Varun Teja
-
ఫస్ట్ పంచ్ విసిరిన ‘గని’.. ఆకట్టుకుంటున్న వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ హీరో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ మెగా హీరో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా ఆ సినిమా నుంచి గని ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ రక్తమోడుతూ పంచ్ విసిరాడు. బాక్సర్‌గా బాడీని పూర్తిగా ట్రాన్స్ఫామ్ చేసుకున్న ఈ కుర్ర హీరో లుక్ ఆకట్టుకునేలా ఉండి.. అంచనాలను ఇంకా పెంచింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ మూవీని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చదవండి: రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్.. మామూలుగా ఉండదుగా -
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్‌గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్‌గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
మా సైన్మాని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు
‘‘మా బాబాయ్‌కి (పవన్ కల్యాణ్) ‘గబ్బర్‌సింగ్’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన హరీష్ శంకర్‌గారు నా కోసం కథ తీసుకువస్తారనుకోలేదు. మా ఇద్దరికీ సినిమా తప్ప వేరే ఏదీ తెలీదు. హరీష్ ఏదైనా సినిమా కోసమే చేస్తారు. అందుకే నేను తనకు పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా ‘గద్దలకొండ గణేష్’ సైన్మాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా టైటిల్ మార్చాలన్నప్పుడు చరణ్ అన్న ఇంటికి వెళ్లాను. అక్కడ చరణ్ అన్న, తారక్ కలిసి కాఫీ తాగుతున్నారు. ఆ రోజు నా ఒత్తిడిని తగ్గించిన వారిద్దరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘రెండు రోజుల్లో 50 శాతం, మూడో రోజుకి 70–75శాతం వరకూ అమౌంట్ వెనక్కి వచ్చింది’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘బ్రహ్మానందంగారి సినిమాలు చూడడం మాకు వరం. ఆయన్ని డైరెక్ట్ చేయడం గర్వకారణం. ఈ సినిమా ‘వాల్మీకి’ అనే టైటిల్‌తో మొదలైంది. అందుకే ఈ చిత్రం ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు హరీష్ శంకర్. నటి పూజా హెగ్డే, మృణాళిని రవి, నటుడు బ్రహ్మానందం, నటి డింపుల్ హయాతి, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, పాటల రచయిత భాస్కరభట్ల, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు. -
ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను
‘‘ఉండ్రాజవరంలోని నా స్నేహితుని ఇంట్లో మడత మంచం మీద పడుకొని పాట ఎలా తీయాలి అని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. సెకనుకోసారి ఠంగ్, ఠంగ్ అని మోత వినిపించడంతో అతన్ని ‘ఏంటి’ అని అడిగాను. ఈ ఊళ్లో బిందెలు తయారు చేస్తారు అని చెప్పాడు. అంతే... పాట ఎలా తీయాలో ఐడియా తట్టింది’’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో గోపీ అచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన ‘దేవత’ చిత్రంలోని శోభన్‌బాబు, శ్రీదేవిల ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ‘దేవత’ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ పాటకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావటానికి కారణం అయిన ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ముఖ్యంగా చిత్రనిర్మాత డి. రామానాయుడు, స్వరకర్త చక్రవర్తి, పాట రాసిన వేటూరి గారు. ఇప్పుడు ఈ పాటను చూపించిన టీమ్ అందరూ నన్ను 37 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ‘మీరు చేసిన బిందెల మధ్యలో శోభన్‌బాబు, శ్రీదేవి ఉంటారు... చాలా బిందెలు అవసరం అవుతాయి. అవి వాడుకొని మళ్లీ ఇచ్చేస్తాం’ అని చెప్పాను. బిందెలు తయారు చేసే ఆయన 1000 బిందెలను చేసి ఇచ్చారు. మనం ఈ రోజుకీ ఈ పాటను చెప్పుకుంటున్నాం అంటే ఎందరో చేసిన కృషి ఫలితమే ఇది. నేను నిర్మాత బావుండాలని కోరుకునే దర్శకుడిని. ఇన్ని బిందెల్లో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందె నాకు ఇస్తే తీసుకెళ్తాను (నవ్వుతూ). నేను పూజను చూసిన మొదటిరోజే చెప్పాను. ఈ అమ్మాయి నంబర్‌వన్ హీరోయిన్ అవుతుందని. వరుణ్ గురించి చెప్పేదేముంది. ఆల్రెడీ పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను హీరోయిన్ పూజని ఏ పండుతో కొడతాను అంటే చెర్రీ పండుతో ఆమె నడుము మీద కొడతాను’’ అని చమత్కరించారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా ఏడెనిమిదేళ్ల కల ఇది. 2019లో బిందెలతో పాట చేస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాను. యానంలో ఈ పాట షూట్ స్టార్ట్ చెయ్యగానే నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. శ్రీదేవిగారు చేసిన ఈ పాటలో పూజాని తప్ప ఎవరినీ ఊహించలేను. వరుణ్ చాలా బాగా డాన్స్ చేశాడు. నేను నిర్మాతలను 500 బిందెలడిగితే వాళ్లు నాకు 1500 బిందెలను ఇచ్చారు. ఇది వేటూరిగారు రాసిన పాట. ఈ పాట తీయటం రాఘవేంద్ర రావు లాంటి గురువుగారికి శిష్యుడు ఇస్తున్న పువ్వు ఇది. వేటూరిగారి లిరిక్స్‌ని వాడుకున్నందుకు ఆయన కుమారుడు వేటూరి రవిగారికి రెమ్యునరేషన్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను స్వతహాగా పాటలు, డాన్సులకు అంత కంఫర్ట్ కాదు. కానీ ఈ చిత్రంలో రీమిక్స్ సాంగ్ అనగానే చిరంజీవి గారిదో, పవన్ గారి పాటో ఉంటుంది అనుకున్నాను. కానీ, శోభన్‌బాబు గారి పాట అనగానే చాలా ఎగై్జట్ అయ్యాను. ఇంత బాగా రీక్రియేట్ చేస్తారనుకోలేదు. నేను బాలుగారి పాటలకు వీరాభిమానిని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గోపి అచంట, రామ్ ఆచంట, పూజా హెగ్డే, మిక్కీ. జె. మేయర్, అవినాష్, శేఖర్ మాస్టర్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అసలు ఆట అప్పుడే!
మొన్నామధ్య వరుణ్ తేజ్ కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. విదేశీ మాజీ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్. మరి.. బాక్సింగ్ బరిలోకి వరుణ్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఆగస్టులో అట. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను చేయనున్న బాక్సర్ రోల్ కోసం వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభించి హైదారాబాద్, వైజాగ్, ఢిల్లీలో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఎఫ్ 2’ సక్సెస్ మీట్
-
గమ్యానికి చేరువలో...
అంతరిక్ష ప్రయాణంలో వరుణ్ తేజ్ గమ్యానికి చేరువవుతున్నారు. కన్ఫ్యూజ్ కావొద్దు. వరుణ్ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని చెబుతున్నాం. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 20న మొదలు కానున్న ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్లోనే ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారట టీమ్. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం సెకండాఫ్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
తొలిప్రేమ షాకింగ్ కలెక్షన్లు
సాక్షి, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ప్రేమకథా చిత్రం కావడంతో అన్నీ వర్గాల ప్రేక్షకుల మనసులను దోచింది. ముఖ్యంగా ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరికి యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మంచారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. -
రొమాంటిక్ లవ్ స్టోరీ ‘తొలిప్రేమ’
చేబ్రోలు/పాత గుంటూరు : నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘తొలి ప్రేమ’ చిత్రమని ఫిదా ఫేమ్ హీరో వరుణ్‌తేజ్ అన్నారు. శుక్రవారం విజ్ఞాన్ యూనివర్సిటీలో తొలి ప్రేమ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో హీరో వరణ్‌తేజ్, హీరోయిన్ రాశిఖన్నా, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిప్రేమ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం గుంటూరు బృందావన్ గార్డెన్స్ విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావురత్తయ్య నివాసంలో లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి హీరో, హీరోయిన్ వరుణ్‌తేజ్, రాశిఖన్నా విలేకరులతో మాట్లాడారు. తొలిప్రేమ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్నారు. చిత్ర కథాంశం పూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ తొలిప్రేమ చిత్రాన్ని విజయవంతం చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రెండో ఈవెంట్ భీమవరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తొలి ప్రేమ చిత్రం ప్రమోషన్‌కు హీరో హీరోయిన్ వరుణ్‌తేజ్, రాశిఖన్నా రావడంతో అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
వరుణ్ సంకల్పం
ఘాజీతో తొలిసారి ‘వార్ ఎట్ సీ ఫిలిం’ అంటూ తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ రెడ్డి మరోసారి ఆడియన్స్‌ను అబ్బురపరచటానికి సిద్ధమయ్యారు. సంకల్ప్ తదుపరి చిత్రం వరుణ్ తేజ్‌తో అని తెలిసిన విషయమే. ఈ విషయమై సంకల్ప్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘ఇది సైన్స్ ఫిక్షన్‌కు సంబంధించిన కథాంశం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘ఘాజీ ’లాగే ఈ సినిమాలో కూడా ఎక్కువ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ ఉంటుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న ‘తొలి ప్రేమ’ రిలీజ్ తర్వాత మార్చ్ లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం’’ అని కొన్ని వివరాలు చెప్పారు. ‘ఘాజీ’తో నీళ్ళ లోపలికి తీసుకువెళ్లిన సంకల్ప్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకాశ వీధుల్లో విహారానికి తీసుకెళ్తారనమాట. ‘ఘాజీ’ని నిర్మించిన పీవీపీ బ్యానర్ ఈ సినిమాను నిర్మించొచ్చట. ఇందులో వరుణ్ వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా కనిపిస్తారట. అవునా.. అంటే ‘అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్’ అన్నారు సంకల్ప్ రెడ్డి. -
మలయాళంలోకి 'ఫిదా'
-
మలయాళంలోకి 'ఫిదా'
సాక్షి, హైదరాబాద్ : తెలుగులో సత్తా చాటిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి ఔరా అనిపించింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవి నటన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ నేపథ్యం, భాష, యాసలతో సాయిపల్లవి అలరించింది. దీంతో ఈచిత్రానికి భారీ వసూల్లు వచ్చాయి. తెలుగులో సత్తా చాటిన ఈచిత్రం దక్షిణాదిన మరో భాషలోకి అనువాదం అవుతోంది. మలయాళంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డబ్బింగ్ సైతం దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. ఇందులో భాగంగా మలయాళం ట్రైలర్‌ను చిత్ర హీరో వరుణ్ తేజ్ తన ఫేస్బుక్ వాల్‌పై పోస్టు చేశారు. తర్వాతి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వరుణ్ తెలిపాడు. సాయిపల్లవి ఇప్పటికే మలయాళం ప్రేక్షకులకు సుపరిచయం. ప్రేమమ్‌లో మలర్ పాత్ర ద్వారా మలయళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. -
చిరంజీవి ఉన్నారు కాబట్టే అంతమంది హీరోలు..
– ‘ఫిదా’ ఆడియో ఫంక్షన్లో ‘దిల్’ రాజు ‘‘నేను ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ‘స్టేట్ రౌడీ’ షూటింగ్లో ఫస్ట్ టైమ్ చిరంజీవిగారిని చూశా. ‘అల్లుడా మజాకా’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన చేతుల మీదగా షీల్డ్ తీసుకున్నా. ఆయనతో ఎన్నో మూమెంట్స్ నాకు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఫిదా’. శక్తికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే... తర్వాత పవన్ కల్యాణ్‌గారు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. చిరంజీవిగారిని తల్చుకోకుండా వరుణ్ ఫంక్షన్‌గానీ, ఏ ఫంక్షన్‌గానీ జరగదు. ఎందుకంటే ‘హీ ఈజ్ మెగాస్టార్’. ‘ఖైదీ నంబర్ 150’, ‘డీజే’కి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో కొంతమంది వాంటెడ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. చిరంజీవిగారి రేంజ్ ఎప్పుడూ తగ్గదు. ‘ఖైదీ’కి, ‘డీజే’కి పోలికే లేదు. ‘ఆనంద్’ మంచి కాఫీ లాంటి సినిమా అయితే ‘ఫిదా’ ‘ఖుషి’ లాంటి సినిమా. ‘ఆనంద్, హ్యాపీడేస్’ తర్వాత ‘ఫిదా’ అలా ఉండబోతోంది. ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఈ ఆరు నెలల్లో మా బ్యానర్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాం. ‘ఫిదా’ కూడా సూపర్‌హిట్ కాబోతోంది’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘వరుణ్, సాయిపల్లవి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. వారిని చూస్తే ‘ఖుషి, తొలిప్రేమ’ సినిమాలు గుర్తుకొస్తాయి. వరుణ్ నటనలో చిరంజీవి, పవన్, నాగబాబు షేడ్స్ కనిపిస్తుంటాయి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్యం థియేటర్లో ‘ఆనంద్, హ్యాపీడేస్’ సినిమాలు చూశా. ‘దిల్’ రాజుగారితో పనిచేయడం హ్యాపీ. అలాంటి.. ఇలాంటి సినిమాలు చేయండి అని పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంటుంది. నేను అదే ధోరణిలో ట్రై చేస్తుంటాను. రెండు మూడు చోట్ల తప్పటడుగులు వేశా. ఐ ప్రామిస్.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా. నాకు ఇటువంటి అభిమానులను ఇచ్చిన పెదనాన్న, బాబాయ్‌కి థ్యాంక్స్. ఈ నెల 21న విడుదలవుతోన్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు. కాగా ఇదే వేదికపై ‘శతమానం భవతి, నేను లోకల్’ వంద రోజుల షీల్డ్‌లను చిత్రబృందానికి అందించారు. సాయిపల్లవి, సంగీత దర్శకుడు శక్తికాంత్, నటుడు సాయిచంద్, హీరోలు నాని, నవీన్ చంద్ర, దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, సతీశ్ వేగేశ్న, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, పాటల రచయితలు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, వనమాలి తదితరులు పాల్గొన్నారు. -
అరెరే... చంద్రకళా...జారెనా కిందకిలా...
చిరంజీవి ‘మెగా’ కుటుంబం నుంచి మరో వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి రంగం సిద్ధమైంది. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆఖరు ఘట్టంగా ఒక ముఖ్యమైన పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. మిక్కీ జె. మేయర్ స్వరాలకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం కూర్చిన ‘అరెరే... చంద్రకళా... జారెనా కిందకిలా...’ అనే పాటను శనివారం నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. నెమళ్ళతో కూడిన అందమైన సెట్లో రాజు సుందరం ఈ పాటకు నృత్యం సమకూరుస్తున్నారు. ‘‘సోమవారం వరకు ఈ పాట చిత్రీకరణ సాగుతుంది. దాంతో, సినిమా మొత్తం పూర్తయిపోయినట్లే. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తోందనీ, చాలా రోజుల తరువాత సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఈ పాటలు ఉన్నాయంటూ శ్రోతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు పేర్కొన్నారు. ఈ చిత్రంపై దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ‘‘ఇటు పూర్తిగా నగరం కానీ, అటు పూర్తిగా పల్లెటూరు కానీ కాకుండా మధ్యస్థంగా ఉండే పట్నాల్లోని యువతీ యువకుల భావోద్వేగాలు, ఆ వాతావరణం ప్రతిబింబించే కథ ఇది. ఇప్పటి దాకా ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫీల్‌గుడ్ సినిమాలే రూపొందించా. అందుకు భిన్నంగా ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తీశా’’ అని శ్రీకాంత్ వివరించారు. ఆ విశేషాలన్నీ తెరపై చూడడానికి మరొక్క పది రోజులు ఓపిక పట్టాల్సిందే. -
ముకుంద మూవీ స్టిల్స్
-
వరుణ్ తేజ చిత్ర ప్రారంభోత్సవంలో పవన్ & చిరు
-
వరుణ్ తేజ ఫస్ట్ లుక్ టీజర్
-
నాగబాబు తనయుడు 'మెగా' సక్సెస్ సాధిస్తాడా?
