‘మిరపకాయ్’ వంటి మాస్ హిట్‌ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్ హిట్ చిత్రాన్ని నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఒకే సినిమాకి కుదిరింది.
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.
హరీష్ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు
రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.
ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్ మంచి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
The Magical Mass Combo is back ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023
Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥
This time, the #MassReunion gets spicier 🔥🔥
Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥
More details soon! pic.twitter.com/OYNmnRuPDx
Comments
Please login to add a commentAdd a comment