సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్‌ ఈ కారణంతో పోయింది: హరితేజ | Bigg Boss Fame Hari Teja Reveals Why She Refused The Role Of Sai Pallavi Elder Sister In Fidaa Movie - Sakshi
Sakshi News home page

Hariteja: సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్‌ ఈ కారణంతో పోయింది: హరితేజ

Published Tue, Oct 3 2023 8:03 AM | Last Updated on Tue, Oct 3 2023 9:18 AM

Bigg Boss Hariteja Interesting Comments On Fidaa Movie - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా హర్ష వర్దన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌సేన్‌, శ్రీవిష్ణు, అశోక్‌ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.

(ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్‌ మార్చేసిన మహేశ్‌ బాబు 'గుంటూరు కారం')

ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్‌కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను.

కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్‌. మరీ అంత ప్యూర్‌ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్‌ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్‌ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్‌ ఉమెన్‌ పాత్రలో కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement