Brahmanandam And Swathi Panchathantram Movie Teaser Out - Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ టీజర్‌

Published Wed, Oct 13 2021 2:28 PM | Last Updated on Sun, Oct 17 2021 3:31 PM

Brahmanandam And Colors Swathi Panchathantram Teaser Release - Sakshi

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్‌ స్వాతి, శివాత్మిక రాజశేఖర్‌, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రానికి హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌తో పంచతంత్ర కథలను బెబుతూ విడుదలైన ఈ టీజర్‌ ఆసక్తిగా సాగింది.  

‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్‌ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది’ అంటూ ప్రారంభమైంది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ మూవీగా పంచతంత్రం చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అఖిలేష్ వర్ధన్‌, సృజన్‌లు నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement