తెలుగులో సత్తా చాటిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి ఔరా అనిపించింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవి నటన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ నేపథ్యం, భాష, యాసలతో సాయిపల్లవి అలరించింది. దీంతో ఈచిత్రానికి భారీ వసూల్లు వచ్చాయి.