Fida Telugu movie
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్‌కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారం
దుబాయ్: విజయా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారకార్థం ప్రతియేటా నిర్వహించే ‘నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం’ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. గత ఆరేళ్లుగా ఈ అవార్డును తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాకు అందజేస్తున్నారు. 2017 ఏడాదికిగాను ‘ఫిదా’ సినిమాని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియంలో భారతీయ దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫిదా సినిమా నిర్మాత దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారంతో పాటు 1.5 లక్షల రూపాయల నగదు అందజేశారు. విదేశీ గడ్డపై ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నామని ఇకపై ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని విజయా అధినేతలు వెల్లడించారు. కాగా, పురస్కార గ్రహీత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇటువంటి పురస్కారం అందుకోవడం నా అదృష్టం, ఇంత గొప్ప అవార్డును అందుకోవడానికి ఏ దేశానికైనా వెళతానన్నారు. నాగిరెడ్డి కుమారులు వెంకటరామి రెడ్డి, కోడలు భారతి రెడ్డి ( విజయా ఆస్పత్రుల అధినేత్రి) పర్యవేక్షణలో.. గీతా రమేశ్, రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుధా పల్లెం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగిరెడ్డి సినిమా పాటలు.. సంగీత దర్శకులు మాదవపెద్ది సురేశ్‌చంద్ర వాద్య, గాయక బృందం విజయా సినిమాల పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో అబుదాబికి చెందిన ఆదిభట్ల కామేశ్వర శర్మ, సునీతా లక్ష్మీ నారాయణ, ఉమా పద్మనాభం, స్వప్నికా శ్రీనివాస్, విశాలా మధు తదితరులు పాల్గొన్నారు. -
మలయాళంలోకి 'ఫిదా'
-
మలయాళంలోకి 'ఫిదా'
సాక్షి, హైదరాబాద్ : తెలుగులో సత్తా చాటిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి ఔరా అనిపించింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవి నటన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ నేపథ్యం, భాష, యాసలతో సాయిపల్లవి అలరించింది. దీంతో ఈచిత్రానికి భారీ వసూల్లు వచ్చాయి. తెలుగులో సత్తా చాటిన ఈచిత్రం దక్షిణాదిన మరో భాషలోకి అనువాదం అవుతోంది. మలయాళంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డబ్బింగ్ సైతం దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. ఇందులో భాగంగా మలయాళం ట్రైలర్‌ను చిత్ర హీరో వరుణ్ తేజ్ తన ఫేస్బుక్ వాల్‌పై పోస్టు చేశారు. తర్వాతి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వరుణ్ తెలిపాడు. సాయిపల్లవి ఇప్పటికే మలయాళం ప్రేక్షకులకు సుపరిచయం. ప్రేమమ్‌లో మలర్ పాత్ర ద్వారా మలయళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. -
తెలంగాణ సీఎం కేసీఆర్....‘ఫిదా’!
హైదరాబాద్: ‘ఫిదా’ సినిమాలో నటీనటులు చక్కగా నటించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) కితాబిచ్చారు. వీలు చూసుకుని తనను కలవాలని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత్ దిల్రాజును ఆయన ఆహ్వానించారు. ‘ఫిదా’ సినిమాను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సినిమాను అద్భుతంగా తీశారని చిత్రయూనిట్‌ను కేసీఆర్ మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ‘ఫిదా’ అవుతున్నారు. సున్నిత భావోద్వేగాలను తెరపై అందంగా చూపించడంలో చేయి తిరిగిన శేఖర్ కమ్ముల మరోసారి తన ప్రత్యేకత చాటుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.