Ustad Bhagat Singh Movie
-
దురంధర్-2 రిలీజ్.. టాక్సిక్ సేఫ్.. మరి ఉస్తాద్ సంగతేంటి?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సీక్వెల్‌గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. టాక్సిక్ టీమ్ సేఫ్.. మరీ ఉస్తాద్ సంగతేంటి?యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్ దెబ్బకుఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయిందా? అని కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్-2 మూవీకి టికెట్స్ కూడా దొరకడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఇంత భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. -
ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. గబ్బర్ సింగ్ మాదిరి పవన్ కెరీర్లోనే గుర్తుండిపోయేలా మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తే.. వారి లెక్కలు తారుమారు అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద రెండురోజుల కలెక్షన్స్ చూస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది. తొలిరోజు కాస్త పర్వాలేదనిపించిన కలెక్షన్స్ రెండోరోజు 80శాతం పడిపోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇప్పటికీ అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది.ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ 34.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. అయితే, రెండోరోజు కేవలం రూ. 9.25 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో రెండురోజుల్లో మొత్తంగా రూ. 44 కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజుతో పోల్చి చూస్తే.. దాదాపు 80 శాతం వసూళ్లు మరుసటి రోజుకు పడిపోయాయి. ఉగాది, రంజాన్ పండుగలతో లాంగ్ వీకెండ్లోనే ఇలా ఉంటే.. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఆపై నేడు (మార్చి 21) ధురంధర్-2 తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆదివారం వరకు బుకింగ్స్ 95శాతం పైగానే పూర్తి అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఉస్తాద్ భగత్‌సింగ్‌ను తొలగించి ధురంధర్-2 చిత్రాన్ని వేయనున్నారు. ఉదయం ఆటలతో పాటు ఏపీలో టికెట్ రేట్ల పెంచి భారీ సంఖ్యలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ .. కలెక్షన్స్ పరంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నడంతో ట్రేడ్ వర్గాలను కూడా కలవరపెడుతుంది. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులునిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిరచన, దర్శకత్వం: హరీష్ శంకర్స్క్రీన్ప్లే: కె. దశరథ్, రమేష్ రెడ్డిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్నేపథ్య సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్ఎడిటర్: కార్తిక శ్రీనివాస్విడుదల తేది: మార్చి 19, 2026‘గబ్బర్ సింగ్’తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చన రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వాస్తవానికి 2020లోనే హరీష్-పవన్ సినిమా ఫిక్స్ అయింది. మైత్రీ మూవీస్ సంస్థలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పవన్ రాజకీయాలలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఉగాది పండగ సందర్భంగా నేడు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణాలొని లింగయ్య గూడెం గ్రామానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(కేఎస్ రవికుమార్).. చిన్నయ్య అనే కుర్రాడినికి చేరదీసి పెద్ద చదువులు చదివిస్తాడు. చిన్నయ్య ప్రవర్తన, లక్షణాలను చూసి చిన్నప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మాస్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. భగత్ సింగ్ ఐపీఎస్ అధికారి అవుతాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సీఎంపై దాడి జరుగుతుంది. ఆ దాడి వెనుక మంత్రి నాగప్ప (పార్తిపన్) ఉన్నట్లు తెలుస్తుంది. తన గురువుని కాపాడుకునేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ ఏం చేశాడు? నాగప్పతో ఉస్తాద్‌కు ఉన్న వైర్యం ఏంటి? ఆర్జే లీలా(శ్రీలీల) తో ఉస్తాద్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎస్‌గా విధులు నిర్వహించాల్సిన ఉస్తాద్.. సీఎంపై దాడి తర్వాత అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? భగత్ సింగ్ గతమేంటి? శ్లోక(రాశీ ఖన్నా) ఎవరు? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఈ రోజుల్లో బలమైన కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే.. కథలో కొత్తదనం లేకుంటే ఆ సినిమాను ఆదరించడం లేదు. ఇలాంటి రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ రొటీన్ కథతో ‘ఉస్తాద్ భగన్ సింగ్’ తెరకెక్కించాడు. కథ, కథనం ఏమాత్రం కొత్తగా అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాల సన్నివేశాలన్నీ కళ్లముందు కదులుతాయి. స్క్రీన్‌ప్లే అయితే మరీ దారుణంగా ఉంది. ఒక్కచోట కూడా ఆసక్తికరంగా కథనం సాగదు. పైగా పవన్‌తో చేయించిన కామెడీ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నార్మల్ ఆడియన్స్‌ని పక్కన పెట్టు..కనీసం అభిమానులు ఆశించిన అంశాలు కూడా ఇందులో ఉండకపోవడం గమనార్హం. ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా పవన్‌లో స్టెప్పులు వేయించారు. కానీ కథలో అది ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. డ్యాన్స్..డ్యాన్స్ అంటూ హీరోకి హైప్ ఇచ్చి.. ఆ సందర్భంలో పెట్టిన పాటకు సరైన స్టెప్పులే వేయించలేదు. అలాంటి అప్పుడు అంత హైప్ ఇవ్వడం ఎందుకో? మరోవైపు ‘ధేఖ్ లేంగే సాలా’సాంగ్ మిస్‌ప్లేస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ కథకి టెర్రరిజం, సనాతన ధర్మం అంశాలను యాడ్ చేయడం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. హీరోని దృష్టిలో ఉంచుకోనే ఆయా సన్నివేశాలను యాడ్ చేశారనిపిస్తుంది. ఎలివేషన్ ఇస్తూ..ఏదో చెప్పేస్తే చాలు ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారని భావించారేమో. అప్పుడే హీరో కామెడీ చేస్తాడు.. కాసేపటికే సీరియస్ అవుతాడు. ఆ లోపే మరో కొత్త పాయింట్ తెరపై వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునేలా ఉండడకపోవడమే మైనస్. ఇక ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా ఈ కథ ‘తెరి’ సినిమాకు పూర్తిగా రీమేక్ కాకపోయినా.. హీరో పాత్రతీరుతో పాటు ఒకటి రెండు సీన్లు ఆ సినిమాను గుర్తు చేస్తాయి. సీఎంపై దాడి చేసే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. హీరో బాల్యం చూపిస్తే.. సీఎంతో అతనికి ఉన్న అనుబందాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్లోకగా రాశీ ఖన్నా ఎంట్రీ అయినప్పటి నుంచి కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. శ్రీలీల-పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొలి ప్రేమలో సినిమాలోని ‘ఈ మనసే..’ పాట రీమేక్ ఫ్యాన్స్‌కి అలరిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. మొత్తంగా మాత్రం ఉస్తాద్ .. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కొత్తదనం ఆశించి వెళితే..అభిమానులకు సైతం నిరాశ తప్పదు. ఎవరెలా చేశారంటే.. నటనపరంగా మెప్పించేందుకు ఇందులో పవన్ కొత్తగా చేసిందేమి లేదు. ఈ తరహా పోలీసు పాత్రను ఆయన ఆల్రేడీ చేసేశాడు. ఓ పాటకు స్టెప్పులు వేయడం ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. శ్రీలీల పాత్ర ఎంట్రీ సెకండాఫ్‌లో ఉంటుంది. అయినప్పటికే తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్రకు నిడివి తక్కువే. అంతగా ప్రాధాన్యత కూడా లేదు. పార్తీబన్ విలనిజం జస్ట్ ఓకే. కేఎస్ రవికుమార్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాగంటితో పాటు మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే . తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలతో సంబంధం లేకుండా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది
‘‘తెలుగు నూతన సంవత్సరాది కానుకగా మా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నేడు విడుదలవుతుండటం మాకు చాలా ప్రత్యేకం. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఒక మంచి తెలుగు సినిమా అయిన మా మూవీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని శ్రీలీల తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్ అవుతోంది. బుధవారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, ప్రేమ, హాస్యం, విలన్‌తో పవర్ఫుల్ సీన్స్... ఇలా అన్ని అంశాలు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్లు మరిన్ని సినిమాలు తీస్తూ పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని చె΄్పారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘వినోదం, భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు నిండి... ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు రాశీ ఖన్నా. -
ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా
‘‘చిత్ర పరిశ్రమలో నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా చెప్పా రు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడ్రన్ అమ్మాయి. మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో నాకు ఒక మాస్ సాంగ్ ఉంది.నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ పాట చిత్రీకరణని చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువారి పండగైన ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి థియేటర్లో చూడొచ్చు. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌గారితో ఒక సినిమా, అలాగే ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్లో ‘రౌడీ అండ్ కో’ మూవీలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పా రు. -
వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్, హీరో, హీరోయిన్ల కాంబినేషన్ విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి ఎవరినైనా గెస్ట్‌గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్ సెంటిమెంట్. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ పవన్ కల్యాణ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. అదేంటో చదివేయండి..రెండోసారి ఫ్లాప్పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక డైరెక్టర్‌తో రెండో సినిమా తీస్తే ప్లాప్ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహా..ఆయన కెరీర్ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్ కల్యాణ్‌కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్ అందించిన దర్శకుడు కరుణాకరన్. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.పవన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ డిజాస్టర్ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా కూడా ప్లాప్ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్‌తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్ అయింది.ఉస్తాద్ రిలీజ్..టెన్షన్లో ఫ్యాన్స్ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ చూసే పవన్ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్ శంకర్- పవన్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’బ్లాక్ బస్టర్ అయింది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్ 2’ బుకింగ్స్ విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి సెంటిమెంట్ ప్రకారం సినిమా ప్లాప్ అవుతుందా లేదా సెంటిమెంట్‌ని బద్దలు కొట్టి హిట్ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. -
‘ఉస్తాద్.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ధమాకా చిత్రంతో భారీ హిట్‌ని ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రం రిలీజ్ తర్వాత శ్రీలీలకు వరస అవకాశాలు వచ్చాయి. రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లోనూ నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కి బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్‌ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh)మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు రాఖీ ఖన్నా కూడా మరో హీరోయిన్గా నటించింది. కెరీర్‌తో తొలిసారి పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తుంది ఈ భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పోలిస్తే..ఇది తక్కువే అని చెబుతున్నారు. ఆమె నటించిన ‘జూనియర్’ చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుందంట. ఇక ధమాకా తర్వాత రవితేజతో కలిసి నటించిన మరో చిత్రం ‘మాస్ జాతర’కు రూ. 3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మహేష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్
-
పవన్ కల్యాణ్ డూప్‌గా హరీశ్.. దర్శకుడు ఏమన్నాడంటే..
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్ శంకర్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్‌పై స్పందించారు.పవన్ కాదు.. డూప్గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్ పోస్టర్ని వదిలారు. అందులో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్‌లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదంటూ రూమర్స్ వచ్చాయి. హరీశ్ శంకరే పవన్‌కు డూప్‌గా నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్‌గా నటించారని అన్నారు.బాధ కాదు.. హ్యాపీగా ఫీలయ్యా.. ఈ రూమర్స్‌పై తాజాగా హరీశ్ శంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్‌కు డూప్‌గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్ రిలీజ్ సమయంలో వచ్చిన రూమర్స్ చూసి బాధ పడలేదని, పవన్‌తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్‌ని వాడతారని చెప్పారు. ఉస్తాద్ విషయానికొస్తే..హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. -
రీమేక్‌ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్‌ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్‌లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్‌ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
'ఉస్తాద్ భగత్‌సింగ్' ఫ్యాన్స్‌కు షాకిస్తున్న బుక్‌మైషో
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బుక్‌మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్‌ను చేర్చి పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చింది.మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్‌తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.బుక్‌మైషో టికెటింగ్ ప్లాట్ఫామ్లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్‌ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
దేవిశ్రీ ప్రసాద్‌కి అవమానం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్ లవర్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్ సాంగ్ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్శంకర్పై డీఎస్పీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.డీఎస్పీ అవుట్..తమన్ ఇన్పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥This will be a grand celebration and a lifetime memory for fans ❤️POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026రెండోసారి..మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గ్యాప్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్‌కి 20 రోజుల ముందు బీజీఎం తమన్ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చారు. Request💔:#DeviSriPrasad #DSP @ThisIsDSP Garu #UstaadBhagatSingh & Future Films,Any Projects solo Gane Cheyandi Songs & BGMs. Duo & Collaboration Chesedhi Talent Vallu. Miku Avasaramledhu. Dayachesi Encourage Kuda Cheyodhu 🙏.Also Any Productions@MythriOfficial,@UBSTheFilm pic.twitter.com/fRwbgMZUGj— DSP & Harris jayaraj🎶 (@entertynmentfan) March 4, 2026వర్క్ నచ్చలేదా?ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని డీఎస్పీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వర్క్ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. Why so much negitivity on #Devisriprasad, todays generation kids dont know the value of him. Anyhow people more interested on copycat only not with the original composers..#DSP— Tanneru Ravi Teja (@rav4467) March 5, 2026 -
ఆరా ఆఫ్ ఉస్తాద్
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’పాట లిరికల్ వీడియో లాంచ్ ఈవెంట్‌ను యూనిట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌గారి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయైతే..’పాటకు నేను, దేవీ, హరీష్గార్లు కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మళ్లీ ఈపాటతో మీ ముందుకు వచ్చాం’’ అని తెలి΄ారు చంద్రబోస్. ‘‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ నాకు ప్రత్యేకమైనపాట. మైత్రీ మూవీ మేకర్స్ నా హోమ్ బ్యానర్ వంటిది. ఈ నిర్మాతలకు సినిమా అంటే ఎంతో తపన’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. -
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్‌గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్‌నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్‌తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్‌లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్‌తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
టాలీవుడ్లో సాధారణంగా దర్శకులు, అభిమానుల మధ్య గొడవలు, విమర్శలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవయితే.. ఫ్యాన్స్ అంతా దర్శకుడిని ట్రోల్ చేస్తుంటారు. అతన్ని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్ మధ్య తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గతంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్పై కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించి, నెగటివిటీ ప్రచారం చేశారు. దీంతో తన పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో హరీష్ శంకర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.అయితే, తాజాగా విడుదలైన సినిమా అప్డేట్స్, టీజర్లు చూసిన అభిమానులు హరీష్ శంకర్ విజన్‌పై పూర్తి నమ్మకం పెంచుకున్నారు. దీంతో నిన్న ఒక అభిమాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. "గతంలో జరిగిన పొరపాట్లను మన్నించి, అందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి" అని వినమ్రంగా కోరారు.ఈ అభ్యర్థనకు హరీష్ శంకర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. "గతాన్ని మర్చిపోదాం.. మనమంతా ఒకటే కుటుంబం. సినిమాను కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ తక్షణమే ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు. సినిమా రీలీజ్ సమయం దగ్గర పడడంతో హరీశ్ అన్‌బ్లాక్ చేయడం మొదలు పెట్టాడు. మరి పవన్ ఫ్యాన్స్, హరీష్‌ల మధ్య ఈ సఖ్యత ఇలానే కొనసాగుతుందా లేదా రిలీజ్ వరకే పరిమితం అవుతుందా చూడాలి. Come on Boys…. We all are family Forget the past …Lets make a Blast 😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗#UstaadBhagatSingh https://t.co/xSiV1zV6tH— Harish Shankar .S (@harish2you) January 24, 2026 -
నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తీసేశారా?.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ..!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సాక్షిని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించింది. తనను తీసివేశారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు కీలక పాత్ర పోషించే అవకాశముందని సాక్షి వైద్య తెలిపింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి వల్ల నేను వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి మరుసటి రోజే షూటింగ్ ప్రారంభ కానుందని నాతో చెప్పారు. కానీ ఆ పరిస్థితుల్లో నేను డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చింది. సాక్షి వైద్య మాట్లాడుతూ..' తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తీసేశారని వార్తలొచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక ఆ ఛాన్స్ వదులుకున్నా. కానీ నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పట్టించుకోను' అని తెలిపింది.కాగా.. సాక్షి వైద్య ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఆమె శర్వానంద్ సరసన నటించిన నారీ నారీ నడుమ మురారి జనవరి 14న విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త కూడా హీరోయిన్గా కనిపించనుంది. -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
బర్త్ డే స్పెషల్
దక్షిణాదిలోని యంగ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు శ్రీలీల. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పుట్టినరోజు జూన్ 14న. ఈ సందర్భంగా తెలుగులో ఆమె నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్, మాస్ జాతర, లెనిన్’ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్ రిలీజ్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి΄ారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.అలాగే ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ–హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పై మూడు సినిమాల నుంచి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
సినిమాలకు దూరంగా శ్రీలీల.. ఇప్పుడేం చేస్తుంది?
నాలుగు నెలల కిత్రం.. టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేంది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా..అమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావుడి చేసి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా? మీరనకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీలను. నాలుగు నెలల్లో అర డజనుకు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల..ఇప్పుడు సైలెంట్ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు? పెళ్లి సందడిలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్ హిట్ కావడం.. దానికి తన గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అవ్వడంతో.. శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ, తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్, బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసింది. రామ్ ‘స్కంధ’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, నితిన్ ‘ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్ టాక్ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్ కేసరి’మాత్రం హిట్ టాక్‌కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇక సంకాంత్రికి వచ్చిన ‘గుంటూరు కారం’. కూడా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది.ఆ సినిమాకు వచ్చిన ఆ కాస్త హిట్ క్రెడిట్ కూడా మహేశ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఇప్పడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాలీ సమయం దొరకడంతో చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దాం అనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెజాన్ ప్రైమ్‌లో ఏకకాలంలో బోలెడు సినిమాలు విడుదల!
ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో క్రేజీ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈవెంట్లో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రాబోయే వెబ్ సిరీస్ లిస్ట్‌ను ఒకే రోజు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు పలు తెలుగు సినిమాలు అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో సందడి చేయబోతున్నాయి. అలాగే సిటాడెల్: హనీ బన్నీ,మీర్జా పూర్-3, పాతాళ్ లోక్-2, బందిష్ బండిట్స్, పంచాయత్-3, గుల్కంద్ టేల్స్, ది రానా కనెక్షన్, ఇన్ ట్రాన్సిస్ట్, రంగీన్, మట్కా కింగ్, దల్దల్, డేరింగ్ పార్ట్నర్స్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, సుబేదార్, ఉప్పు కప్పురంబు లాంటి వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త సినిమాలివే టైటిల్: గేమ్ ఛేంజర్; నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ టైటిల్: ఫ్యామిలీస్టార్; నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టైటిల్:కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు టైటిల్: ఉస్తాద్భగత్ సింగ్; నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల టైటిల్: హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ టైటిల్: కాంతార 2; నటీనటులు: రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్ టైటిల్: తమ్ముడు; నటీనటులు:నితిన్, సప్తమి, లయ టైటిల్: ఓమ్ భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్: అశ్వత్థామ; నటీనటులు: షామిద్ కపూర్ టైటిల్: ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి టైటిల్: భాఘీ 4, నటీనటులు: టైగర్ ష్రాప్; నిర్మాత: సాజిద్ నడియాద్వాలా టైటిల్: చందు ఛాంపియన్; నటీనటులు: కార్తిక్ ఆర్య టైటిల్: ఇక్కీస్; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్ అహల్వత్ టైటిల్: స్త్రీ; నటీనటులు: షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ టైటిల్: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ జాబితా సిటాడెల్: హనీ బన్నీ మీర్జా పూర్-3 పాతాళ్ లోక్-2 మట్కా కింగ్ చోరీ2 ది మెహతా బాయ్స్ సుబేదార్ సుడల్ 2 బండిష్ బ్యాండిట్స్ 2 ది మెహతా బాయ్స్ బి హ్యాపీ చీకటి లో యే వతన్ మేరే వతన్ జిద్దీ గర్ల్స్ బ్యాండ్వాలే దిల్ దోస్తీ డైలమా ఫాలో కర్లో యార్ కాల్ మి బే డాల్డల్ ఖౌఫ్ గ్యాంగ్స్ కురుత్తి పునల్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ -
పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్‌గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు! పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్‌లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) -
పవన్ సినిమాను పక్కన పెట్టిన హరీష్ శంకర్.. రవితేజతో హ్యాట్రిక్ ఫిల్మ్!
‘మిరపకాయ్’ వంటి మాస్ హిట్‌ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్ హిట్ చిత్రాన్ని నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఒకే సినిమాకి కుదిరింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. హరీష్ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్ మంచి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. The Magical Mass Combo is back ❤️🔥 Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥 This time, the #MassReunion gets spicier 🔥🔥 Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥 More details soon! pic.twitter.com/OYNmnRuPDx — People Media Factory (@peoplemediafcy) December 13, 2023 -
పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!
హీరో పవన్ కల్యాణ్. అప్పుడెప్పుడో 1996లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పటికీ 30 సినిమాలు కూడా చేయలేదు. తర్వాత వచ్చిన కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతుంటే పవన్ మాత్రం రీమేక్స్ చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. పోనీ చేసినా మూవీస్ ఏమైనా సూపరా అంటే వాటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. సరే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం ఓ రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటి గురించి అయినా గుర్తుందా అంటే అదీ లేదు. తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ సొంత సినిమా పేరే సరిగా చెప్పలేకపోయాడు. తాజాగా తెలుగులో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడాడు. ఈ స్పీచ్‌లోనే తన సినిమా నిర్మాతల గురించి చెప్పాడు. 'వకీల్‌సాబ్ దర్శకుడు దిల్‌రాజు, సర్దార్ భగత్ సింగా.. ఏదో ఉంది సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తొస్తుంది. ఆ సినిమా నిర్మాత నవీన్ నుంచి మద్దతు అయితే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) ఈ స్పీచ్‌లో పవన్ కల్యాణ్ చెప్పింది 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా గురించి. అప్పుడెప్పుడో 2021 సెప్టెంబరులో 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ఈ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎంతకీ ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. కొన్నాళ్లకు 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టైటిల్ మార్చి, షూటింగ్ మొదలుపెట్టారు. కానీ అది కూడా బ్రేకులేస్తూనే వెళ్తోంది. ఇలా సొంత సినిమా పేరే పవన్ కల్యాణ్ మర్చిపోయాడు. మరో సినిమా అయితే పూర్తిగా పక్కనబెట్టేశాడు. అవును 'హరిహర వీరమల్లు' గురించే. 3-4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీని పవన్ పూర్తిగా పక్కనబెట్టేశాడు. షూటింగ్ 50 శాతానికి పైనే పూర్తి చేశారు. కారణమేంటో తెలీదు గానీ అది మూలన పడిపోయింది. ఇదంతా చూస్తుంటే పవన్‌కి సినిమాలపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేనట్లు కనిపిస్తోంది. దీంతో పవన్ మతిమరుపు ఈ రేంజులో ఉందా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఇంతకూ ఎవరీమె..?) Sardar... Bhavadeeyudu...ahhh Ustadd😝😜 kasepu aagi OG kuda anestadu😂😂😂😂😂#UstaadBhagatSingh #PawanKalyan pic.twitter.com/ECGeQcRBN7 — Siva Harsha (@SivaHarsha_23) October 24, 2023 -
జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?
శ్రీలీల.. శ్రీలీల.. శ్రీలీల.. ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తోంది, వినిపిస్తోంది. యువత దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు ఈ బ్యూటీ పేరే తలుచుకుంటున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాలున్నాయి. సాధారణంగా ఓ హీరోయిన్ చేతిలో 2-3 మూవీస్ ఉండటం చాలా గొప్ప. అలాంటిది ఇన్ని సినిమాలంటే ఎక్కడో గట్టిగా రాసిపెట్టినట్లే. అవును శ్రీలీలకు ఒకటి రెండు కాదు చాలా అంశాలు కలిసొచ్చాయి. ఇంతకీ అవేంటి? అందరూ ఈమె వెంట పడటానికి కారణాలేంటనేది ఇప్పుడు చూద్దాం! భాష చాలా ప్లస్ టాలీవుడ్ లోకి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ వీళ్లలో తెలుగులో మాట్లాడేది, డబ్బింగ్ చెప్పేది చాలా అంటే చాలా తక్కువమంది. వీళ్లతో పోల్చుకుంటే శ్రీలీల తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటుంది. పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో అయినా.. తల్లి స్వర్ణలతది తెలుగు కుటుంబం కావడంతో ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకునేవారు. అలా శ్రీలీలకు మాతృభాషపై పట్టు పెరిగింది. (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) హీరోయిన్స్ కొరత తెలుగులో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉండటం శ్రీలీలకు బాగా కలిసొచ్చింది. పూజాహెగ్డే ఫేడౌట్ అయిపోయింది. రష్మిక తెలుగు కంటే మిగతా భాషలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. కృతిశెట్టి పలు సినిమాలు చేసింది గానీ అవన్నీ ఫ్లాప్స్ కావడంతో ఈమెని ఎవరూ పట్టించుకోవట్లేదు. మిగిలిన హీరోయిన్స్ కి స్టార్ హీరోలతో చేసేంత రేంజ్ లేదు. ఇలా అన్నీ కలిసి రావడంతో శ్రీలీలకు వరసపెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. డ్యాన్స్‌ల్లో ఊరమాస్ తెలుగు హీరోయిన్లలో ఊరమాస్ డ్యాన్స్ చేసేది చాలా తక్కువ మంది. అప్పట్లో తమన్నా ఉండేది కానీ ఇప్పుడు ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో డ్యాన్స్ విషయంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీలీల. తెలుగులో తొలి సినిమా 'పెళ్లి సందD'లో క్యూట్ స్టెప్పులేసింది. 'ధమాకా'లో మాత్రం రెచ్చిపోయి మరీ డ్యాన్సులతో దుమ్ముదులిపింది. ఈ పాయింట్ కూడా శ్రీలీలకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) శ్రీలీల.. చిన్నపిల్ల ప్రస్తుతం తెలుగులో పలువురు హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ల వయసు 30 ఎప్పుడో దాటేసింది. కొంతమంది 30లోపు ఉన్నప్పటికీ స్టార్ హీరోల రేంజ్ ని వాళ్ల మ్యాచ్ చేస్తారా అనేది డౌట్. ఇలాంటి సమయంలో శ్రీలీల.. స్టార్ హీరోల సినిమాల్లో వరసపెట్టి ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంప్లీట్ చేయడానికి ఓ మూడేళ్లు పట్టొచ్చని అనుకుందాం. అయినా సరే ఈమెకు పెద్దగా వయసు పెరగదు కదా! ఇలా చిన్నపిల్ల కావడం కూడా శ్రీలీలకు కలిసొచ్చిన అంశం. గ్లామర్‌కి నో కండీషన్స్ కొందరు హీరోయిన్లు యాక్టింగ్ పరంగా సూపర్ టాలెంటెడ్ అయినప్పటికీ గ్లామర్ కి వచ్చేసరికి కండీషన్స్ పెడుతుంటారు. అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీలీల మాత్రం అలాంటి వాటికి అడ్డు చెప్పట్లేదు. 'పెళ్లి సందD'లో లంగా ఓణీలతో, 'ధమాకా'లో మోడ్రన్ గా కనిపించింది. రాబోయే సినిమాల్లోనూ చాలావరకు అన్ని రకాలుగా కనిపించబోతుంది. డైరెక్టర్లు.. ఈమెతో చీరలు కట్టిస్తున్నారు, స్కర్ట్లు వేయిస్తున్నారు. ఇలా ఏది వేసినా శ్రీలీల అందం పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గట్లేదు. ఇలా ఆల్ ఇన్ వన్‌గా ఉండే హీరోయిన్లు.. టాలీవుడ్ కి చాలా అరుదుగా దొరుకుతారు. చెప్పుకుంటూపోతే శ్రీలీలకు బోలెడన్ని అంశాలు కలిసొచ్చాయి. దీంతో జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అక్షరాలా 10 సినిమాల వరకు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే 'నక్క తోక తోక్కేసింది' అనే డైలాగే గుర్తొస్తుంది. (ఇదీ చదవండి: జాలీ మూడ్‌లో జక్కన్న.. ఫ్యామిలీతో కలిసి!) -
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్‌పై పూనమ్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అందులో పవన్ కల్యాణ్ కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. ఇది కచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్‌కు దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పనీపాటా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసింది. 'స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపర్చకూడదు. సినిమా పోస్టర్లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?' అని మండిపడింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వార్తల్లో ఉందామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు. అసలు నీకు, పవన్ కల్యాణ్‌కు ఉన్న గొడవేంటి? అని ప్రశ్నిస్తున్నారు. నీ మీదకు దృష్టి మళ్లాలనే కదా ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @ratnadeeep_ report this to #BhagatSingh union - this is such an insult to the name of revolutionary- huh !!! — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 When u cannot respect revolutionaries atleast don’t insult them - a recent poster release for a movie - insults the name #bhagatsingh by placing it below foot - ego or ignorance ? — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 చదవండి: పెళ్లికి ముందు నా భర్తకు, నాకు వేరేవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయి: హీరోయిన్ -
పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజాహెగ్డే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ ఇటీవలి కాలంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజాను కాస్త దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజా హెగ్డే అవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలో లాంచింగ్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే ప్రచారమా? లేదంటే డేట్స్ సర్దుబాటు కాలేదా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా బయటకు వచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది. -
‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్‌పైకి పోలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ని వదిలింది. సినిమా టైటిల్‌ని మార్పు చేస్తూ..'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్‌తో పాటు ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అనే థీమ్లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥 This time, it's beyond entertainment 😎🔥 Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8 — Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022


