియేటర్లలో చూడమంటున్నారు శేఖర్‌ కమ్ముల.


వరుణ్‌ తేజ్, సాయి పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన సినిమా ‘ఫిదా’.  ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఫిదా’. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే, సినిమా కూడా యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ‘యు’ సర్టిఫికెట్‌ తెచ్చుకున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ నెల 21న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ సి.కుమార్, సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement