నేను పెళ్లే చేసుకోను! | Another actress has joined the list of not Marry | Sakshi
Sakshi News home page

నేను పెళ్లే చేసుకోను!

Published Thu, Nov 3 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

నేను పెళ్లే చేసుకోను!

నేను పెళ్లే చేసుకోను!

పెళ్లి చేసుకోను అనే తారల పట్టికలో మరో నటి చేరారు. ఒక పక్క పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి పెను సంచలనానికి కేంద్రబిందువు అయ్యారన్నది గమనార్హం. తాజాగా వర్ధమాన నటి సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కారు. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిశారన్నది గమనార్హం.
 
వైద్య విద్యనభ్యసించిన ఈ బ్యూటీలో మంచి డాన్సర్ ఉన్నారు. కొన్ని చానళ్లలో డాన్‌‌స పోటీల్లోనూ పాల్గొన్నారన్నది గమనార్హం. ప్రేమమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమంతటా ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఇంతకు ముందు కోలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అయితే త్వరలోనే కోలీవుడ్ ఆఫర్ ఆమె కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు.
 
ఈ మధ్య హీరోయిన్లు ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాల ద్వారా ఇంట్రాక్ట్ అవడం అన్న ఒరవడి కొనసాగుతోంది. సమీపకాలంలో నటి సాయిపల్లవి తన అభిమానులతో అలాంటి చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడు ఎలా బదులిచ్చారో చూద్దాం.
 
 ప్ర: తమిళంలో మీకు నచ్చిన చిత్రం?
 జ: సూర్య నటించిన కాక్క కాక్క

 ప్ర: నచ్చిన పాట?
 జ: రెమో నీ కాదలన్ పాట అంటే చాలా ఇష్టం

 ప్ర: మీకు చికెన్ బిరియానీ ఇష్టమా?మటన్ బిరియానీ ఇష్టమా?
 జ: నేను శాఖాహారిని.

 ప్ర: ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా?
 జ: నేను అసలు పెళ్లే చేసుకోను.

 ప్ర: కారణం?
 జ: జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement