లక్‌ అంటే సాయిపల్లవిదే! | Sai Pallavi premam and Fida's flick with the success of the lucky heroine | Sakshi
Sakshi News home page

లక్‌ అంటే సాయిపల్లవిదే!

Published Tue, Jul 25 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

లక్‌ అంటే సాయిపల్లవిదే!

లక్‌ అంటే సాయిపల్లవిదే!

తమిళసినిమా: నటి సాయిపల్లవి.. ఈ పేరు ఇటీవల టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. అంతకు ముందే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మారుమోగింది. 2015 తెరపైకి వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్‌ అనూహ్య విజయాన్ని సాధించింది.అందులో మలర్‌గా టీచర్‌ పాత్రలో సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.అంతే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నుంచి గౌతమ్‌మీనన్‌ వరకూ పలువురు తమ చిత్రాల్లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు.

అయితే అలాంటి పెద్దపెద్ద అవకాశాలను కూడా నిరాకరించిన ఈ కేరళకుట్టి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తూ చివరికి టాలీవుడ్‌ చిత్రం ఫిదాలో నటించడానికి  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో పలు అవకాశాలను వదులుకున్న సాయిపల్లవి విజయ్‌ దర్శకత్వంలో నటించడానికి సమ్మతించింది. ఆయన దర్శకత్వంలో నటిస్తున్న కరు అనే చిత్రం నిర్మాణంలో ఉంది. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతోనూ, తెలుగులో ఫిదా చిత్రంతోనూ విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో కరు చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తోంది.ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతల కన్ను సాయిపల్లవిపై పడిందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement