Panchatantra
-
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
కథ చెబుతా అంటున్న బ్రహ్మీ.. అదిరిపోయిన ‘పంచతంత్రం’ ఫస్ట్ లుక్
హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం. ఆయన తాజాగా చేసున్న చిత్రం ‘పంచతంత్రం’. మా కథకుడు రెడీ అంటూ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హర్ష పులిపాక రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ‘వేదవ్యాస్’గా బ్రహ్మానందం లుక్ అదిరిపోయింది. మైక్ ముందు నిలుచుని ఎదో చెబుతున్నట్లు ఉన్న ఆయన పోస్టర్ ఆసక్తి గొలుపుతూ, సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. కాగా, ‘అందరికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథే ఈ చిత్రం. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంటుందని’ చిత్ర యూనిట్ తెలిపింది. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్వాతి రెడ్డి ఈ మూవీతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. ఇందులో లేఖ అనే పాత్రలో నటిస్తున్న శివాత్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపింది. దేవి పాత్రలో నటిస్తున్న దివ్య శ్రీపాద ఫస్ట్‌లుక్‌ని పదిరోజుల క్రితం విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని, ఈ సినిమాలో అన్ని పాత్రల్లో అందరికి కచ్చితంగా నచ్చే పాత్ర ఈమెదని దర్శకుడు తెలిపాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేసేలా చిత్ర యూనిట్ పనులు వేగవంతం చేస్తోంది. మా కథకుడు రెడీ!🎙️ Presenting #Brahmanandam garu as Vedavyas from #Panchathantram. Get ready to experience the tale of senses as the Master unfolds it!@Ticket_Factory @Harsha_Pulipaka @AkhileshTF @nooble451 @amrajknalli @prashanthvihari @VavvetiUsha @Panchathantram pic.twitter.com/IdPU0tbH4k — S Originals (@SOriginals1) September 18, 2021 -
కాపీ హాసన్!
ఆ సీన్ - ఈ సీన్ ‘పంచతంత్రం’... రిటన్ బై కమల్ హాసన్. ‘పోతురాజు’... డెరెక్టైడ్ బై కమల్ హాసన్. విశ్వనాయకుడు ముఖ్యపాత్రల్లో నటించి రూపొందించిన సినిమాలు ఇవి. మొదటిది 2002లో వచ్చింది. మరోటి 2004లో వచ్చింది. ఇవి సూపర్‌హిట్ సినిమాలు. ఇంకో పోలిక ఏమిటంటే.. రెండు సినిమాల్లోనూ విదేశీ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. కమల్ విదేశీ సినిమాల స్ఫూర్తితో సినిమాలు రూపొందిస్తాడనే వాదనకు బలాన్ని ఇస్తాయివి. అయితే కమల్ ఎలాంటి కథనైనా లోకలైజ్ చేయగలడు.. మూలాల ప్రభావం లేకుండా తన సృజనాత్మకతను చాటగలడు అనే మాటకు కూడా రుజువులు ఈ సినిమాలు. తమిళనాడు గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కట్టిన సినిమా ‘పోతురాజు’. తమిళంలో ‘వీరుమాండి’ పేరుతో రూపొందిన ఈ సినిమా అంతర్లీనంగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఉరిశిక్షపై గొప్ప చర్చలా సాగుతుంది. అత్యంత వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఉరి రద్దు డిమాండ్‌ను వినిపించే కమల్ దర్శకత్వ ప్రతిభకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ఈ అద్భుత సినిమా కథ, కథనాల క్రెడిట్ పూర్తిగా కమల్‌కే దక్కుతాయి. అయితే ఈ కథా కథనాలను వినిపించే విధానంలోనే కమల్‌పై ‘రషోమన్ ఎఫెక్ట్’ కనిపిస్తుంది. జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ‘రషోమన్’ సినిమా కథను చెప్పిన పద్ధతిలోనే కమల్ ‘పోతురాజు’ కథను వివరించాడు. ‘నీకు తెలిసింది ఒకటి.. నాకు తెలిసింది మరోటి.. అసలు నిజం ఇంకోటి’ అనే తాత్వికతను తెరపై ఆవిష్కరించేదే ‘రషోమన్ ఎఫెక్ట్’. అకిరా కురసోవా తన ‘రషోమన్’ స్క్రిప్ట్ విషయంలో తొలిసారి ఈ ప్రక్రియను అనుసరించాడు. దీంతో దీనికి రషోమన్ ఎఫెక్ట్‌గా పేరు. ఇదెలా ఉంటుందంటే పోతురాజు సినిమాలో చూపినట్టుగా... మొదట కథ అంతా విలన్ పశుపతి పాత్ర ద్వారా చెప్పిస్తారు. ఆ తర్వాత అవే సంఘటనల గురించి కమల్ చేసిన పోతురాజు పాత్ర చేత చెప్పిస్తారు. పరస్పర విరుద్ధమైన తీరున కథను వివరిస్తాయి ఆ పాత్రలు. 1950లో వచ్చిన రషోమన్ సినిమాతో ఇలా కథను వివరించాడు అకిరా. తర్వాత ఆ పద్ధతిని అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ‘పోతురాజు’ కూడా ఒకటి. ఇక్కడ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. కథ చెప్పే విధానంలో కమల్ అకిరాను ఫాలో అయ్యాడేమో కానీ, అసలు కథ, కథనాల విషయంలో మాత్రం అణువణువునా కమల్ శ్రమ కనిపిస్తుంది. అది పోతురాజు వెనుక ఉన్న కథ. ఇక ‘పంచతంత్రం’ సంగతి. ఐదుగురు స్నేహితులు. ఉల్లాసంగా గడపడానికి బయలుదేరతారు. బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఒక కాల్గాళ్తో ఆనందించాలనేది వారి ప్రణాళిక. ఈ ప్రయత్నంలో వారు అనుకోని చిక్కుల్లో పడతారు. ఈ చిన్న పాయింట్‌ను మాత్రమే అమెరికన్ సినిమా ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ నుంచి తెచ్చుకొన్నారు కమల్. దాన్ని గొప్ప కామెడీ ఎంటర్ టైనర్‌గా మార్చి లోకలైజ్ చేస్తూ ‘పంచ తంత్రం’ కథను తీర్చిదిద్దాడు. ఎలాంటి బ్యాడ్ మూడ్‌నైనా మార్చేసి మనసును తేలిక పరిచే సినిమా ‘పంచతంత్రం’. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్‌తో సహా నలుగురు దక్షిణాది నటులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఇది. ఆద్యంతం నవ్వులు పండించే ఈ సినిమాకు కమల్, క్రేజీ మోహన్‌లు రచ నా బాధ్యతలు తీసుకున్నారు. ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ అనేది ఒక ట్రాజెడీ మూవీ. అయితే పంచతంత్రం మాత్రం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ట్రీట్మెంట్ విషయంలో రెండు సినిమాలకూ ఎక్కడా పోలిక ఉండదు. అయితే మూల కథ కాపీ అనే ముద్ర మాత్రం మిగిలిపోయింది. - బి.జీవన్‌రెడ్డి