షూటింగ్‌లో ఫిదా! | Varun Tej to romance Sai Pallavi in Shekhar Kammula movie Fida | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ఫిదా!

Published Sat, Mar 11 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

షూటింగ్‌ గ్యాప్‌లో శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి, వరుణ్‌తేజ్‌

షూటింగ్‌ గ్యాప్‌లో శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి, వరుణ్‌తేజ్‌

ఎన్నారైల కథలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ, అమెరికాలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శేఖర్‌ కమ్ముల మాత్రం తెలుగు తెరపై తెలుగు సంప్రదాయాలను ఆవిష్కరించడానికి విలువిచ్చారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ హీరోగా తీస్తున్న ‘ఫిదా’లోనూ ఆయన మార్క్‌ ప్రేమకథను చూపించబోతున్నారట! ‘ప్రేమ – ద్వేషం – ప్రేమకథ’ ఈ సిన్మాకు ఉపశీర్షిక. చిన్న ఛేంజ్‌ ఏంటంటే... కథకు ఎన్నారై టచ్‌ ఇచ్చారు. ‘ఫిదా’లో హీరో అమెరికన్‌ ఎన్నారై. తెలంగాణ అమ్మాయిను చూసి ఫిదా అవుతాడు. ప్రేమలో పడతాడు.

తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ప్రస్తుతం అయితే అమెరికాలో షూటింగ్‌ చేస్తున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్‌ సాయి పల్లవిల నవ్వులు చూస్తుంటే బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నారు. అప్పట్లో అమెరికాలో శేఖర్‌ కమ్ముల చేసిన చిలిపి పనులను వరుణ్‌తేజ్‌కి చెబుతున్నారో లేదా సినిమాలో ఆ సీన్లను రాశారో! ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement