కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..! | Varuntej Fidaa Collections | Sakshi
Sakshi News home page

కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..!

Published Sun, Jul 23 2017 11:10 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..!

కలెక్షన్లు 'ఫిదా' చేస్తున్నాయ్..!

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఫిదా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్కు ఆడియన్స ఫిదా అవుతున్నారు. క్లాస్ సినిమా దర్శకుడిగా తనకున్న ఇమేజ్ను కొనసాగిస్తూ శేఖర్ కమ్ముల రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్కు ఆ కోరిక తీరిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. గురవారం రోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు 35000 డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో లాంగ్ రన్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిదా కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్టీపెక్ట్స్ ప్రేక్షకులను ఈ సినిమా గట్టిగానే ఫిదా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement