Space Movie
-
ప్రయాణం ముగిసింది
అంతరిక్షానికి ప్రయాణం చేసిన వరుణ్ తేజ్ ఆ జర్నీని ముగించేశారు. ఆ జర్నీని ప్రేక్షకులకు చూపించడమే ఆలస్యం అంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. తొలి స్పేస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో పూర్తయింది. ‘‘అంతరిక్షం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశాం. ఈ సినిమా షూటింగ్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి. -
గమ్యానికి చేరువలో...
అంతరిక్ష ప్రయాణంలో వరుణ్ తేజ్ గమ్యానికి చేరువవుతున్నారు. కన్ఫ్యూజ్ కావొద్దు. వరుణ్ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని చెబుతున్నాం. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 20న మొదలు కానున్న ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్లోనే ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరిస్తారట టీమ్. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం సెకండాఫ్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘అంతరిక్ష ప్రయాణంలో తొలి ఘట్టం’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు 15న ఓ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వనున్నారు. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోనూ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Get Ready for AN ENTHRALLING SPACE ADVENTURE 🚀👨🚀🌌 🛰 Unveiling 'Title' & 'Release Date' On August 15th 🇮🇳 at 9:30 AM.@IAmVarunTej @aditiraohydari @Itslavanya @gnanashekarvs @FirstFrame_Ent #SankalpReddy @YRajeevReddy1 @DirKrish @prashanthvihari pic.twitter.com/EZp215JIei — First Frame Entertainments (@FirstFrame_Ent) 12 August 2018 -
అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసి తనకు అప్పగించిన మిషన్ రిజల్ట్ తెలుసుకునే రోజును ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 21న వరుణ్, సంకల్ప్ రెడ్డి తమ స్పేస్ జర్నీలోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ స్పేస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘తొలి తెలుగు స్పేస్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశాం. ఈ రెండు షెడ్యూల్స్‌లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో డూప్ లేకుండా వరుణ్ తేజ్ కొన్ని ఫైట్స్ చేశారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, డిసెంబర్ 21న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
రంగస్థలం టూ అంతరిక్షం
ఒక చిత్రంలో అన్ని అంశాలు సమపాలల్లో ఉండి ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలూ దాని ఫలితం బ్లాక్ బస్టరే. రంగస్థలం చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. సుకుమార్ టేకింగ్.. చెర్రీ అండ్ మిగతా తారాగణం నటన.. టెక్నీషియన్ల సమిష్టి కృషి.. వెరసి రంగస్థలాన్ని వంద కోట్ల క్లబ్‌లోకి చేర్చేసింది. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. రామకృష్ణ-మౌనిక.. రంగస్థలం కోసం పని చేసిన ఆర్ట్ డైరెక్టర్లు. ముఖ్యంగా వీళ్లు రూపొందించిన విలేజ్ సెటప్‌కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో వీళ్ల టాలెంట్‌కు మరో అవకాశం దక్కింది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే స్పేస్ థ్రిల్లర్ చిత్రానికి రామకృష్ణ-మౌనికలను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఇప్పుడు శాటిలైట్లు.. అంతరిక్షం సెట్ల డిజైన్ల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అంతేకాదు త్వరలో నాసాను సందర్శించి. అక్కడి విషయాలను కూడా వీళ్లు పరిశీలిస్తారంట. తెలుగులో ఫస్ట్ టైమ్ స్పేస్ జోనర్లో వస్తున్న చిత్రం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 1981లో ఇదే పేరుతో కమలహాసన్ నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. గతంలో జయం రవి హీరోగా సౌందర్‌రాజన్ మిరుదన్ చిత్రాన్ని తెరకెక్కించారు. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి భారతీయ చిత్రంగా నమోదు కానుంది.