నాలుగు నెలల కిత్రం.. టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేంది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా..అమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావుడి చేసి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా? మీరనకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీలను. నాలుగు నెలల్లో అర డజనుకు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల..ఇప్పుడు సైలెంట్ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు?
పెళ్లి సందడిలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్ హిట్ కావడం.. దానికి తన గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అవ్వడంతో.. శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.
ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ, తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్, బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసింది.
రామ్ ‘స్కంధ’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, నితిన్ ‘ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్ కేసరి’మాత్రం హిట్ టాక్‌కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇక సంకాంత్రికి వచ్చిన ‘గుంటూరు కారం’. కూడా యావరేజ్ టాక్‌ని సంపాదించుకుంది.ఆ సినిమాకు వచ్చిన ఆ కాస్త హిట్ క్రెడిట్ కూడా మహేశ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఇప్పడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాలీ సమయం దొరకడంతో చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దాం అనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment