
సాక్షి, హైదరాబాద్ : తెలుగులో సత్తా చాటిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి ఔరా అనిపించింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవి నటన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ నేపథ్యం, భాష, యాసలతో సాయిపల్లవి అలరించింది. దీంతో ఈచిత్రానికి భారీ వసూల్లు వచ్చాయి.
తెలుగులో సత్తా చాటిన ఈచిత్రం దక్షిణాదిన మరో భాషలోకి అనువాదం అవుతోంది. మలయాళంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డబ్బింగ్ సైతం దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. ఇందులో భాగంగా మలయాళం ట్రైలర్‌ను చిత్ర హీరో వరుణ్ తేజ్ తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేశారు. తర్వాతి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వరుణ్ తెలిపాడు. సాయిపల్లవి ఇప్పటికే మలయాళం ప్రేక్షకులకు సుపరిచయం. ప్రేమమ్‌లో మలర్ పాత్ర ద్వారా మలయళ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment