గమ్యానికి  చేరువలో...  | Varun Tej Antariksham is Tollywood first space movie | Sakshi
Sakshi News home page

గమ్యానికి  చేరువలో... 

Published Wed, Sep 5 2018 12:16 AM | Last Updated on Wed, Sep 5 2018 12:16 AM

 Varun Tej Antariksham is Tollywood first space movie - Sakshi

అంతరిక్ష ప్రయాణంలో వరుణ్‌ తేజ్‌ గమ్యానికి చేరువవుతున్నారు. కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. వరుణ్‌ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుందని చెబుతున్నాం. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  లావణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తవడానికి కేవలం ఒక్క షెడ్యూల్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది.

ఈ నెల 20న మొదలు కానున్న ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్‌లోనే ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారట టీమ్‌. ఆల్రెడీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ మొదలయ్యాయి. ఈ చిత్రం సెకండాఫ్‌ ఎడిటింగ్‌ కూడా కంప్లీట్‌ అయ్యిందని యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారం. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement