![Varun Tej, Sai Pallavi To Reunite For Venky Kudumulas Upcoming Film - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/17/sailpallavi_varun-tej.jpg.webp?itok=YPxxGMMQ)
వరుణ్‌తేజ్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘గని’ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ వరుణ్ నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి. అయితే ‘ఛలో, భీష్మ’ సినిమాలతో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ మూవీని వరుణ్‌తో చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం అంతా చకచకా జరిగిపోయినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరలవుతోంది. అదేంటంటే ఈ మూవీలో వరుణ్‌తేజ్ సరసన సాయి పల్లవి నటించనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరుణ్‌తేజ్, సాయి పల్లవి ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment