పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్‌గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)
పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు!
పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం.
(ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?)
పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు.
అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు.
(ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?)
Comments
Please login to add a commentAdd a comment