-
నాగబాబు తనయుడు 'మెగా' సక్సెస్ సాధిస్తాడా?
కొణిదెల వంశం నుంచి మరో హీరో వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరంగేట్రం ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దాదాపు నాలుగేళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్లో చాలా కాలంగా వరుణ్‌తేజ్ సినీరంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ - అల్లు వారి కుటుంబాల నుంచి ఇప్పటికే నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్‌చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ చిత్ర రంగంలో ఉన్నారు. చిరంజీవి మేనల్లుడు ధర్మతేజ కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వెలుగు వెలుతున్నారు. అత్తారింటికి దారేది? చిత్రం ద్వారా కలెక్షన్ల రికార్డు బద్దలు కొట్టారు. వాస్తవానికి ఈ ఏడాదే వరుణ్ తేజ హీరోగా సినీరంగ ప్రవేశం చేయవలసి ఉంది. వరుణ్ తేజ ఎత్తుకు ఎత్తు - రూపానికి రూపం - అందానికి అందం అన్నీ ఉన్నాయి. హీరోకు కావలసిన లక్షణాలు మెండుగా ఉన్నాయి. వీటికి తోడు నటన - భాష - ఉచ్ఛారణలో శిక్షణ పొందాడు. ఈ నాడు అగ్రతారలుగా వెలుగొందుతున్న సినీప్రముఖులు ఎందరికో నటన నేర్పిన దిట్ట సత్యానంద్. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్... వంటి వారు ఆయన వద్దే నటన, భాష నేర్చుకున్నారు. విశాఖలో ఆయన వద్దే వరుణ్ కూడా శిక్షణ పొందాడు. అయితే వివిధ కారణాల వల్ల తేజ వెండితెర పరిచయం వాయిదాపడుతూ వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. వరుణ్ పరిచయం చేసే దర్శకులలో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, శ్రీకాంత్ అడ్డాల ... పేర్లు వినిపించాయి. విజయవంతమైన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల తేజను పరిచయం చేయడానికి ఓ మంచి కథ రూపొందించారు. ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాక్షి తెలిపింది. ఏడాదికిపైగా ఆయనతో కథా చర్చలు జరుగుతున్నాయి. చివరకు వరుణ్ తేజ్‌ని తెరకు పరిచయం చేసే బాధ్యతను శ్రీకాంతే స్వీకరించారు. ఇక నిర్మాత విషయంలో కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. తొలుత నాగబాబు తమ సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్పైనే తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారు. అయితే ఆరంజ్ చిత్రం తరువాత ఆ ప్రొడక్షన్‌పై చిత్రం నిర్మించడానికి ఆయన అంతగా ఆసక్తి చూపించడంలేదు. ప్రస్తుతానికి చిత్రాలు నిర్మించే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ వైజయంతీ మూవీస్‌పై నిర్మిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణే కొత్తగా 'పవన్ క్రియేటివ్ వర్క్స్' బేనర్ ఏర్పాటు చేసి, తేజని హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందని కూడా భావించారు. ఇవన్నీ కాకుండా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్పైనే తేజని పరిచయం చేసే అవకాశం ఉందని అనుకున్నారు. చివరకు తేజని పరిచయం చేసే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలుగా ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ స్వరాలందిస్తారు. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మొదట్లో కాజల్ పేరు వినపడింది. హీరోయిన్ను ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మహానటుడు కమల్‌హాసన్ రెండవ కూమార్తె అక్షర, ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ పేర్లు వినవస్తున్నాయి. తేజ మెగా కుటుంబానికి చెందిన వాడైనందున వారు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నూతన సంవత్సరం ప్రారంభం రోజునే మొదలవుతుంది. ఇక వరుణ్ మెగాస్టార్ వారసుల విజయపరంపరను అందుకుంటాడా లేదా అనేది శ్రీకాంత్ అడ్డాల చేతిలోనే ఉంది. శ్రీకాంత్‌కు ఇది ఓ ఛాలెంజ్! s.nagarjuna@sakshi.com