మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు | Varun tej Spech in Gaddelakonda Ganesh movie Success Meet | Sakshi
Sakshi News home page

మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు

Sep 25 2019 1:57 AM | Updated on Sep 25 2019 5:20 AM

Varun tej Spech in Gaddelakonda Ganesh movie Success Meet - Sakshi

‘‘మా బాబాయ్‌కి (పవన్‌ కల్యాణ్‌) ‘గబ్బర్‌సింగ్‌’ వంటి పెద్ద హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌గారు నా కోసం కథ తీసుకువస్తారనుకోలేదు. మా ఇద్దరికీ సినిమా తప్ప వేరే ఏదీ తెలీదు. హరీష్‌ ఏదైనా సినిమా కోసమే చేస్తారు. అందుకే నేను తనకు పర్సనల్‌గా కనెక్ట్‌ అయ్యాను’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘మా ‘గద్దలకొండ గణేష్‌’ సైన్మాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఈ సినిమా టైటిల్‌ మార్చాలన్నప్పుడు చరణ్‌ అన్న ఇంటికి వెళ్లాను.

అక్కడ చరణ్‌ అన్న, తారక్‌ కలిసి కాఫీ తాగుతున్నారు. ఆ రోజు నా ఒత్తిడిని తగ్గించిన వారిద్దరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘రెండు రోజుల్లో 50 శాతం, మూడో రోజుకి 70–75శాతం వరకూ అమౌంట్‌ వెనక్కి వచ్చింది’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘బ్రహ్మానందంగారి సినిమాలు చూడడం మాకు వరం. ఆయన్ని డైరెక్ట్‌ చేయడం గర్వకారణం. ఈ సినిమా ‘వాల్మీకి’ అనే టైటిల్‌తో మొదలైంది. అందుకే ఈ చిత్రం ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు హరీష్‌ శంకర్‌. నటి పూజా హెగ్డే, మృణాళిని రవి, నటుడు బ్రహ్మానందం, నటి డింపుల్‌ హయాతి, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, పాటల రచయిత భాస్కరభట్ల, లైన్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ కట్టా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement