మరో రికార్డ్‌ ‘ఫిదా’ | Fidaa Film Creates Another Record In Youtube | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 10:18 AM | Last Updated on Wed, Sep 19 2018 12:20 PM

Fidaa Film Creates Another Record In Youtube - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది.  చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ అయి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. సినిమాలోని ‘వచ్చిండే.. ’ పాట ఏకంగా 150 మిలియన్ల (పదిహేను కోట్ల) వ్యూస్‌ సాధించి సత్తా చాటింది. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీత సారధ్యంలో మధుప్రియ, రాంకీలు ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement