![Harish Shankar Interesting Comments on Colors Swathi in Panchatantram Event - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/colors-swathi.jpg.webp?itok=VVZPLexx)
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది.
ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు.
చదవండి:
జూనియర్ ఎన్టీఆర్‌పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment