కథ చెబుతా అంటున్న బ్రహ్మీ.. అదిరిపోయిన ‘పంచతంత్రం’ ఫస్ట్‌ లుక్‌ | Brahmanandam First Look From Telugu Movie Panchatantram | Sakshi
Sakshi News home page

Panchathantram Movie: కథ చెబుతా అంటున్న బ్రహ్మీ.. అదిరిపోయిన ‘పంచతంత్రం’ ఫస్ట్‌ లుక్‌

Published Sat, Sep 18 2021 2:28 PM | Last Updated on Sat, Sep 18 2021 2:33 PM

Brahmanandam First Look From Telugu Movie Panchatantram - Sakshi

హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం. ఆయన తాజాగా చేసున్న చిత్రం ‘పంచతంత్రం’. మా కథకుడు రెడీ అంటూ ఆయన ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హర్ష పులిపాక రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇందులో ‘వేదవ్యాస్‌’గా బ్రహ్మానందం లుక్‌ అదిరిపోయింది. మైక్‌ ముందు నిలుచుని ఎదో చెబుతున్నట్లు ఉన్న ఆయన పోస్టర్‌ ఆసక్తి గొలుపుతూ, సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. కాగా, ‘అందరికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథే ఈ చిత్రం. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంటుందని’ చిత్ర యూనిట్‌ తెలిపింది. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్వాతి రెడ్డి ఈ మూవీతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెడుతోంది.  ఇందులో లేఖ అనే పాత్రలో నటిస్తున్న శివాత్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపింది. దేవి పాత్రలో నటిస్తున్న దివ్య శ్రీపాద ఫస్ట్‌లుక్‌ని పదిరోజుల క్రితం విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని, ఈ సినిమాలో అన్ని పాత్రల్లో అందరికి ‍కచ్చితంగా నచ్చే పాత్ర ఈమెదని దర్శకుడు తెలిపాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేసేలా చిత్ర యూనిట్‌ పనులు వేగవంతం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement