రంగస్థలం టూ అంతరిక్షం | Rangasthalam Art Directors for Varun Tej Space Thriller | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 13 2018 8:43 PM | Last Updated on Fri, Apr 13 2018 8:43 PM

Rangasthalam Art Directors for Varun Tej Space Thriller - Sakshi

రంగస్థలం ఆర్ట్‌ డైరెక్టర్లు రామకృష్ణ-మౌనిక

ఒక చిత్రంలో అన్ని అంశాలు సమపాలల్లో ఉండి ప్రేక్షకులు కనెక్ట్‌ అయితే చాలూ దాని ఫలితం బ్లాక్‌ బస్టరే. రంగస్థలం చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. సుకుమార్‌ టేకింగ్‌.. చెర్రీ అండ్‌ మిగతా తారాగణం నటన.. టెక్నీషియన్ల సమిష్టి కృషి.. వెరసి రంగస్థలాన్ని వంద కోట్ల క్లబ్‌లోకి చేర్చేసింది. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. 

రామకృష్ణ-మౌనిక.. రంగస్థలం కోసం పని చేసిన ఆర్ట్‌ డైరెక్టర్లు. ముఖ్యంగా వీళ్లు రూపొందించిన విలేజ్‌ సెటప్‌కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో వీళ్ల టాలెంట్‌కు మరో అవకాశం దక్కింది. ఘాజీ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించబోయే స్పేస్‌ థ్రిల్లర్‌ చిత్రానికి రామకృష్ణ-మౌనికలను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఇప్పుడు శాటిలైట్లు.. అంతరిక్షం సెట్ల డిజైన్ల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అంతేకాదు త్వరలో నాసాను సందర్శించి. అక్కడి విషయాలను కూడా వీళ్లు పరిశీలిస్తారంట. తెలుగులో ఫస్ట్‌ టైమ్‌ స్పేస్‌ జోనర్‌లో వస్తున్న చిత్రం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement