టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ ఇటీవలి కాలంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజాను కాస్త దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజా హెగ్డే అవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలో లాంచింగ్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం.
పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే ప్రచారమా? లేదంటే డేట్స్ సర్దుబాటు కాలేదా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా బయటకు వచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment