శ్రీలీల.. శ్రీలీల.. శ్రీలీల.. ఎంత వద్దనుకున్నాసరే మీలో చాలామంది ఈమెనే తలుచుకుంటున్నారు. ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. కాదు కాదు ఈ బ్యూటీ తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. తెలుగులో ఇప్పటివరకు రెండు సినిమాల‍్లో నటించింది.. చేస్తున్నవి మాత్రం ఏడుకి పైనే. ఇక్కడే మీకో డౌట్ రావొచ్చు. అసలు ఈ అమ్మాయిలో అంత స్పెషాలిటీ ఏముందా అని.. జస్ట్ వెయిట్ వాటి గురించి ఈ స్పెషల్ స్టోరీ.
శ్రీలీల బర్త్ డే.. ప్రస్తుతం ఆమె చేస్తున్న మూవీ టీమ్స్ అన్నీ కూడా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ విషెస్ చెబుతున్నాయి. ఈమె డ్యాన్స్ బాగా చేస్తుంది, అందంగా ఉంటుంది, తెలుగు చక్కగా మాట్లాడుతుందని మాత్రమే చాలామందికి తెలుసు. అయితే శ్రీలీల అమెరికాలో పుట్టింది. కానీ ఈమె పుట్టే టైంకి పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు. దీంతో తల్లి స్వర్ణలతతో కలిసి బెంగళూరు వచ్చేసింది. అక్కడే పెరగడంతోపాటు చదువు పూర్తి చేసింది.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?)
మూడేళ్ల వయసులోనే భరతనాట్యం ట్రైనింగ్ తీసుకున్న శ్రీలీల.. డాక్టర్ అవ‍్వాలనుకుంది. 2017లో కోర్సులోనూ జాయిన్ అయింది. అయితే 'కేజీఎఫ్' సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈమెని 2017లో కొన్ని ఫొటోలు తీశాడు. అవి కన్నడ డైరెక్టర్ ఏపీ అర్జున్ దృష్టిలో పడ్డాయి. దీంతో ఆయన తీసిన 'కిస్' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే అందరినీ మెస్మరైజ్ చేసి పడేసింది. 'భరాతే' అని మరో కన్నడ చిత్రంలోనూ నటించింది. ఈ రెండూ 2019లో నెలల గ్యాప్ లో రిలీజయ్యాయి.
అలా జస్ట్ రెండంటే రెండు మూవీస్ తో శ్రీలీల.. కన్నడ ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసింది. అదే టైంలో తెలుగులో 'పెళ్లి సందD' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది కానీ శ్రీలీల లైఫ్ మాత్రం టర్న్ అయిపోయింది. రవితేజతో చేసిన 'ధమాకా' అయితే ఓ విధంగా శ్రీలీల లోని క్యూట్ నెస్, డ్యాన్సింగ్ టాలెంట్ ని అందరికీ తెలిసేలా చేసింది. ఇదే జరిగే టైంకే శ్రీలీల టాలీవుడ్ వన్ ఆఫ్ ది క్రేజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది.
(ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?)
ప్రస్తుతం శ్రీలీల చేతిలో 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'భగవంత్ కేసరి', నితిన్ మూవీ, రామ్-బోయపాటి సినిమా, వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', విజయ్ దేవరకొండతో ఓ మూవీ ఉన్నాయి. ఈ బ్యూటీ అటు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలిసి వర్క్ చేస్తోంది. ఇప్పుడు చేస్తున్న ఏడు సినిమాలతోపాటు మరికొన్ని డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. వీటిలో కొన్ని హిట్ అయినాసరే తెలుగులో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కావడానికి పెద్దగా టైమ్ పట్టదు.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే శ్రీలీలకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. అందంగా ఉంటుంది. తెలుగు బాగా మాట్లాడుతుంది. డ్యాన్స్ అయితే వేరే లెవల్లో చేస్తుంది. 22 ఏళ్లే కాబట్టి.. ఇంకా బోలెడంత ఫ్యూచర్ ఉంది. అదే టైంలో చాలా చలాకీగానూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటు పోతే బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అసలే తెలుగులో ప్రస్తుతం హీరోయిన్ల పెద్దగా కనిపించట్లేదు. ఉన్నోళ్లేమో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. అందుకే అందరు హీరోలు.. శ్రీలీలనే కావాలని అంటున్నారు. ఆల్రెడీ వెరీ టాలెంటెడ్ అయిన ఈమె.. మరికొన‍్నేళ్లలో టాలీవుడ్ ని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- ఐవీవీ సుబ్బరాజు
(ఇదీ చదవండి: శ్రీ లీల స్పీడ్ ని అందుకోలేకపోతున్న స్టార్ హీరోయిన్స్)
Comments
Please login to add a commentAdd a comment