పవన్ కళ్యాణ్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన పూజ హెగ్డే | Pooja Hegde To Work With Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన పూజ హెగ్డే

Aug 27 2021 12:42 AM | Updated on Aug 27 2021 6:37 PM

Pooja Hegde To Work With Pawan Kalyan - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే దిల్ రాజు నిర్మాతగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో తన అభిమానులను పలకరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మలయాళంలో సూపర్‌ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా అధికారికంగా ప్రకటించారు.

డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్‌.. పవన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే చేస్తోన్న మొట్టమొదటి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. ఇక తాజా వార్త ఏంటంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుంది. ప్రియమణి మరో కథానాయికగా నటించనుందని సమాచారం. 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’తో పాటు ‘సంచారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్‌పై అధికారిక ప్రకటన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వెలుబడే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement