శ్రీలీల.. శ్రీలీల.. శ్రీలీల.. ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తోంది, వినిపిస్తోంది. యువత దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు ఈ బ్యూటీ పేరే తలుచుకుంటున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాలున్నాయి. సాధారణంగా ఓ హీరోయిన్ చేతిలో 2-3 మూవీస్ ఉండటం చాలా గొప్ప. అలాంటిది ఇన్ని సినిమాలంటే ఎక్కడో గట్టిగా రాసిపెట్టినట్లే. అవును శ్రీలీలకు ఒకటి రెండు కాదు చాలా అంశాలు కలిసొచ్చాయి. ఇంతకీ అవేంటి? అందరూ ఈమె వెంట పడటానికి కారణాలేంటనేది ఇప్పుడు చూద్దాం!
భాష చాలా ప్లస్
టాలీవుడ్ లోకి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ వీళ్లలో తెలుగులో మాట్లాడేది, డబ్బింగ్ చెప్పేది చాలా అంటే చాలా తక్కువమంది. వీళ‍్లతో పోల్చుకుంటే శ్రీలీల తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటుంది. పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో అయినా.. తల్లి స్వర్ణలతది తెలుగు కుటుంబం కావడంతో ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకునేవారు. అలా శ్రీలీలకు మాతృభాషపై పట్టు పెరిగింది.
(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)
హీరోయిన్స్ కొరత
తెలుగులో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉండటం శ్రీలీలకు బాగా కలిసొచ్చింది. పూజాహెగ్డే ఫేడౌట్ అయిపోయింది. రష్మిక తెలుగు కంటే మిగతా భాషలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. కృతిశెట‍్టి పలు సినిమాలు చేసింది గానీ అవన్నీ ఫ్లాప్స్ కావడంతో ఈమెని ఎవరూ పట్టించుకోవట్లేదు. మిగిలిన హీరోయిన్స్ కి స్టార్ హీరోలతో చేసేంత రేంజ్ లేదు. ఇలా అన్నీ కలిసి రావడంతో శ్రీలీలకు వరసపెట్టి ఆఫర్స్ వస్తున్నాయి.
డ్యాన్స్‌ల‍్లో ఊరమాస్
తెలుగు హీరోయిన్లలో ఊరమాస్ డ్యాన్స్ చేసేది చాలా తక్కువ మంది. అప్పట్లో తమన్నా ఉండేది కానీ ఇప్పుడు ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో డ్యాన్స్ విషయంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీలీల. తెలుగులో తొలి సినిమా 'పెళ్లి సందD'లో క్యూట్ స్టెప్పులేసింది. 'ధమాకా'లో మాత్రం రెచ్చిపోయి మరీ డ్యాన్సులతో దుమ్ముదులిపింది. ఈ పాయింట్ కూడా శ్రీలీలకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!)
శ్రీలీల.. చిన్నపిల్ల
ప్రస్తుతం తెలుగులో పలువురు హీరోయిన్లు ఉన్నప‍్పటికీ వాళ్ల వయసు 30 ఎప్పుడో దాటేసింది. కొంతమంది 30లోపు ఉన్నప్పటికీ స్టార్ హీరోల రేంజ్ ని వాళ్ల మ్యాచ్ చేస్తారా అనేది డౌట్. ఇలాంటి సమయంలో శ్రీలీల.. స్టార్ హీరోల సినిమాల్లో వరసపెట్టి ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంప్లీట్ చేయడానికి ఓ మూడేళ్లు పట్టొచ్చని అనుకుందాం. అయినా సరే ఈమెకు పెద్దగా వయసు పెరగదు కదా! ఇలా చిన్నపిల్ల కావడం కూడా శ్రీలీలకు కలిసొచ్చిన అంశం.
గ్లామర్‌కి నో కండీషన్స్
కొందరు హీరోయిన్లు యాక్టింగ్ పరంగా సూపర్ టాలెంటెడ్ అయినప్పటికీ గ్లామర్ కి వచ్చేసరికి కండీషన్స్ పెడుతుంటారు. అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీలీల మాత్రం అలాంటి వాటికి అడ్డు చెప్పట్లేదు. 'పెళ్లి సందD'లో లంగా ఓణీలతో, 'ధమాకా'లో మోడ్రన్ గా కనిపించింది. రాబోయే సినిమాల్లోనూ చాలావరకు అన్ని రకాలుగా కనిపించబోతుంది. డైరెక్టర్లు.. ఈమెతో చీరలు కట్టిస్తున్నారు, స్కర్ట్‌లు వేయిస్తున్నారు. ఇలా ఏది వేసినా శ్రీలీల అందం పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గట్లేదు.
ఇలా ఆల్ ఇన్ వన్‌గా ఉండే హీరోయిన్లు.. టాలీవుడ్ కి చాలా అరుదుగా దొరుకుతారు. చెప్పుకుంటూపోతే శ్రీలీలకు బోలెడన్ని అంశాలు కలిసొచ్చాయి. దీంతో జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అక్షరాలా 10 సినిమాల వరకు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే 'నక్క తోక తోక్కేసింది' అనే డైలాగే గుర్తొస్తుంది.
(ఇదీ చదవండి: జాలీ మూడ్‌లో జక్కన్న.. ఫ్యామిలీతో కలిసి!)
Comments
Please login to add a commentAdd a comment